Praja Deveena
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 11:32 am Posted by : praja deveena

BRS R. S. Praveen Kumar altimate to government : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అల్టిమేటం, గ్రీన్ ఎస్ఎం అగ్రిగేటర్ లైసెన్స్ రద్దుచేయాలి, క్యాబ్‌లకు వెంటనే రేట్ కార్డు ప్రకటించాలి

–గ్రీన్ ఎస్ఎం కంపెనీకి అనుమ తుల వెనుక మతలబేంటి
–ఆరు లక్షల మంది ఆటో, క్యాబ్ డ్రైవర్ల జీవితాలతో చెలగాటమా

BRS R. S. Praveen Kumar altimate to government : ప్రజా దీవెన, హైదరాబాద్:తెలంగాణలో గ్రీన్ ఎస్ఎం కంపెనీకి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్య క్తం చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రవ్యా ప్తంగా సుమారు ఆరు లక్షల మంది ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఉపా ధి ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చే శారు. గ్రీన్ ఎస్ ఎం కంపెనీకి అనుమతులు ఇ వ్వడం వెనుక కమీషన్ల వ్యవహా రం ఉందని ఆరోపించారు. గురువారం హై ద రాబాద్‌ లోని తెలంగా ణ భవన్‌లో ఆయన మీడియాతో మా ట్లాడారు. మహిళలకు ఉ చిత బస్సు ప్రయాణం కల్పించే మ హాలక్ష్మి పథ కానికి తాము వ్యతిరేకం కాదని, విదేశీ పెట్టుబడు లను కూడా స్వాగతిస్తామని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. అయితే పెట్టు బడుల పేరుతో స్థాని కంగా జీవనోపాధి పొందు తున్న లక్షలాది మంది డ్రైవర్ల జీవితాల ను దెబ్బతీయడం సరైంది కాదన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీ ఆర్ అనేక విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చినా స్థానిక ఉపాధికి నష్టం కలగ కుం డా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు.

వియత్నాంకు చెందిన గ్రీన్ ఎస్ ఎం కంపెనీ క్యాబ్‌లు ఇప్పటికే హైదరాబాద్ రోడ్లపై తిరుగుతు న్నా యని, ఆ కంపెనీకి అను మతులు ఇచ్చే ముందు స్థానిక డ్రైవర్ల సంఘాలతో చర్చించి ఉండాల్సిందని అన్నారు. ఎలాంటి సమగ్ర అధ్యయనం లేకుం డా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని విమ ర్శించారు.

   రూ.8కే కిలోమీటర్ ప్రయాణమా

గ్రీన్ ఎస్ఎం కంపెనీ కిలోమీటర్‌ కు కేవలం రూ.8 మాత్రమే వసూ లు చేస్తామని ప్రకటించడం అనేక అనుమానాలకు తావిస్తోందని ప్ర వీణ్ కుమార్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బేస్ ఫేర్‌కు సంబంధించి నిబంధ నలు ఉండగా, ఇంత తక్కువ ధ రతో సేవలు ఎలా అందిస్తారని ని లదీశారు. కంపెనీకి అగ్రిగేటర్ లై సెన్స్ ఎలా మంజూరు చేశా రు? దానికి సంబంధించిన నోట్‌ఫైల్‌ ను ప్రభుత్వం బహిర్గతం చేయా లని డిమాండ్ చేశారు.మొదట తక్కువ ధరలతో విని యోగదా రులను ఆకర్షించి, మార్కెట్‌లో ఆధిపత్యం సాధించి న తర్వాత ధరలు పెంచే విధానం గతంలో టెలికాం రంగంలో జియో ప్రవేశ సమయంలో కనిపించిందని ఉ దాహరణగా పే ర్కొన్నారు. అదే తరహాలో గ్రీన్ ఎస్ఎం కూడా వ్యవహరించే ప్రమాదం ఉందని హె చ్చరించారు.

రుణాలతో వాహనాలు కొన్న డ్రైవర్ల పరిస్థితి ఏంటి

ఆటో, క్యాబ్ డ్రైవర్లు బ్యాంకు రు ణాలు, బంగారం తాకట్టు పె ట్టి వాహనాలు కొనుగోలు చేశారని, ప్రతి నెలా ఈఎంఐలు, వడ్డీ లు చె ల్లిస్తూ కుటుంబాలను పోషించు కుంటున్నారని తెలిపా రు. ఇప్ప టికే ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థల ద్వారా సరై న బుకింగ్స్ రావడం లేదని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఇ లాంటి సమయంలో కొత్త కంపెనీ లకు అనుమతు లు ఇచ్చి వారి ఉపాధిని మరింత సంక్షోభంలోకి నెట్టడం తగద న్నారు.

గతంలో ఆటో డ్రైవర్లకు రూ.5 ల క్షల బీమా సదుపాయం, వా హనాల కొనుగోలుకు సబ్సిడీలు అందించామని పేర్కొం టూ, కాం గ్రెస్ ప్రభుత్వం రూ.10 లక్షల బీ మా, నెలకు రూ.12 వేల ఆర్థిక స హాయం వంటి హామీలను అమ లు చేయడం లేదని విమర్శించా రు. మహాలక్ష్మి పథకం ప్రభావం తో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారని, పలువురు ఆత్మహ త్యలకు పాల్పడ్డా రని ఆరోపించారు.

     క్యాబ్ డ్రైవర్లకు రేట్ కార్డు ఇదే

ప్రభుత్వం వెంటనే క్యాబ్ డ్రైవర్ల కు ప్రత్యేక రేట్ కార్డు ప్రకటించాల ని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశా రు. ఆయన ప్రతిపాదించిన ధర లు ఇలా ఉన్నాయన్నారు.నాన్ ఏసీ క్యాబ్ కిలోమీటర్‌కు రూ.35,ఏసీ క్యాబ్ కిలోమీటర్‌కు రూ.38,ప్రీమి యం ఏసీ క్యాబ్ కిలోమీటర్‌కు రూ.42, ఎస్‌యూ వీ 6 సీటర్ నాన్ ఏసీరూ.52, ఎస్‌యూవీ 6 సీటర్ ఏసీ రూ. 58,ఎస్‌యూ వీ 6 సీటర్ ప్రీమి యం ఏసీ: రూ.62 అలాగే ఆటో రేట్ కార్డు లోనూ జీవో 46ను స వరించి, అదనపు కిలోమీటర్‌కు ప్రస్తు తం ఉన్న రూ.14ను రూ. 2 4కు పెంచాలని కోరారు. తమిళ నాడులో అమలు చేస్తున్న ఆటో చార్జీల విధానాన్ని తెలంగాణ ప్ర భుత్వం పరిశీలించాలని సూచిం చారు.

పార్ట్‌నర్ పేరుతో కార్మిక హక్కు లకు కోతా?

గ్రీన్ ఎస్ఎం కంపెనీ ‘డ్రైవర్ కా దు.. పార్ట్‌నర్ కండి’ అనే నినా దంతో ముందుకు రావడంపై ఆ యన అభ్యంతరం వ్యక్తం చేశా రు. డ్రైవర్‌గా పనిచేస్తే ఈపీఎఫ్, ఈఎస్ఐ, బీమా వంటి చట్టబ ద్ధ మైన ప్రయోజనాలు కల్పించాల్సి ఉంటుందని, పార్ట్‌నర్ పే రుతో ఆ బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం జరుగు తోందని ఆరో పించారు.వారానికి రూ.8 వేలు చెల్లిస్తామని చె బుతూ 500 కిలో మీటర్లు వాహనం నడపాలని షరతులు విధిస్తున్నారని తెలిపా రు. వాహనంపై చిన్న గీతలు పడి నా జరిమానాలు విధించే నిబం ధనలు ఉన్నాయని, క్యాబ్‌లలో కెమెరాల ఏర్పాటు ప్రయాణికుల వ్య క్తిగత గోప్యతకు భంగం కలి గించే అవకాశముందని ఆందోళ న వ్యక్తం చేశారు.

ప్రభుత్వానికి బీఆర్ఎస్ డిమాండ్లు

ఆటో, క్యాబ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది.క్యాబ్ డ్రైవర్లకు వెంటనే అధికారిక రేట్ కార్డు ప్రకటించాలి,గ్రీన్ ఎస్ఎం కంపెనీ కార్యకలాపాలను నియంత్రించా లి,కంపెనీకి ఇచ్చిన అగ్రిగేటర్ లై సెన్స్‌ను రద్దు చేయాలి,ఆటో, క్యాబ్ డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏ ర్పాటు చేయాలి, డ్రైవర్లకు నెల కు రూ.12 వేల ఆర్థిక సహా యం అందించాలి, జీవో 46ను సవ రించి ఆటో డ్రైవర్ల చార్జీల ను పెం చాలని డిమాండ్ చేశారు.ఆటో క్యాబ్ జేఏసీ చేస్తున్న పోరాటాని కి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలి పారు. పేద కు టుంబాల నుంచి వచ్చిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమస్యపై ముఖ్యమంత్రితో మాట్లాడి డ్రై వర్లను ఆదుకోవాలని సూచించారు.

ఆరులక్షల కుటుంబాల భవిష్యత్తును కాపాడాలి

ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజల ఉపాధిని పెంచేలా ఉం డాలి తప్ప, ఉన్న ఉపాధిని దెబ్బతీ సేలా ఉండకూడదని ప్రవీ ణ్ కు మార్ హితవు పలికారు. రైతు లు, ఆటో డ్రైవర్లు ఇప్పటి కే అ నేక సమస్యలు ఎదుర్కొంటున్నా రని, ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లను కూడా సంక్షోభంలోకి నెట్టవద్దని కోరారు. కమీషన్ల కోసం స్థానిక డ్రైవర్ల జీవితాలను బలిచేయవ ద్దని ప్రభుత్వా న్ని హెచ్చరించారు.ఈ సమావేశంలో ఆటో క్యాబ్ జేఏసీకి చెందిన ఏఐటీయూసీ, బీఆర్‌టీయూ, సీఐటీయూ, టీ యూసీ ఐ, టీఎన్‌టీయూసీ, అ మ్మ క్యాబ్, ఏక్తా అసోసియేషన్ తదిత ర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.