ఎర్రజెండా పోరాట వారసత్వాన్ని కాపాడుకోవాలి
–కార్పొరేట్ అనుకూల విధానాల తో వ్యవసాయ రంగానికి నష్టం
–కేంద్ర ప్రభుత్వ విధానాలపై బృందా కారత్ విమర్శలు –మహిళా రైతులకు గుర్తింపు, భూసంస్కరణలు అమలుకు డి మాండ్
Thousands of farmers march town streets echo with slogans : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ గడ్డపై జరిగిన తెలంగాణ సా యుధ రైతాంగ పోరాట వారసత్వాన్ని మతతత్వ రాజకీ యా లకు ఆపాదించే ప్రయత్నాలను తిప్పి కొట్టాలని మాజీ పార్లమెం ట్ సభ్యురాలు, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ నాయకురాలు బృందా కారత్ పిలుపుని చ్చారు. రైతులు, వ్యవసాయ కార్మి కులు, గ్రామీణ పేదల హ క్కుల కోసం కిసాన్ సభ తొమ్మిది దశాబ్దాలుగా పోరాడుతోంద ని పేర్కొన్నారు. ఆదివారం నల్ల గొండ పట్టణంలోని ఎన్జీ కళా శాల ప్రాంగణంలో 36వ అఖిల భారత కిసాన్ సభ మహాసభల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిం చారు.ఈ చారిత్రాత్మక మహాసభల కు హాజరైన రైతులు, ప్రతి నిధులు, కార్యకర్తలకు హృదయపూ ర్వక శుభాకాంక్షలు తెలి పారు. ఆదివాసీ నాయకుడు, స్వా తంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా 151వ జయంతి సం దర్భంగా ఆయనకు ని వాళులర్పించారు. జల్, జంగిల్, జమీన్ హక్కుల కోసం ఆయన సాగించిన పోరాటాన్ని స్మరించుకు న్నారు.
తెలంగాణ పోరాటం రైతాంగ విముక్తి కోసం సాగింది
కిసాన్ సభ ఏర్పడిన నాటి నుంచి 90 ఏళ్లుగా ఎర్రజెండా రైతు లు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల పక్షాన నిలిచిందని బృందా కారత్ అన్నారు. బ్రిటిష్ పాలకులు, భూస్వామ్య వ్య వస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో రైతాంగాన్ని స్వాతం త్ర్య ఉద్యమంలో భాగస్వాములను చేసిన ఘనత కిసాన్ సభ దేనన్నారు. కాశ్మీర్ నుంచి కేరళ వరకు, బెంగాల్లో తెభాగా పో రాటం నుంచి మహారాష్ట్రలో వార్లీ తిరుగుబాటు వరకు, దేశ వ్యాప్తంగా జరిగిన రైతాంగ పోరాటాల్లో ఎర్రజెండా నాయ కత్వం వహించిందని వివరించారు.
నల్లగొండ జిల్లాలో నిజాం పాలనకు, భూస్వామ్య దేశ్‌ముఖ్‌ల దోపిడీకి, రజాకార్ల అండతో కొనసాగిన వెట్టిచాకిరీకి వ్యతిరేకం గా సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చరిత్రాత్మ కమైందన్నారు. మూడు వేలకుపైగా గ్రామాలను భూస్వామ్య బంధనాల నుంచి విముక్తి చేసి, దున్నేవాడికి భూమి దక్కాలనే లక్ష్యంతో ఆ పోరాటం సాగిందని పేర్కొన్నారు. ఆ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య, భూస్వామ్య శక్తులను ఎది రించిన చాకలి ఐలమ్మ, పుచ్చలపల్లి సుందరయ్య, మల్లు స్వ రాజ్యం తదితరుల సేవలను స్మరించుకున్నారు. నాలుగు వేల మంది అమరవీరుల త్యాగాలను కొనియాడుతూ లాల్‌సలాం ప్రకటించారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హిందూ, ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరించేందుకు బీజేపీ, ఆర్ఎస్ ఎస్ ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. అది మతపరమైన పోరాటం కాదని, భూస్వామ్య దోపిడీ నుంచి రైతాంగాన్ని విము క్తి చేయడానికి సాగిన లౌకిక పోరాటమని స్పష్టం చేశా రు. ఆ పోరాట వారసత్వాన్ని మతతత్వ రాజకీయాల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
కార్పొరేట్లకు అనుకూలంగా ప్రభుత్వ విధానాలు
దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్య సంస్థలు, లౌకిక విలువలు, సమానత్వ సూత్రాలను బలహీనపరిచే విధానాలను కేంద్రంలో ని మోదీ ప్రభుత్వం అనుసరిస్తోందని బృందా కారత్ విమ ర్శిం చారు. విదేశీ కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు, పెద్ద వ్యవసాయ వ్యాపార సంస్థలకు అనుకూలంగా వ్యవసాయ విధానాలు రూ పొందిస్తున్నారని ఆరోపించారు. మూడు వ్యవసాయ చట్టాల కు వ్యతిరేకంగా రైతులు సాగించిన పోరాటంతో కేంద్ర ప్రభు త్వం వెనక్కి తగ్గాల్సి వచ్చిందని గుర్తుచేశారు. అయినప్పటికీ రైతుల ప్రయోజనాలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయ త్నాలు కొనసాగుతున్నాయని అన్నారు.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం వల్ల వివిధ రంగాల రైతు లకు నష్టం కలిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. రైతులతో చర్చించకుండా ఇటువంటి ఒప్పందాలపై ముందుకు వెళ్లడం సరికాదన్నారు. ఆ ఒప్పందాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ పరిణామాలు, యుద్ధాల ప్రభావంతో ధరలు పెరుగుతున్నాయని చెబుతున్న ప్రభుత్వం, ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, పప్పులు, నూనెలు, ఇతర నిత్యావసర వస్తువులను సబ్సిడీపై అందించాలని కోరారు.
రైతు ఆత్మహత్యలు ఆగాలంటే విధానాలు మారాలి
దేశంలోని పలు ప్రాంతాల్లో రైతులు కరువు, వరదలతో తీవ్రం గా నష్టపోతున్నారని బృందా కారత్ అన్నారు. తెలంగాణలో కరువు పరిస్థితులు, పంట నష్టాలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. పంట నష్టానికి అందుతున్న పరిహారం సరిపోవడం లేదని, మరోవైపు బీమా కంపెనీలు లా భాలు పొందుతున్నాయని విమర్శించారు. రైతులకు పూర్తిస్థా యిలో పరిహారం అందించాలని, బీమా సంస్థల దోపిడీని అరిక ట్టాలని డిమాండ్ చేశారు.
ఎన్సీఆర్బీ
గణాంకాల ప్రకారం గత 12 ఏళ్లలో దేశంలో లక్ష న్నర వ్యవసాయ సంబంధిత ఆత్మహత్యలు నమోదయ్యా యని ఆమె ప్రస్తావించారు. వ్యవసాయ సంక్షోభం తీవ్రతకు ఇవి నిదర్శనమన్నారు. గ్రామీణ పేదలు, భూమిలేని కూలీలు, చిన్న రైతులకు ఉపాధి హామీ పథకం జీవనాధారంగా ఉండే ద ని, ఆ పథకాన్ని బలహీనపరిచే చర్యలు సరికావన్నారు. మహా త్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధ రించి, కూలీలకు పని కల్పించాలని డిమాండ్ చేశారు.
స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధర
కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ విధానాలు అండగా నిలుస్తుండ గా రైతులకు మాత్రం తగిన ప్రయోజనాలు అందడం లేదని బృందా కారత్ ఆరోపించారు. అదానీ వంటి కార్పొరేట్ సంస్థ లు భారీ లాభాలు ఆర్జిస్తున్నాయని, రైతులకు ఏడాదికి రూ.6 వేల ఆర్థిక సాయం అందిస్తూ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చే సుకుంటోందని విమర్శించారు. రైతులకు అందుతున్నది దా నం కాదని, ప్రజాధనంతో అమలు చేస్తున్న పథకమని వ్యాఖ్యా నించారు.స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని, డీజిల్ ధరలను నియంత్రిం చాలని, విద్యుత్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని కోరారు. స్మార్ట్ మీటర్ల పేరుతో రైతులపై అదనపు భారం మోపవద్దన్నా రు.
భూమిలేని వారికి భూమి ఇవ్వాలి
దేశంలో భూమి పంపిణీలో అసమానతలు పెరుగుతున్నాయ ని బృందా కారత్ పేర్కొన్నారు. గత నాలుగు దశాబ్దాల్లో భూ మి కలిగిన కుటుంబాల మధ్య అసమానతలు తీవ్రంగా పెరి గాయని వివరించారు. అత్యధిక ఆదాయం కలిగిన 20 శాతం గ్రామీణ కుటుంబాల చేతుల్లో 75 శాతానికి పైగా భూమి కేంద్రీ కృతమైందని, మరోవైపు ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న చిన్న రైతులు వ్యవసాయ సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అప్పుల భారం కారణంగా రైతులు భూములను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూ గరిష్ట పరిమితి చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, భూమిలేని పేదలకు భూమి పంపిణీ చేయాలని, సమగ్ర భూసంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మహిళలను రైతులుగా గుర్తించాలి
వ్యవసాయ పనుల్లో సగానికి పైగా మహిళలు భాగస్వాముల వుతున్నప్పటికీ వారికి రైతులుగా గుర్తింపు లభించడం లేదని బృందా కారత్ అన్నారు. మహిళలను ప్రభుత్వ రికార్డుల్లో కు టుంబ సహాయకులుగా పేర్కొనడం సరికాదన్నారు. వ్యవసా యంలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళలకు భూమిపై హక్కు లు కల్పించాలని, ప్రభుత్వ పథకాలు, విధానాల్లో సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మహిళా రైతులకు ప్రత్యేక గుర్తింపు కల్పించి, అన్ని ప్రభుత్వ పత్రాల్లో వారిని రైతులుగానే నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఆదివాసీల హక్కులను కాలరాయొద్దు
అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో లక్షలాది హెక్టార్ల సాగుభూమిని సేకరిస్తూ రైతులను నిర్వాసితులను చేస్తున్నారని బృందా కా రత్ విమర్శించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం అందా ల్సిన పరిహారాన్ని కూడా పలుచోట్ల నిరాకరిస్తున్నారని అన్నా రు. ఈ ప్రక్రియలో ఆదివాసీలు తీవ్రంగా నష్టపోతున్నారని పే ర్కొన్నారు. అటవీ హక్కుల చట్టం అమలును విస్మరిస్తూ పో డు రైతులకు భూమి పట్టాలు ఇవ్వడం లేదని విమర్శించారు.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీల హక్కుల పరిర క్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామసభల అధికారాలను గౌర వించాలని, అటవీ హక్కుల చట్టాన్ని తక్షణమే అమలు చేయా లని డిమాండ్ చేశారు. ఆదివాసీలను ఆక్రమణదారులుగా పరిగణించి తొలగింపులకు పాల్పడవద్దని, అటవీ హక్కుల చట్టంతోపాటు సంబంధిత చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.
పోరాట వారసత్వాన్ని కొనసాగించాలి
దేశవ్యాప్తంగా రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేద లు తమ హక్కుల కోసం పోరాడుతున్నారని బృందా కారత్ అన్నారు. అణచివేత ఉన్నచోట ప్రతిఘటన ఉంటుందని పే ర్కొంటూ, రైతాంగ ఉద్యమాలకు సంఘీభావం తెలిపారు. ఎర్రజెండా కేవలం ఒక రాజకీయ గుర్తు కాదని, న్యాయం, సమానత్వం, శ్రమజీవుల దోపిడీ విముక్తి కోసం సాగుతున్న పోరాటానికి ప్రతీక అని అభివర్ణించారు.కార్పొరేట్ అనుకూల, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిస్తూ అఖిల భారత కిసాన్ సభ 36వ మహాసభలు జయప్రదం కావాలని ఆకాంక్షించారు.
రైతు మహాప్రదర్శనతో దద్దరిల్లిన విప్లవాల ఖిల్లా
విప్లవాల ఖిల్లా నల్లగొండ మరోసారి ఎర్ర జెండాల రెపరెపలతో పులకించి పోయింది. రైతాంగ పోరాటాల చ రిత్రను గుర్తుచే స్తూ వేలాది మంది రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజాసం ఘాల ప్రతిని ధులు నిర్వహించిన మహాప్రదర్శన జిల్లా కేంద్రా న్ని ఉద్యమాల హోరుతో హోరెత్తించింది. అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభల సందర్భంగా ఆదివారం ని ర్వహించిన ఈ భారీ ప్రదర్శన న ల్లగొండ చరిత్రలో మరో మైలు రా యిగా నిలిచింది.ఒకవైపు ఎర్ర జెండాల రెపరెపలు.. మరో వైపు రై తాం గ నినాదాల హోరు.. ఇంకో వైపు సంప్రదాయ కళారూపాల సం దడి.. ఇలా పట్టణంలోని ప్ర ధాన వీధులన్నీ ఉద్యమోత్సా హం తో కళకళలాడాయి. మర్రిగూడ బైపాస్ నుంచి ఎన్జీ కళాశాల వరకు సుమారు నాలుగు కిలో మీటర్ల మేర రెండు గంటలకు పై గా సాగిన ఈ మహాప్రదర్శనలో వేలాదిమంది పాల్గొని రై తాంగ ఐక్యతను చాటిచెప్పారు. తెలంగాణ సాయుధ రైతాంగ పో రాటాని కి పురిటిగడ్డగా, భూమి కోసం.. భుక్తి కోసం సాగిన చారి త్రాత్మక ఉద్యమాలకు సాక్షిగా నిలిచిన నల్లగొండలో ఈ ప్రదర్శ న ప్రత్యేక ప్రాధాన్య తను సంత రించుకుం ది. నాటి వీర తెలంగా ణ రైతాంగ పోరా ట స్ఫూర్తి నేటి రైతాంగ ఉ ద్యమాల్లో నూ కొనసా గుతోందనే సందేశాన్ని ఈ భారీ ప్రదర్శన చాటిచె ప్పింది.
దింసా నృత్యాలు.. కోలాటాలు.. ఎడ్లబండ్ల సందడి
మహాప్రదర్శనలో సంప్రదాయ కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదివాసీ, గిరిజన కళాకారుల దింసా నృత్యాలు, మహిళల కోలాటాలు, పురుషుల చెక్కభజనలు, చిరుత భజనలు, డప్పుల దరువులు, డీజే సప్పుల తో పట్టణ వీధులు మారుమోగా యి. గ్రామీణ వ్యవసాయ సం స్కృతికి ప్రతీకగా నిలిచిన అ లం కరించిన ఎడ్లబండ్ల ప్రదర్శన చూ పరులను విశేషంగా ఆకట్టుకుం ది.ప్రదర్శనకు ముందుభాగంలో రె డ్షర్ట్ వాలంటీర్లు క్రమశిక్షణతో నిర్వహించిన కవాతు ప్రత్యేక ఆ కర్ష ణగా నిలిచింది. ఎర్రజెండాలు చేతబూనిన రైతులు, కార్మికు లు, ప్రజాసంఘాల కార్యకర్తలు నినా దాలతో ముందుకు సాగు తుంటే పట్టణమంతా ఉద్యమ వాతావర ణం నెలకొంది.
కార్పొరేట్ ఆధిపత్యంపై నిరసన గళం
వ్యవసాయ రంగంపై కార్పొరేట్ సంస్థల ఆధిపత్యాన్ని నిరసి స్తూ ప్రదర్శనలో వినూత్న నిరసన కా ర్యక్రమాలు చేపట్టారు. అంబానీ, అదానీ, ప్రధాని మోదీ పేర్లతో ఏ ర్పాటు చేసిన భారీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనను వ్య క్తం చేశారు. రైతు ల సమస్యలు, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్ర భుత్వ విధానాల పై తమ వ్యతిరేకతను నినాదాల రూపంలో వినిపించారు. కార్పొరే ట్ శక్తుల పెత్తనం నుంచి వ్యవసా య రంగాన్ని కాపాడాలనే సందే శంతో రూపొందించిన ప్రదర్శన లు ప్రజల దృష్టిని ఆకర్షించాయి.
మహాప్రదర్శనకు ప్రజాసంఘాల ఘన స్వాగతం
రైతాంగ అగ్రనాయకులు ముం దుండి నడిపించిన ఈ ప్రదర్శన కు నల్లగొండ పట్టణంలోని పలు ప్రజాసంఘాలు ఘన స్వాగ తం పలికాయి. యూటీఎఫ్, సీఐటీ యూ, ఎస్ఎఫ్ఐ, డీవైఎ ఫ్ఐ త దితర సంఘాల నాయకులు, కార్యకర్తలు రహదారుల వెంట ని లబడి రైతులకు స్వాగతం పలి కారు. పూలవర్షం కురిపిస్తూ ప్రద ర్శనలో పాల్గొన్న వారిని ఉత్సా హపరిచారు.
రైతాంగ ఐక్యతకు నిదర్శనంగా మహాప్రదర్శన
వేలాది మంది రైతులు ఒకే వేదిక పైకి వచ్చి తమ ఐక్యతను చాటిన ఈ మహాప్రదర్శన అఖిల భార త రైతు సంఘం 36వ జాతీయ మహాసభలకు విశేష ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. సం ప్రదాయ సంస్కృతి, గ్రామీణ జీవన వైభ వం, పోరాట చరిత్ర, రైతాంగ హ క్కుల నినాదాలు ఒకే వేదికపై ఆవిష్కృతమయ్యా యి.మొత్తంగా నల్లగొండ పురవీధుల్లో సాగిన ఈ రైతాంగ మహాప్రదర్శన కేవ లం ఒక ఊరేగింపుగా కాకుండా.. రైతుల ఐక్యతను, హక్కుల సాధ న పట్ల వారి పట్టుదలను చాటిచె ప్పిన భారీ ప్రదర్శనగా నిలిచింది. నాటి సాయుధ పోరాటాల స్ఫూ ర్తిని గుర్తుచేస్తూ నేటి రైతాంగ స మస్యలపై పోరాటానికి సమాయత్తం కావాలనే సందేశాన్ని ఈ ప్రదర్శన ప్రతిధ్వనింప జేసింది.
Thousands of farmers march town streets echo with slogans




