Praja Deveena
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 11:44 am Posted by : praja deveena

Sammakka Sagar Project NOC : సమ్మక్క సాగర్‌కు పచ్చజెండా, తెలంగాణ విజ్ఞప్తికి ఛత్తీస్‌గఢ్ సానుకూల స్పందన,ఎన్ఓసీ ప్ర క్రియను త్వరగా పూర్తి చేస్తామని సీఎం విష్ణుదేవ్ సాయ్ హామీ

Sammakka Sagar Project NOC : ప్రజా దీవెన, హైదరా బాద్: తెలం గాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సమ్మ క్క సాగర్ (తు పాకులగూడెం) బ్యారేజీకి అవసరమైన అను మతుల విషయంలో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు కు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) మంజూరు చేయాలని తె లంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞ ప్తికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సాను కూలంగా స్పందించింది. ఎన్ఓసీ ప్రక్రియను త్వరితగతిన పూ ర్తి చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ హామీ ఇచ్చారు.

రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్త మ్‌కుమార్‌రెడ్డి సమావేశమ య్యారు. ఈ సందర్భంగా సమ్మ క్క సాగర్ బ్యారేజీకి అవసరమైన ఎన్ఓసీతో పాటు మిగిలిన అను మతులను త్వరగా మంజూరు చేయాలని రేవంత్‌రెడ్డి కోరారు. దీనిపై విష్ణుదేవ్ సాయ్ సానుకూ లంగా స్పందించి, ప్రక్రియను వేగ వంతం చేస్తామని భరోసా ఇచ్చా రు.

పరిహారం, పునరావాసానికి తెలంగాణ సిద్ధం

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పరిధిలో భూసే కరణ, పరిహారం, పునరావా సానికి సంబంధించి అవసరమైన ని ధులను నిబంధనల ప్ర కారం చె ల్లించేందుకు తెలంగాణ ప్రభు త్వం సిద్ధంగా ఉందని సీఎం రే వంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృ ష్టిలో ఉంచు కుని అనుమతుల ప్రక్రియను త్వరగా పూర్తి చే యాలని కో రా రు. తాజా సమావేశంలో లభించి న సానుకూల హామీతో ప్రాజెక్టు తదుపరి కార్యాచరణపై ఆశలు పెరిగాయి.

ఎల్‌నినో పరిస్థితుల్లో నీటి నిల్వలే కీలకం

రాబోయే రోజుల్లో ఎల్‌నినో వా తావరణ ప్రభావంతో తెలంగా ణలో నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉందని రేవంత్‌రెడ్డి వివరిం చారు. ములుగు జిల్లా తుపాకు లగూడెం వద్ద సమ్మ క్క సాగర్ బ్యారేజీ నిర్మాణం ఇప్పటికే పూర్త యిందని, అందు లో నీటిని నిల్వ చేసుకునేందుకు అనుమతులు కల్పించాలని కోరారు. పూర్తిస్థాయి నీటిమట్టం +83 మీటర్ల వద్ద బ్యారేజీ ని ల్వసామర్థ్యం 6.94 టీఎంసీలుగా ఉందని తెలిపారు. కరువు ప్రభావిత, వెనుకబడిన గిరిజన ప్రాంతాలకు సాగునీరు, తాగు నీరు అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని వివరించా రు.ఎన్ఓసీ ప్రక్రియ త్వరగా పూర్త యితే సమ్మక్క సాగర్‌లో నీటి ని ల్వకు మార్గం సుగమం కానుంది. దీంతో గోదావరి జలా లను విని యోగించుకుని గిరిజన, వెనుక బడిన ప్రాంతాల నీ టి అవసరాలను తీర్చేందుకు అవకాశం కలగనుంది.