Praja Deveena
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 3:47 pm Posted by : praja deveena

Strict action will be taken in Cheyutha pensions : చేయూత పింఛన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

–ఇందిరమ్మ జీవిత బీమా పథకం పై విస్తృత ప్రచారం చేపట్టాలి
–నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

Strict action will be taken in Cheyutha pensions:  ప్రజా దీవెన, నల్లగొండ: చేయూత పింఛన్ల పంపిణీ లో ఎవరై నా లబ్ధిదారుల నుంచి డబ్బులు వ సూ లు చేసినట్లు ఫిర్యా దులు వస్తే బాధ్యులపై కఠిన చ ర్యలు తీ సుకుంటామని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ హెచ్చరించారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న ప్రారంభించనున్న ఇందిరమ్మ జీవిత బీమా పథ కాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయా లని, గ్రామాలు, వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిం చాల ని అధికారులను ఆదేశించారు.మంగళవారం ఆయన కలెక్టర్ కార్యాలయం నుండి ఎంపీ డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఇత ర సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ని ర్వ హించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చే యూత పింఛన్ల పంపిణీ బాధ్యతను కార్యదర్శులు, వార్డు అధి కారులే సమర్థవం తంగా నిర్వహించాలని, పంపిణీ సమయం లో ఎలాంటి అక్రమాల కు తావులేకుండా చూడాలని సూచిం చారు.ఈ నెల 19న ప్రా రంభం కానున్న ఇందిరమ్మ జీవిత బీ మా పథకాన్ని అర్హులైన ప్ర జలందరూ సద్వి నియోగం చేసు కునేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

జిల్లాలో ఉన్న సుమారు 4 లక్షల 86 వేల ఇళ్లకు సంబంధించి పథకం వివరాలను ప్రజలకు తెలియ జేయాలన్నారు. గ్రామా ల్లో ఫ్లెక్సీ లు, బ్యానర్లు ఏ ర్పాటు చేయడం తో పాటు, మున్సి పాలిటీల్లో ఆ టోల ద్వారా ప్రచారం నిర్వహిం చాలని, ప్రతి వార్డు లో ప్రత్యేక బ్యానర్లు ఏర్పాటు చేయాలని సూ చిం చారు.రోజుకు 15 వేల ద రఖాస్తులు నమోదు చే సేలా లక్ష్యాన్ని నిర్దేశించుకొని పనిచేయాలని ఆదే శించారు. ప్రతి గ్రామం లో ప్రత్యేక టెంట్ ఏర్పాటు చేసి, దరఖాస్తుల స్వీకరణకు అవసరమైన కంప్యూ టర్లు, ప్రింటర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నా రు.

కంప్యూటర్లు లేని గ్రామాల్లో ఎంపీ డీవో కార్యాల యాల ద్వారా దరఖాస్తులను అప్‌లోడ్ చేయాలని సూచించారు.టీఎంసీ,. కే జిబివి పాఠశాలల్లో అం దుబాటులో ఉ న్న కంప్యూటర్లను కూడా అవ స ర మైన చోట వినియోగించుకోవాలని తెలిపారు. నేరే డుగోమ్మ వై జాగ్ కాలనీ వంటి నెట్‌వర్క్ సౌకర్యం లేని ప్రాంతాల్లో దరఖాస్తులను భౌతికంగా స్వీకరిం చి సంబంధిత కార్యాలయాల్లో అప్‌లోడ్ చేయాల ని ఆదేశించారు. దరఖాస్తుల్లో ఆధార్ నంబర్లు న మోదు చేసే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసు కోవాలని, ఎలాంటి త ప్పులు జరగకుండా ఒకటికి రెం డుసార్లు పరిశీలించిన తర్వాతే ఫారాలు పూర్తి చేయాలని సూ చించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిష నర్లు పూర్తి బాధ్యత వహించాల ని స్పష్టం చేశారు.

వీబిజీ రాంజీ పనులను 100 శా తం పూర్తి చేయా లని, ఇప్పటివర కు పనులు ప్రారంభించని గ్రామా లలో వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదే శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులను భా గ స్వాములను చేసి గ్రామస్థాయి లో పనుల పురోగ తిని వేగవం తం చేయాలన్నారు.జలసిరి పనుల్లో తక్కువ పురోగతి ఉన్న ప్రాంతాలను గుర్తించి, ఇప్ప టికే మంజూరైన పనులను వెంటనే గ్రౌండింగ్ చే యాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించేందుకు అందుబాటులో ఉన్న అవకాశాల ను సద్వినియో గం చేసుకోవాలని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి నిర్దే శిత లక్ష్యాల ను పూర్తి చేయాలని, అంగన్‌వా డీ కేం ద్రాలు, పాఠశాలల్లో మరు గుదొడ్ల నిర్మాణ పనుల ను త్వరి తగతిన పూర్తి చేయాలని ఆదే శించారు. ఎంపిక చేసిన మూడు గ్రామాల్లో చేపట్టాల్సిన పను లకు అవసరమైన అనుమతులు వెం టనే పొంది, ప నులను గ్రౌండింగ్ చేయాలని తెలిపారు. ఎంపీ డీవో లు అన్ని యూనిట్ల పనుల పురో గతిని నిరం తరం పర్యవేక్షించాల ని, సర్పంచులతో సమన్వ యంతో గ్రామాల అభివృద్ధికి సంబంధించిన పను లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అ భివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో అధికారులు స మన్వయంతో, బాధ్యతాయు తంగా పనిచేసి లక్ష్యాలను సాధిం చాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫ రెన్స్లో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా గ్రామీణ అ భివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, పశు సంవర్ధక శాఖ అధికారి జీ. రమే ష్ , మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిష నర్లు, ఎంపీడీ వోలు పాల్గొన్నారు.

Strict action will be taken in Cheyutha pensions