ACB Bribery Raids in Telangana : ప్రజా దీవెన, తెలంగా ణ బ్యూరో:తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరో సారి లంచగొండులపై కొరడా ఝళిపించింది. ఒకే రోజు రాష్ట్రం లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో ప్రజాప్ర తినిధి స్థా యిలో ఉన్న గ్రామ సర్పంచ్‌తో పాటు న్యాయవ్య వస్థకు సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ వలకు చిక్కారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అ క్రమం గా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై అధికారులు పక్కా ప్రణాళికతో ట్రాప్ నిర్వహించి నగ దును స్వాధీనం చే సుకున్నారు.మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం మోదు గడ్డ తండా గ్రామ సర్పంచ్ ధ రావత్ వీరు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. నవం బర్ 18న ఖమ్మంలోని ఫిర్యాదుదారుడి కార్యాలయం లో రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా వరం గల్ ఏసీబీ బృందం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.
మూడు గ్రానైట్ సంస్థలు మెసర్స్ శారద స్టోనెక్స్, మెసర్స్ ప్రీమి యర్ గ్రానైట్స్, మెసర్స్ రాశి గ్రానైట్స్ క్వారీ కా ర్యకలాపాలకు ఆటంకాలు లేకుండా చూడటంతో పాటు వ్యాపారం సజావుగా సాగేందుకు సహకరిస్తానంటూ స ర్పంచ్ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. తొలుత రూ.30 లక్షలు అడిగి, అనంతరం రూ.13 లక్ష లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలి పింది. అందులో మొదటి విడతగా రూ.2 లక్షలు తీసుకుం టుండగా అధి కారులు పట్టుకున్నారు.లంచంగా స్వీకరించిన నగదు ను స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిని అరె స్టు చేసి వరంగల్‌లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించేందుకు చర్య లు చేపట్టారు.
కోర్టు కేసులో అనుకూల తీర్పు కోసం
మరోవైపు పెద్దపల్లిలోనూ ఏసీబీ అధికారులు కీలక ట్రాప్ ని ర్వహించారు. పెద్దపల్లి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెష న్స్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా (టెన్యూర్) పనిచే స్తున్న డొంకేన రవీం దర్, ప్రైవేట్ వ్యక్తి రెడ్డిరాజుల రాజ య్య ఏసీబీ కరీంనగర్ యూనిట్ అధికారులకు పట్టుబడ్డారు.ధర్మారం పోలీస్ స్టేష న్లో నమోదైన క్రైమ్ నంబ ర్ 12/2023 కేసు కోర్టులో వి చారణలో ఉంది. ఈ కేసులో సాక్షులను నిందితులకు అను కూలంగా విచారించేలా చేయడంతో పాటు కేసు నిర్దోషిత్వంతో ముగిసేలా అధికారిక సహకారం అందిస్తానంటూ పబ్లిక్ ప్రాసి క్యూటర్ ఫిర్యాదుదారుడి నుంచి ప్రైవేట్ వ్యక్తి ద్వారా లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.
మొదట రూ.2 లక్షలు డిమాండ్ చేయగా, ఫిర్యాదుదా రుడి అభ్యర్థన మేరకు రూ.1.50 లక్షలకు తగ్గించినట్లు తెలిపింది. నవంబర్ 18న పెద్దపల్లిలోని పబ్లిక్ ప్రాసి క్యూటర్ నివాసంలో నిర్వహించిన ట్రాప్‌లో ప్రైవేట్ వ్యక్తి రాజయ్య వద్ద నుంచి రూ. 1.50 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతడి చేతి వేళ్ల కు నిర్వహించిన రసాయన పరీక్షల్లో పాజిటివ్ ఫలితా లు వచ్చినట్లు ఏసీబీ పేర్కొంది.ఇద్దరినీ అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన అధికారులు కరీంనగర్‌లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ కేసులోనూ దర్యాప్తు కొనసాగు తోంది.
ఫిర్యాదుదారుల వివరాలు గోప్యం
రెండు కేసుల్లోనూ ఫిర్యాదుదారుల భద్రత దృష్ట్యా వారి పేర్లు, వ్యక్తిగత వివరాలను ఏసీబీ గోప్యంగా ఉంచింది. ప్రభుత్వ ఉ ద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ధైర్యంగా ఫి ర్యాదు చేయాలని అధికారులు సూచించారు.ప్రభుత్వ కార్యా లయాల్లో అవినీతి, లం చాల డిమాండ్లపై తెలంగాణ ఏసీబీకి ఈ మార్గాల్లో ఫిర్యాదు చేయవచ్చు.టోల్ ఫ్రీ నంబర్ 1064, వా ట్సాప్ 9440446106,ఫేస్బుక్ Telangana ACB,ఎక్స్ (ట్వి ట్టర్) @Telangana ACB లతో పాటు అన్ని ప్రభుత్వ కార్యా లయాలు, ప్రధాన బహిరంగ ప్రదేశాల్లో ఏసీబీకి సంబంధించిన క్యూఆర్ కోడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారుల పే ర్లు, వివరాలు గోప్యంగా ఉంచు తామని అధికారులు భరోసా ఇచ్చారు.



