—నకిలీ డెత్ సర్టిఫికెట్, అక్రమ కారుణ్య నియామకం వ్యవహారంలో కీలక మలుపు
–కమిషనర్ బీ.వంశీకృష్ణపై ఉన్నతాధికారుల ఆగ్రహం, స్థానంలో ఇన్‌చార్జ్‌గా శ్రీజారెడ్డి
Nalgonda Municipal Commissioner Transferred : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ మున్సిపల్ కా ర్పొరేష న్‌లో నకిలీ డెత్ సర్టిఫికెట్, అక్రమ కారుణ్య నియామకం వ్యవ హారం కీలక మలుపు తిరిగింది. ఈ వివాదం నేపథ్యంలో కా ర్పొరేషన్ కమిషనర్ బీ. వంశీకృష్ణపై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. ఈ పరిణామం మున్సిపల్ వర్గాల్లో తీవ్ర చర్చ నీ యాంశంగా మారింది.
వివాదానికి కారణమైన నకిలీ డెత్ సర్టిఫికెట్
కారుణ్య నియామకం కోసం నకిలీ డెత్ సర్టిఫికెట్ జారీ చేసిన వ్యవహారంలో కొందరు మున్సిపల్ సిబ్బంది పా త్ర ఉన్నట్లు ఆ రోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం పై విచారణ, చర్యల క్రమంలో మరికొందరిని అన్యా యంగా కేసులో ఇరికించారం టూ కమిషనర్ వంశీకృష్ణ పై ఆరోపణలు వచ్చాయి.
చర్యలకు బదులు క్రిమినల్ కేసులా?
ఈ వ్యవహారంలో బాధ్యులపై శాఖాపరమైన చర్య ల తోనే పరిష్కరించాల్సిన అంశాన్ని క్రిమినల్ కేసుల వరకు తీసుకెళ్లా రంటూ కమిషనర్ తీరుపై విమర్శలు వ్యక్త మయ్యాయి. ఈ పరిణామాలతో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిష్ఠకు భంగం కలిగిందని ఉన్నతాధి కారులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇన్‌చార్జ్ కమిషనర్‌గా శ్రీజారెడ్డి
ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు కమిషనర్ బీ. వంశీ కృష్ణను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో మి ర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ శ్రీజారెడ్డి కి నల్లగొండ కార్పొ రేషన్ ఇన్‌చార్జ్ కమిషనర్ బాధ్యత లు అప్పగించారు. నకిలీ డెత్ సర్టిఫికెట్ వ్యవహారం, కా రుణ్య నియామక వివాదం నేప థ్యంలో చోటుచేసుకున్న ఈ బదిలీ ఇప్పుడు నల్లగొండ మున్సి పల్ రాజకీయ, అధికార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహా రంలో తదుపరి ఎలాంటి పరిణామాలు చోటుచేసు కుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
Nalgonda Municipal Commissioner Transferred
