Praja Deveena
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 8:35 am Posted by : praja deveena

Public Prosecutor ACB Bribery Case : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ వలలో పబ్లిక్ ప్రాసిక్యూటర్, బాధి తుడి నుంచే లంచండిమాండ్, రూ.1.50 లక్షలు తీసు కుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబాటు

Public Prosecutor ACB Bribery Case : ప్రజా దీవెన, పె ద్దపల్లి: న్యాయం కోసం కోర్టును ఆశ్ర యించిన బాధితుడికే లం చం డిమాండ్ చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవినీతి నిరోధక శా ఖ (ఏసీబీ) అధికా రులకు చిక్కాడు. పెద్దపల్లి కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూ టర్‌గా విధులు నిర్వహిస్తున్న రవీందర్.. ఓ కేసులో బా ధితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు రూ.1.50 లక్షలు లంచం అడిగినట్లు ఆరోపణలు వచ్చాయి. బా ధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణా ళికతో ఆయనను పట్టుకున్నారు.

బాధితుడిని లంచం కోసం వేధింపులు

కేసు విషయంలో తనకు సహకరించడంతో పాటు అను కూ లంగా వ్యవహరించేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవీందర్ బా ధితుడి నుంచి రూ.1.50 లక్షలు డిమాండ్ చేసినట్లు సమా చా రం. లంచం ఇవ్వడం ఇష్టం లేకపోవడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించా డు. ఫిర్యాదును స్వీకరించిన అధి కారులు నిందితుడిని పట్టుకునేందుకు వ్యూహం రచించారు.

       పక్కా ప్లాన్‌తో ఏసీబీ ట్రాప్

కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి నేతృత్వం లోని బృం దం సూచనల మేరకు బాధితుడు పబ్లిక్ ప్రా సిక్యూటర్‌కు రూ. 1.50 లక్షలు అందజేశాడు. నగదు తీ సుకుంటున్న సమయం లోనే ఏసీబీ అధికారులు దాడి చేసి రవీందర్‌ను రెడ్‌హ్యాం డెడ్‌ గా పట్టుకున్నారు. ప్ర స్తుతం అధికారులు ఘటనాస్థలంలో వి చారణ చేపట్టారు. పూర్తి విచారణ అనంతరం మరిన్ని వివ రా లు వెల్లడించే అవకాశం ఉంది.

     న్యాయవ్యవస్థలో కలకలం

న్యాయం అందించాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ లంచం తీసుకుంటూ ఏ సీబీకి చిక్కడం పె ద్దపల్లి జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ఎనిమి దో మెట్రోపాలిటన్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్న లక్ష్మి కూ డా బాధితుడికి న్యాయం చేస్తానని రూ.15 వేల లంచం తీసు కుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటన తెలిసిందే. తాజాగా పెద్ద పల్లి ఘటన న్యాయవ్యవస్థలో అవినీతి ఆరోపణలపై మరో సారి చర్చకు తెరలేపింది.