Praja Deveena
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 12:55 pm Posted by : praja deveena

15 crore rupees sanctioned to Dharveshapuram Sri Renuka Yellamma Temple : బిగ్ బ్రేకింగ్, ధర్వేశపురం శ్రీ రేణుకఎల్లమ్మ ఆలయానికి మహర్దశ,ఆలయ అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు మంజూరు, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వఉత్తర్వులు

 

15 crore rupees sanctioned to Dharveshapuram Sri Renuka Yellamma Temple : ప్రజా దీవెన, నల్లగొండ: నల్ల గొండ జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్వేశపురం శ్రీ రే ణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణ యం తీసుకుంది. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిం చడంతో పాటు, ఆలయాన్ని ప్రముఖ మతపరమైన మరియు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఏకంగా రూ.15 కోట్ల నిధులను మంజూరు చేసింది.నల్లగొండ జిల్లా కనగల్ మండలం ధర్వేశపురంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ సమగ్ర సౌంద ర్యీకరణ, పర్యాటక అభివృ ద్ధి పనులకు సంబంధించి తెలం గాణ ప్రభుత్వం నవంబర్ 19న జీవో నంబర్ 349 జారీ చేసిం ది. ఈ మేరకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (T GTD C)కు పరి పాలనా అనుమతులు మంజూరు చేసింది.

రూ.15 కోట్లతో సమగ్ర అభివృద్ధి

ఆలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాల నే ప్రతిపాదనను రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శా ఖ మంత్రి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఇంజినీరింగ్ బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలనలు నిర్వహించి, అభివృద్ధి పనుల కోసం సు మారు రూ.15 కోట్లతో అంచనాలు సిద్ధం చేసింది.ఈ ప్రతిపాద నలను పరిశీలించిన ప్రభుత్వం రూ.15 కోట్ల పరిపాలనా అను మతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

      పర్యాటక గమ్యస్థానంగా!

ఈ నిధులతో ఆలయ పరిసరాల సమగ్ర సౌంద ర్యీకరణ, ప ర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పనులు చేపట్ట నున్నారు. తద్వారా ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు అందడంతో పాటు, పర్యాటకుల సందర్శన కూడా పెరిగే అవకాశం ఉంది.తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఈ పనులకు సంబంధించి తదుపరి చర్యలు చేపట్టా లని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు అవసరమైన ని ధులను పర్యాటక మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప ద్దు నుంచి ఖర్చు చేయనున్నారు.మొత్తంగా రూ .15 కోట్ల ప్ర భుత్వ నిధులతో ధర్వేశపురం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయాని కి కొత్తరూపురేఖలు రానుండగా, నల్లగొండ జిల్లాలో మరో ప్రము ఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా ఈ క్షేత్రం అభివృద్ధి చెందే దిశగా అడుగులు పడుతున్నాయి.