Police arrested mostwanted drug kingpin Abdul Mishal : ప్రజా దీవెన, హైదరాబాద్: డ్రగ్స్ అక్రమ రవాణా నెట్ వర్క్‌పై ఫ్యూచర్ సిటీ పోలీసులు భారీ ఆప రేషన్ నిర్వ హిం చారు. ఐదు రాష్ట్రాల పోలీసులకు సవా ల్‌గా మారినట్లు పే ర్కొంటున్న మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ కింగ్‌పిన్ ను ఎట్టకేలకు పోలీ సులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆప రేషన్‌తో డ్రగ్స్ ము ఠాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం పరి ధిలో మహేశ్వరం ఎస్‌ఓ టీ, ఇబ్రహీం పట్నం పోలీసులు సం యుక్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దాడులు నిర్వహిం చారు. ఈ సంద ర్భంగా కేరళకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చే శారు. వారిలో మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ కిం గ్‌పిన్ అబ్దుల్ మిషాల్‌తో పాటు మరో నిందితుడు తారిఖ్ ఉన్నట్లు పోలీసు లు వెల్లడించారు.
ఐదు రాష్ట్రాల పోలీసులకు సవాల్‌గా మారిన డ్రగ్స్ నెట్‌వర్క్ లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అబ్దుల్ మిషాల్ అరెస్ట్‌తో ఈ ముఠా కార్యకలాపాలపై పోలీసు లు మరింత దృష్టి సారించా రు. ఈ డ్రగ్స్ నెట్‌వర్క్ వెనుక ఇం కా ఎవరెవరు ఉన్నా రు? ఎక్కడెక్కడికి మాదకద్రవ్యాలు సర ఫరా చేస్తున్నా రు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది.ఫ్యూచర్ సిటీ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌తో డ్రగ్స్ ముఠాకు గట్టి షాక్ తగిలింది.దర్యాప్తులో మరిన్ని కీలక విష యాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
