Praja Deveena
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 12:58 pm Posted by : praja deveena

Sri Renuka Yellamma Temple Development funds : బిగ్ బ్రేకింగ్, ధర్వేశపురం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి మహర్దశ,ఆలయ అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు మంజూరు, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభు త్వ ఉత్తర్వులు

Sri Renuka Yellamma Temple Development funds : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మి క క్షేత్రం ధర్వేశపురం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి రా ష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసు కుంది. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిం చడంతో పాటు, ఆలయాన్ని ప్ర ముఖ మతపరమైన మరియు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేం దుకు ఏకంగా రూ.15 కోట్ల నిధులను మంజూరు చేసింది. నల్లగొండ జిల్లా కంగల్ మండలం ధర్వేశపురంలోని శ్రీ రేణుక ఎల్ల మ్మ ఆలయ సమగ్ర సౌందర్యీకరణ, పర్యాటక అభివృ ద్ధి పనులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నవం బర్ 19న జీవో నంబర్ 349 జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ పర్యా టక అభివృద్ధి సంస్థ (TGTDC)కు పరి పాలనా అనుమతులు మంజూరు చేసింది.

    రూ.15 కోట్లతో సమగ్ర అభివృద్ధి

ఆలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాల నే ప్రతిపాదనను రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా రు. దీనిపై స్పందిం చిన తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఇంజినీరింగ్ బృం దం క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించి, అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.15 కోట్లతో అంచనాలు సిద్ధం చేసింది.ఈ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం రూ.15 కోట్ల పరిపాల నా అను మతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

     పర్యాటక గమ్యస్థానంగా!

ఈ నిధులతో ఆలయ పరిసరాల సమగ్ర సౌంద ర్యీక రణ, పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పనులు చేప ట్టనున్నారు. తద్వారా ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు అందడంతో పాటు, పర్యాటకుల సందర్శన కూడా పెరిగే అవకాశం ఉంది.తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఈ పనులకు సంబంధించి తదుపరి చర్యలు చేపట్టా లని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు అవసరమైన ని ధులను పర్యాటక మౌలిక సదుపాయాల కల్పన, అభి వృద్ధి పద్దు నుంచి ఖర్చు చేయనున్నారు.మొత్తంగా రూ .15 కోట్ల ప్రభుత్వ నిధులతో ధర్వేశపురం శ్రీ రేణుక ఎ ల్లమ్మ ఆలయాని కి కొత్త రూపురేఖలు రానుండగా, నల్ల గొండ జిల్లాలో మరో ప్ర ముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేం ద్రంగా ఈ క్షేత్రం అభివృద్ధి చెందే దిశగా అడుగులు పడు తున్నాయి.