Praja Deveena
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 3:13 am Posted by : praja deveena

Tragedy family members suicide in tamilnadu : బిగ్ బ్రేకింగ్, ఒకే కుటుంబంలో తీరని విషాదం.. బా వి లో ఐదుగురి మృతదేహాలు, తమిళనాడులో హృదయ విదారక ఘటన, ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు మృతి

 

Tragedy family members suicide in tamilnadu : ప్రజా దీవెన, తమిళనాడు: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగు రు అనుమానాస్పద పరిస్థితుల్లో మృ త్యువాత పడిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నిం పింది. వంగల్ సమీపంలోని చిన్న కాళిపాళయం గ్రామంలో చో టు చేసుకున్న ఈ హృదయవిదారక ఘటన స్థానికుల ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకే కుటుంబా నికి చెందిన ముగ్గురు పెద్దలతో పాటు ఇద్దరు చి న్నారులు బావిలో విగతజీవులుగా కనిపించడం కలచివేసింది.

   ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి

మృతులను 62 ఏళ్ల రామసామి, ఆయన భార్య జానకి (60), వారి కుమార్తె సుగుణతో పాటు పదేళ్ల శివాని, నాలుగేళ్ల ఆదిరన్‌గా పోలీసులు గుర్తించా రు. కుటుంబంలోని ఐదుగురు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలు ముకున్నాయి.

  రంగంలోకి పోలీసు, అగ్నిమాపకసిబ్బంది

ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. బావిలో గాలింపు చర్యలు చేపట్టి ఐదుగురి మృతదేహాలను బ యటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం సమీపం లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

       ఆత్మహత్య కోణంలో దర్యాప్తు

కుటుంబ సభ్యులు వ్యక్తిగత సమస్యలు, తీవ్ర మనస్తాపం కా రణంగా ఈ ఘటనకు పాల్పడి ఉండ వచ్చని పోలీసులు ప్రాథ మికంగా అనుమానిస్తు న్నారు. అయితే ఐదుగురి మరణానికి అసలు కారణాలు ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియా ల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పో లీసులు అన్ని కో ణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల విచారణలో మరి న్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇద్దరు చిన్నా రులతో సహా ఐదుగురి మరణం ఆ గ్రామంలో తీరని విషాదాన్ని మిగిల్చింది.