Praja Deveena
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 12:44 pm Posted by : praja deveena

AP Intake Well in Nagarjuna Sagar Backwaters : విశ్రాంత ఇంజినీర్ల కీలక వ్యాఖ్య, నాగార్జునసాగర్‌ బ్యాక్‌వాటర్‌లో ఏపీ ఇంటేక్‌ వెల్‌ నిర్మాణంతో నష్టంలేదు

–నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే
–కృష్ణాబోర్డుకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిందే

— తెలంగాణ ప్రభుత్వానికి పలు సూచనలు

AP Intake Well in Nagarjuna Sagar Backwaters : ప్రజా దీవెన, హైదరాబాద్‌:నాగార్జునసాగర్‌ జలాశయం బ్యా క్‌వాటర్‌ పరిధిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతు న్న ఇంటేక్‌ వెల్‌ నిర్మాణంపై విశ్రాంత ఇంజినీర్ల సంఘం కీలక వ్యాఖ్యలు చే సింది. ఈ నిర్మాణం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం లేదని స్ప ష్టం చేస్తూనే, జలాశయ పరిధిలో పనులు చేపట్టే విష యంలో నిబంధనలు తప్పనిసరిగా పాటిం చాలని సూ చించింది.ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో 11 మండలాల ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు పేర్కొంది. గత ఏడాది కాలంగా నిర్మా ణ పనులు కొనసాగుతున్నప్పటికీ తెలంగాణ ప్ర భుత్వానికి ఈ విషయం తెలియకపోవడం విస్మయానికి గురి చేస్తోందని అభిప్రాయపడింది.తాగునీటి అవస రా ల కోసం చేపట్టే నిర్మా ణాలకు ప్రత్యేక అనుమతులు త ప్పనిసరి కాకపోయినా, ముందస్తు సమాచారం ఇవ్వా ల్సిన బాధ్యత సంబంధిత ప్రభుత్వంపై ఉంటుందని వి శ్రాంత ఇంజినీర్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా నాగార్జు నసాగర్‌ జలాశయ పరిధిలో ఎలాంటి ని ర్మాణాలు చేప ట్టినా నిబంధనలకు అనుగుణంగానే వ్యవహ రించాలని పేర్కొన్నారు.

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధిత అనుమ తులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని గుర్తుచే శారు. సాగర్‌ పరిధిలో పనులు ప్రారంభించే ముందు తెలంగాణ ప్రభుత్వం తో పాటు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు సమాచారం అం దించడం అవసరమని సూచించారు. తెలంగాణకు నష్టం లేక పోవడం ఒక అంశమై తే.. జలాశయ పరిధిలో నిబంధనల అ మలు మరో కీల క అంశమని విశ్రాంత ఇంజినీర్ల సంఘం అభి ప్రాయప డింది. జలాశయ భద్రత, అంతర్రాష్ట్ర జలవివాదాల అంశాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్ర భుత్వం బాధ్య తా యుతంగా నిర్మాణ పనులు చేపట్టాలని స్పష్టం చేసింది.

AP Intake Well in Nagarjuna Sagar Backwaters