Praja Deveena
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 3:30 pm Posted by : praja deveena

Supreme Court Verdict on Defaulting Rice Millers : బిగ్ బ్రేకింగ్, డిఫాల్టర్ రైస్ మిల్లర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ,సీఎంఆర్ ధాన్యం బకాయిల వ్యవహారం లో కీలక పరిణామం, మిల్లర్ల పిటిషన్లు కొట్టివేత

Supreme Court Verdict on Defaulting Rice Millers : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: తెలంగాణలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ధాన్యం బకాయిల వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ధాన్యం బకాయిలు చెల్లించ కుండా డిఫాల్టర్లుగా మారిన రైస్ మిల్లర్లకు సుప్రీంకోర్టు లో ఎదురుదెబ్బ తగిలింది. తమపై నమోదైన 540 ఎ ఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలంటూ మిల్లర్లు దాఖలు చేసి న పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం తాజాగా కొట్టి వేసింది.ఇప్పటికే ఈ కేసుల విషయంలో తెలంగాణ హై కోర్టు మిల్లర్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోవ డంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే హై కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ల పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు వాటిని డిస్మిస్ చేసిం ది.

బకాయిలు చెల్లించకుంటే చర్యలు తప్పవు

సీఎంఆర్ కింద ప్రభుత్వానికి అప్పగించాల్సిన ధా న్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్లు తక్షణమే బకా యిలు చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. లేని పక్షంలో క్రిమినల్ కేసులతో పాటు రెవెన్యూ రికవరీ చ ర్యలు కూడా చేపడతామని హెచ్చరించింది.సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో 540 ఎఫ్‌ఐఆర్‌ల రద్దు కోసం ప్రయ త్నించిన డిఫాల్టర్ మిల్లర్లకు న్యాయపరంగా చుక్కెదు రైంది. దీంతో పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ ధాన్యం బకా యిల వసూళ్లపై ప్రభుత్వ తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది.