Praja Deveena
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 3:13 pm Posted by : praja deveena

Sri Chaitanya College Student Death Adibatla : బిగ్ బ్రేకింగ్,రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన,సెలవు ఇవ్వలేదనే మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య? ఆది భట్ల శ్రీచైతన్య కాలేజీలో కార్తీక్‌ బలవన్మరణం

Sri Chaitanya College Student Death Adibatla : ప్రజా దీవెన, రంగారెడ్డి: విద్యార్థి ఆత్మహత్య ఘటన రంగారెడ్డి జిల్లా లో కలకలం రేపింది. ఆదిభట్ల పరిధిలో ని శ్రీచైతన్య కళాశాల లో కార్తీక్‌ అనే విద్యార్థి ఆత్మహ త్యకు పాల్పడటం తీవ్ర విషా దాన్ని నింపింది. సెలవు ఇ వ్వాలని కోరినప్పటికీ కళాశాల యాజమాన్యం అనుమ తించకపోవడంతో మనస్తాపానికి గు రై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమికంగా ప్రచారం జరుగు తోంది.

అయితే విద్యార్థి మృతదేహాన్ని కళాశాల యాజమాన్యం గు ట్టుచప్పుడు కాకుండా తరలించినట్లు ఆరోపణలు వెల్లువె త్తు తున్నాయి. ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థి మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జ రిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో కళాశాల పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది.