Praja Deveena
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 11:26 am Posted by : praja deveena

Acb massive rides in Telangana : తెలంగాణలో ఏసీబీకి చిక్కిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఆస్తి మ్యుటేషన్‌కు రూ.30 వేలు, వితంతు పింఛన్ మంజూరుకు రూ.10 వేలు లంచం డిమాండ్

 

Acb massive rides in Telangana :  ప్రజా దీవెన, తెలం గాణ:ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి అధి కారులపై తెలం గాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కొరడా ఝళిపించింది. రెండు వేర్వేరు జిల్లాల్లో లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీ బీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబ డ్డా రు. ఒకరు ఆస్తి మ్యుటేషన్ కోసం, మరొకరు వితంతు పింఛ న్ మంజూరు కోసం లంచం తీసుకుంటూ చిక్కడం కలకలం రేపిం ది.

ఎల్లంపేట మున్సిపల్ లో రూ.30 వేల లంచం

కుత్బుల్లాపూర్ పరిధిలోని ఎల్లంపేట మున్సిపల్ కా ర్యాల యంలో వార్డు అధికారిగా పనిచేస్తున్న డి. రవీందర్ రెడ్డి రూ. 30 వేల లంచం తీసుకుంటూ రం గారెడ్డి రేంజ్ ఏసీబీ అధికా రులకు పట్టుబడ్డారు. ఫి ర్యాదుదారునికి చెందిన పూర్వీకుల ఇంటి ఆస్తిని తండ్రి పేరు నుంచి త న పేరు మీదకు మార్చేందు కు (మ్యుటేషన్) సహకరిం చాలంటే తొలుత రూ. 40 వేలు డి మాండ్ చేశారు. అ నంతరం రూ.30 వేలకు ఒప్పందం కుదు ర్చుకున్నారు.ఈ క్రమంలో నవంబర్ 20న తన కార్యాలయం లోనే ఫిర్యాదు దారుని నుంచి రూ.30 వేలు స్వీకరిస్తుండగా ఏసీ బీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అధికార దుర్విని యోగానికి పాల్పడి అక్రమంగా లబ్ధిపొందేందుకు ప్రయత్నిం చినట్లు ఏసీబీ వెల్లడించింది.

వితంతు పింఛన్ కోసం రూ.10 వేల వసూలు

మరో ఘటనలో కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ల క్ష్మీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి లావుడ్య చవాన్ లాల్ ఏసీబీకి చిక్కారు. ఫిర్యాదు దారుని కోడ లికి టీజీ చేయూత ప థకం కింద వి తంతు పింఛన్ మం జూరు ప్రక్రియను పూర్తి చేసి నందుకు రూ.10 వేలు లంచం డిమాండ్ చేశారు .నవంబర్ 21 న ఫిర్యాదుదారుని నివాసంలోనే లంచం తీసుకుంటుండగా ఏ సీబీ అధికారులు దా డి చేసి పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ. 10వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఇద్దరిపై కేసులు.. న్యాయస్థానానికి తరలింపు

ఈ రెండు ఘటనల్లోనూ నిందితులను అరెస్టు చేసి సం బంధి త ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానాల ముందు హాజ రుపరచను న్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెండు కేసులపై విచా రణ కొనసాగుతోం ది. ఫిర్యాదుదారుల భద్రత దృష్ట్యా వారి వి వరాలను గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా తెలంగాణ ఏసీబీ ని సంప్రదించాలని అధికారులు సూచించారు.

టోల్ ఫ్రీ నంబర్ 106 4, వాట్సాప్ 9440446106, ఫేస్‌బుక్ Telangan a AC B,ఎక్స్ (ట్విట్టర్) @Te langana ACB లతో పాటులంచం డిమాండ్‌పై ఫి ర్యాదు చేసిన వారి వివరా లను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఏసీబీ భరోసా ఇచ్చిం ది.ప్రజాధనంతో జీతాలు తీసుకుం టూ ప్రజల పనులకే లం చా లు డిమాండ్ చేసే అవి నీతి అధికారులపై కఠిన చర్యలు తీసు కోవాలనే డిమాండ్ మరోసారి బలంగా వినిపిస్తోంది.