–చందనపల్లి గేట్ల వద్ద రైతులతో కలిసి బీఆర్ఎస్ ఆందోళన
–భూగర్భ జలాలు Astagfirullah ప్రభుత్వానికి పట్టదా అంటూ నిలదీత
Brs Ex MLA Kancharla Bhupal Reddy : ప్రజా దీవెన, నల్ల గొండ:తిప్పర్తి మండలంలోని గ్రామాల్లో నెలకొన్న సాగు నీరు, తాగునీటి ఎద్దడిని తక్షణమే పరి ష్కరించాలని డిమాం డ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి రైతులతో కలిసి ఆం దోళనకు దిగారు. ఏ ఎంఆర్పీ (AMRP) D-39, D-40 కా లువ ల ద్వారా మండలంలోని అన్ని చెరువులను నింపాలని డి మాండ్ చేశారు. రెండు రోజుల్లోగా కాలువల గేట్లు తెరిచి నీటి ని విడుదల చేయకపోతే తామే గేట్లు ఎత్తివేస్తామని ప్రభు త్వా న్ని హెచ్చరించారు.శనివారం తిప్పర్తి మండలంలో ని వివి ధ గ్రామాలకు చెందిన రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకు లతో కలిసి ఇండ్లూరు నుంచి చందనపల్లి వర కు భారీ ర్యాలీ నిర్వ హించారు. అనంతరం చందనపల్లి గేట్ల వద్దకు చేరుకుని నిరస న తెలిపారు.
ఈ సందర్భంగా కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ తి ప్పర్తి మండలంలో భూగర్భ జలాలు తీవ్రంగా పడిపోయాయని, అనే క గ్రామాల్లో తాగునీటి సమస్య సైతం తీవ్రమవుతోందని ఆవేద న వ్యక్తం చేశారు. సాగునీరు అందక రైతులు ఇబ్బందులు ప డుతుంటే స్థానిక మంత్రి, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దా రుణమని విమర్శించారు.
తిప్పర్తి చెరువులకు ఎందుకు ఇవ్వరు
బ్రాహ్మణ వెల్లంల చెరువును నీటితో నింపడాన్ని తాము వ్యతి రేకించడం లేదని, అయితే అదే చిత్తశుద్ధితో తిప్పర్తి మండలం లోని చెరువులను కూడా నింపాలని కంచర్ల డిమాండ్ చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా గె లిపించిన నియోజకవర్గ ప్రజల పట్ల వివక్ష చూపడం త గదని అన్నారు. జిల్లా ఉన్నతా ధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు తక్షణమే స్పందిం చి D-39, D-40 కా లువల ద్వారా అన్ని చెరువులకు నీటిని విడుదల చే యాలని కోరారు.
రెండు రోజుల్లో గేట్లు తెరవకపోతే తామేతెరుస్తాం
ప్రభుత్వానికి రైతుల కష్టాలు కనిపించడం లేదా అని ప్ర శ్నించి న కంచర్ల మరో రెండు రోజుల్లోగా నీటిని విడుదల చేయకపో తే రైతులతో కలిసి తామే గేట్లు తెరుస్తామని స్పష్టం చేశారు. గ తంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికా రంలో ఉన్నప్పుడు 2017-18లో తీవ్ర కరువు పరిస్థితు లు నెలకొన్నప్పటికీ ఏప్రిల్, మే నె లల్లో సైతం చెరువు లను నీటితో నింపి ప్రజలకు, రైతులకు ఇ బ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని గుర్తుచేశా రు.
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న నీటి సంక్షోభం ప్రకృతి వైపరీత్యం కంటే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని ప్ర జ లు భావిస్తున్నారని కంచర్ల విమర్శించారు. సుమారు 250 టీఎంసీల నీరు ఆంధ్రప్ర దేశ్‌కు తరలిపోతున్నా మంత్రులు పట్టించుకోవడం లేదని ఆరో పించారు. సా గునీరు, తాగునీటి విషయంలో ప్రభుత్వం తక్షణ మే స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశా రు.
ఈ ఆందోళనలో నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మంద డి సైదిరెడ్డి, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తం డు సైదులు గౌడ్, మండ ల పార్టీ అధ్యక్షుడు పల్రెడ్డి రవీందర్‌రెడ్డి, నల్లగొండ నగర పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, రావుల శ్రీనివాసరెడ్డి, ఏనుగు దామోదర్‌రెడ్డి, వనపర్తి నాగేశ్వరరావు, కందుల లక్ష్మయ్య, స ర్పంచులు కొత్తపల్లి సైదులు, తగుళ్ల శ్రీను, కొల్లు నాగయ్య,నక్క స్వాతి, ఉప సర్పంచులు, వివిధ గ్రామాల ప్రజాప్రతి ని ధులు, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Brs Ex MLA Kancharla Bhupal Reddy

