Praja Deveena
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 2:51 am Posted by : praja deveena

Star Health and Allied Insurance by imposing ₹2 crore penalty : స్టార్ హెల్త్‌కు ఐఆర్‌ డీఏఐ భారీ షాక్, రూ.2 కోట్ల జరిమానా విధింపు.. కొవిడ్ సహాఆరోగ్య బీమా క్లెయిమ్‌ల తిరస్కరణపై చర్యలు

Star Health and Allied Insurance by imposing ₹2 crore penalty :  ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా పాల సీదారులకు అన్యాయం చేసే లా వ్యవహరించిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థకు బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) భారీ షాక్ ఇచ్చింది. సరైన కారణాలు చూపకుండా కొవిడ్‌తో పాటు ఇతర ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను తిరస్కరించడం, పా లసీ నిబంధనలకు విరుద్ధంగా చెల్లిం పుల్లో కోతలు విధించడం పై తీవ్రంగా స్పందిస్తూ రూ.2 కోట్ల జరిమానా విధించింది.

   తనిఖీల్లో బయటపడ్డ అక్రమాలు

2022 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు నిర్వ హించిన తనిఖీల్లో స్టార్ హెల్త్ సంస్థ వ్యవహారశైలి లో పలు లోపాలు గుర్తించారు. దీనిపై 2024 డిసెం బర్ 4న వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయ గా, 2025 జూన్ 18న విచారణ నిర్వ హించారు.

క్లెయిమ్‌ల తిరస్కరణపై తీవ్ర అభ్యంతరం

క్లెయిమ్‌లను తిరస్కరించినప్పుడు లేదా చెల్లింపు ల్లో కోతలు విధించినప్పుడు అందుకు సంబంధిం చిన పాలసీ నిబంధన ల ను వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయలేదని విచార ణలో వెల్లడైం ది. దీంతో తమ క్లెయిమ్‌లపై నిర్ణయాలను ప్రశ్నిం చే అవకాశం పాలసీదారులకు లేకుండా పోయిందని నియంత్ర ణ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది.

రెండు ఉల్లంఘనలకు రూ.కోటి చొప్పున జరిమానా

క్లెయిమ్‌లను నిబంధనలకు విరుద్ధంగా తిరస్కరిం చినందుకు రూ.కోటి, చెల్లింపుల్లో కోతలు విధించడం, నిర్ణయాలను సక్ర మంగా తెలియజేయక పోవ డంపై మరో రూ.కోటి జరిమానా విధించింది. నెట్‌వర్క్ ఆసుపత్రులతో కుదుర్చుకున్న తగ్గింపు ఒప్పందాలను బిల్లుల్లో స్పష్టంగా చూపించకపోవడంపై హెచ్చ రిక జారీ చేసింది.

పాలసీదారులకు పారదర్శకత తప్పనిసరి

ఇకపై క్లెయిమ్ పరిష్కార పత్రాల్లో చెల్లించిన మొత్తం, తిరస్క రించిన మొత్తం, కోత విధించిన మొ త్తం వివరాలను స్పష్టంగా పేర్కొనాలని స్టార్ హెల్త్ సంస్థను ఆదేశించింది. బీమా సేవల్లో పారదర్శకత పాటించాలని, పాలసీదారుల హక్కులను పరిర క్షిం చాలని స్పష్టం చేసింది.