Praja Deveena
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 6:51 am Posted by : praja deveena

TRS graduation mlc candidate Srikanth goud : పట్టభద్రుల సమస్యలపై మండలిలో ప్రశ్నించే గొంతుకగా నిలుస్తా

–బడుగు,బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతర పోరాటం
— మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించండి
–తెలంగాణరక్షణసేన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ పిలుపు

TRS graduation mlc candidate Srikanth goud : ప్రజా దీవెన, నల్గొండ: బడుగు, బలహీన వర్గాలు, నిరుద్యోగులు, ప ట్టభద్రుల సమస్యలపై శాసనమండలిలో నిరంతరం ప్రశ్నించే గొంతుకగా నిలుస్తానని తెలంగాణ రక్షణ సేన పట్టభద్రుల ఎ మ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ నలమా స శ్రీకాంత్ గౌడ్ స్పష్టం చేశారు. సామాన్య బహుజన కు టుంబం నుంచి వచ్చిన తనకు అవకా శం కల్పిస్తే ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతానని, పట్టభ ద్రుల ఆకాంక్షలకు ప్రతినిధిగా పనిచేస్తానని ఆయన పి లుపునిచ్చారు.తన రాజకీయ, ఉద్యమ ప్రస్థానాన్ని వివరిస్తూ.. కాకతీయ విశ్వవిద్యాలయంలో పీజీ, పీహె చ్‌డీ పూర్తి చేసిన తాను గత రెండు దశాబ్దాలుగా తెలం గాణ ఉద్యమంతో మ మేకమై ఉన్నానని తెలిపారు. సా గరహారం, మిలియన్ మార్చ్, అసెంబ్లీ ముట్టడి, సడక్ బంద్ వంటి అనేక చారిత్రక ఉద్యమా ల్లో పాల్గొన్నానని, ఉద్యమ క్రమంలో వందలాది కేసులను ఎ దుర్కొన్నాన ని పేర్కొన్నారు. అశోక్‌నగర్‌తో పాటు కాకతీయ, ఉస్మా నియా, సెంట్రల్ లైబ్రరీల్లో ఉద్యోగాల కోసం కష్టపడుతు న్న నిరుద్యోగ యువత ఆకాంక్షల నుంచి తన ప్రస్థానం ప్రారం భమైందన్నారు.

రాజకీయ పార్టీలకు ప్రశ్నలు.. నిరుద్యోగులకు భరోసా

కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు గతంలో అవకాశాలు క ల్పించినా పట్టభద్రులు, నిరుద్యోగుల సమస్యలకు ఆశించిన ప రిష్కారం లభించలేదని శ్రీకాంత్ గౌడ్ విమర్శించారు. వ్యాపార ప్రయోజనాలు, పెట్టుబడిదారీ వర్గాల ప్రయోజనాల కోసం పని చేసే వారికంటే ప్రజల సమస్యలపై ప్రశ్నించే నాయకులను ఎ న్నుకోవాలని కోరారు.టీజీపీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ, పదవీ విర మణ వయోపరిమితి పెంపుతో నిరుద్యోగులకు ఎదురైన ఇ బ్బందులు, ఇంటర్మీడియట్ మూల్యాంకనంలో జరిగిన పొర పాట్లు, పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వంటి అంశాలను ప్ర స్తావించారు. విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తుతో ప్రభు త్వాలు చెలగాటమాడకూడదని అన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు క ల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో వి ఫలమైం దని విమర్శించారు. యూజీసీ నెట్ పరీక్ష రద్దు, నీట్ ప్రశ్నప త్రా ల లీకేజీ వ్యవహారాలు విద్యావ్యవస్థలో ని లోపాలను బయ టపెట్టాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రక టించిన యూత్ డిక్లరేషన్, వి ద్యార్థి డిక్లరేషన్ హామీలు కూడా పూర్తిస్థాయిలో అమ లుకావడం లేదని, జాబ్ క్యాలెండర్ పేరు తో నిరుద్యో గులకు నిరీక్షణే మిగులుతోందని వ్యాఖ్యానించా రు.

నిరుద్యోగుల భవిష్యత్తే ప్రధాన అజెండా

ప్రభుత్వ పాఠశాలల మూసివేత, ఉపాధ్యాయ నియా మకా లు, మెగా డీఎస్సీ, జూనియర్, డిగ్రీ లెక్చరర్ల పో స్టుల భర్తీ వం టి అంశాలపై ప్రభుత్వాలు స్పష్టమైన వి ధానంతో ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎ దురుచూస్తున్న యువత వయస్సు పెరుగుతున్నా నోటిఫికేష న్లు సకాలంలో రా వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నల్గొండ నీటి హక్కుల కోసం పోరాటం

ఫ్లోరోసిస్ సమస్యతో దశాబ్దాల పాటు నరకయాతన అనుభ వించిన నల్గొండ జిల్లా ప్రజల నీటి కష్టాలను ఆయన ప్రత్యేకం గా ప్రస్తావించారు. కృష్ణా జలాలపై తెలంగాణకు దక్కాల్సిన వాటాను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నా రు. ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న నీటి ప్రాజెక్టులు, పల్నాడు వాటర్ గ్రిడ్, నాగార్జునసాగర్ నీటి వినియోగంపై ప్రాంత ప్రజల్లో ఉన్న ఆందోళనలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చే శారు.నాగార్జునసాగర్ నీటిమట్టం, నీటి త రలింపు, ఇంటేక్ వెల్ నిర్మాణాలు, పైపులైన్ల ఏర్పాటు వంటి అంశాలపై తెలంగా ణ ప్రయోజనాలను పరిరక్షిం చేందుకు సమగ్రంగా వ్యవహరిం చాలని కోరారు. న ల్గొండ జిల్లాకు నీళ్లు, నిధులు, నియామకా లు అందిం చాలన్నదే తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష అని గుర్తు చేశారు.

   మండలిలో ప్రజల పక్షాన పోరాడుతా

తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫున తొలి అభ్యర్థిగా పట్టభద్రు ల ముందుకు వచ్చిన తాను, ప్రజల హక్కుల పరిరక్షణే లక్ష్యం గా పనిచేస్తానని శ్రీకాంత్ గౌడ్ హామీ ఇచ్చారు. తెలంగాణ ప్ర యోజనాలకు మద్దతుగా నిలు స్తానని, వాటికి భంగం కలిగిం చే నిర్ణయాలపై నిర్భ యం గా ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై నా రిటీ వర్గాలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల స మస్యలకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. కాంట్రా క్టు లు, కమిషన్లు, ప్రలోభాలకు లొంగకుండా విజ్ఞతతో ఓటు వే యాలని పట్టభద్రులను కోరారు.తనకు మొదటి ప్రాధాన్యత ఓ టు కేటాయించి గెలిపిస్తే పట్టభద్రుల సమ స్యలపై మండలిలో మీ గొంతుకగా గర్జిస్తా. శ్రీకాంత్ గౌడ్ గెలుపు ఒక్క వ్యక్తి విజ యం కాదు.. బహుజనుల, ఉ ద్యమకారుల, సామాజిక న్యా యం కోరుకునే ప్రజల విజయమని ఆయన పిలుపునిచ్చారు.

TRS graduation mlc candidate Srikanth goud