Praja Deveena
Newspaper Banner
Date of Publish : 22 November 2026, 1:22 pm Posted by : praja deveena

Gujarat Road Accident Seven Killed : బిగ్ బ్రేకింగ్, గుజరాత్ లో ఘోరరోడ్డు ప్రమాదం, ఏడుగురు దుర్మరణం

Gujarat Road Accident Seven Killed : ప్రజా దీవెన, గుజరాత్: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమా దం చోటుచేసుకుంది. కచ్ జిల్లా భుజ్-ఖాద్దా జాతీయ రహదారిపై గత రాత్రి జరి గిన ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ‘రాన్ ఆఫ్ కచ్’ను సందర్శించి భుజ్కు తిరిగి వస్తుండగా ఆర్మీ కుటుంబాలకు చెందిన సభ్యు లు ప్రయాణిస్తున్న కారు, ట్రైలర్ ట్రక్కును అ త్యంత వేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నా రులు సహా మొత్తం ఏడు గురు అక్కడికక్కడే మృతిచెం దారు. కారు ఇనుప రేకుల్లో చిక్కుకున్న మృతదేహాల ను బయటకు తీసేందుకు అధికారులకు గంటల సమ యం పట్టింది.

మృతులందరూ ఉత్తరాఖండ్లోని గర్వాల్ ప్రాంతానికి చెం దినవారని, భుజ్లో విధులు నిర్వహిస్తున్న ఆర్మీ సిబ్బంది కుటుంబ సభ్యులని కచ్ వెస్ట్ పోలీ సులు తెలిపారు. మృతులను రింకీ నితిన్ గుసై న్ (35), ఆమె నాలుగు నెలల కుమార్తె వామి క, సౌరభ్ సింగ్ నేగి (30), ఆ య న భార్య సవితా సౌరభ్ సింగ్ నేగి (30), వారి మూడు నెలల కుమార్తె శివిక, రాజేష్ రావత్ (35), ఆయన ఏ డేళ్ల కుమార్తె రక్షితగా గుర్తిం చారు. ప్రమాద సమా చా రం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ వికాస్ సుంద ఘట నాస్థలానికి, ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించా రు.