Hyderabad 26/11 Style Terror Attack Threat : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్లో మరోసారి ఉగ్రదాడుల బెదిరింపు కలకలం రేపింది. ముంబైలో జ రిగిన 26/11 తర హా ఉగ్రదాడులను హైదరాబాద్ లోనూ పునరావృతం చేస్తా మంటూ గుర్తుతెలియని వ్యక్తు లు బెదిరింపు మెయిల్ పంప డం తీవ్ర ఆందోళనకు దారితీసింది.లష్కరే తోయిబా పేరుతో వచ్చిన ఈ మెయిల్లో కాచిగూడ టూరిస్ట్ ప్లాజా, రైల్వే స్టే ష న్ను పేల్చివేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. కనీసం 300 మందిని హతమార్చడమే తమ లక్ష్యమని అందులో పే ర్కొన్నట్లు తెలుస్తోంది.
లతీఫ్ భట్, అతని సహచరులను హతమార్చినందుకు ప్రతీ కారంగా ఈ దాడులకు పాల్పడతామని మెయిల్లో హెచ్చరిం చినట్లు సమాచారం. ఈ పరిణామంతో అప్ర మత్తమైన స్పెషల్ బ్రాంచ్ అధికారులు నగర పోలీసు ల కు ఎమర్జెన్సీ అలర్ట్ జారీ చేశారు.అయితే, ప్రాథమిక పరిశీలనలో ఈ బెదిరింపు మెయి ల్ నకిలీదిగా (ఫేక్) పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. అ యినప్పటికీ భద్రతాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని పోలీ సులు అప్రమత్తంగా వ్యవహరిస్తు న్నారు. నకిలీ బెదిరిం పే అయినా.. భద్రత విషయంలో రాజీపడకుండా పోలీసులు నిఘా పెంచారు.
