Praja Deveena
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 8:50 am Posted by : praja deveena

BRS complaint on Palnadu Water Grid project near Nagarjuna Sagar : పల్నాడు వాటర్ గ్రిడ్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలి, కేఆర్ఎంబీ చైర్మన్‌కు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు, హైదరాబాద్ తాగునీటి భద్రతకు ముప్పుపొంచిఉందని ఆందోళన

 

BRS complaint on Palnadu Water Grid project near Nagarjuna Sagar  ప్రజా దీవెన, హైదరాబాద్: నాగార్జునసా గర్ జలాశ యం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పల్నాడు మంచినీటి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ తీవ్ర అ భ్యంతరం వ్య క్తం చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా చేపడు తున్న ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని త క్షణమే నిలిపివేయా లని డిమాండ్ చేసింది. ఈ మే రకు హైదరాబాద్‌కు చెందిన బీఆ ర్ఎస్ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు కృష్ణా న దీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్‌కు లిఖిత పూర్వ కంగా ఫిర్యాదు చేశారు.ఈ ప్రాజెక్టు అమల్లో కి వస్తే హైదరా బా ద్ మహానగరానికి ప్రస్తుతం అం దుతున్న తాగునీటి సరఫరా తో పాటు భవిష్యత్తు లో పెరగనున్న నీటి అవసరాల పైనా తీ వ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ నేతలు ఆందోళ న వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధాని తాగునీటి భద్రతను దృష్టి లో ఉంచుకుని ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకోవా లని కోరారు.

ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్), నీ టి కేటాయింపులు, సాంకేతిక అనుమ తులు, ఇన్‌టేక్ పా యింట్ల నిర్మాణ వివరాలు, నీటి సేకరణ సా మర్థ్యంపై సమగ్ర విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా జలాశయం లో దిగువ స్థాయి నుంచి నీటిని సేకరించేలా రూపొందించిన ఇన్‌టేక్ వ్యవస్థ హైదరాబా ద్ తాగునీటి భద్రతపై ఎలాంటి ప్రభావం చూపుతుందో నిపుణుల కమిటీ తో అధ్యయనం చేయించాలని డిమాండ్ చేశారు.

జలసౌధ వద్ద మీడియాకు అడ్డంకులు

మరోవైపు హైదరాబాద్‌లోని జలసౌధ వద్ద పోలీసులు విధిం చిన ఆంక్షలు చర్చనీయాంశంగా మారా యి. బీఆ ర్ఎస్ నేత లు ఫిర్యాదు చేసేందుకు వచ్చి న నేపథ్యంలో జలసౌధ ప్రాంగ ణంలోకి మీడియా ప్రతినిధులను పోలీ సులు అనుమతించ లేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జలసౌధలోకి మీ డియా ప్రవేశాన్ని ఈ వి ధంగా అడ్డుకోవడం ఇ దే తొలిసారి కా వడం గమనార్హం. పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు చుట్టూ మొద లైన ఈ వివాదం కృష్ణా జలాల వినియోగం, హైదరాబాద్ భవి ష్య త్తు తా గునీటి భద్రతపై మరోసారి రాజకీయ చర్చకు తెర లేపింది.