Praja Deveena
Newspaper Banner
Date of Publish : 24 November 2026, 11:20 am Posted by : praja deveena

Bachupally Septic Tank Accident Three Workers Dead : బిగ్ బ్రేకింగ్, బాచుపల్లిలో ఘోర విషాదం, సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగి శుభ్రం చేస్తుండగా విషవాయువుల ప్రభావం, ఊపిరాడక ముగ్గురు దుర్మరణం

Bachupally Septic Tank Accident Three Workers Dead : ప్రజా దీవెన, హైదరాబాద్‌: హైదరాబాద్ నగరంలోని బాచుపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు లోపలికి దిగిన ముగ్గురు కార్మికులు ఊపిరా డక ప్రాణాలు కోల్పోయారు. కార్తీక పౌర్ణమి పర్వదినం రోజునే ఈ దుర్ఘటన జరగడంతో స్థా నికంగా విషాదఛాయలు అలు ముకున్నాయి. మంగ ళ వారం (నవంబర్ 24) బాచుపల్లి పరి ధిలో సెప్టిక్ ట్యాం క్ శుభ్రపరిచే పనులు చేపట్టిన ముగ్గురు కా ర్మికులు ఒకరి తర్వాత ఒకరు ట్యాంక్‌లోకి దిగినట్లు సమాచా రం. ఈ క్రమంలో లోపల పేరుకుపోయిన విషవాయువుల ప్ర భావానికి గురై ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బ యటకు వచ్చేలోపే ముగ్గురూ ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథ మిక సమాచారం.

ఘటనపై సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు వెం టనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేప ట్టారు. మృతు ల వివరాలను సేకరిస్తూ, ప్రమాదానికి గల అసలు కారణాలపై విచారణ ప్రారంభించారు.సెప్టిక్ ట్యాంకుల శుభ్రత పనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం ఎంతటి ప్రాణాంతకం గా మారుతుం దో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. ముగ్గు రు కార్మి కుల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెల కొంది.