–మద్యం తాగి నిత్యం గొడవపడుతున్నాడనే కోపంతో ఘాతుకం
–విద్యుత్ వైర్లతో ప్రమాదంగా చిత్రీకరించే యత్నం
–పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి అసలు నిజం
Brutal murder in Sangareddy district :ప్రజా దీవెన, సంగారెడ్డి: భర్త వేధింపులు భరించలేక పోతున్నాననే ఆగ్రహం తో ఓ మహిళ దారుణానికి ఒడిగ ట్టింది. నిద్రిస్తున్న భర్తపై పెట్రో ల్ పోసి నిప్పంటించి హత్య చేయడమే కాకుండా, ఈ ఘటన ను విద్యుత్ షాక్ తో జరిగిన ప్రమాద మరణంగా చిత్రీ కరించేం దుకు ప్రయత్నించింది. అయితే పోలీసుల లోతైన విచారణతో అసలు విషయం బయటపడింది.సంగారెడ్డి జిల్లా కంగ్టి మం డ లం దెగుల్‌వాడి లో ఈ నెల 10న జరప్ప (46) అనుమానాస్ప ద స్థితిలో మృతి చెందాడు. తొలుత విద్యుత్ షాక్ కార ణంగా నే ఆయన మరణించినట్లు భావించారు. అయితే ఘటనపై అనుమానం రావడంతో పోలీసు లు దర్యాప్తు చేపట్టారు.
విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్తపై భార్య బుజ్జమ్మ పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనంతరం బెడ్‌పై విద్యుత్ వైర్లు ఉంచి, కరెం ట్ షాక్ తగిలి భర్త మర ణించినట్లు నమ్మించేందుకు ప్రయత్నించినట్లు తేలిం ది.రోజూ మద్యం తాగి వచ్చి గొడ వపడుతు న్నాడనే కోపంతో నే ఈ దారుణానికి పాల్పడినట్లు బుజ్జమ్మ పోలీసుల ఎదుట అంగీకరించినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఆమెను అ రెస్ట్ చేసి రి మాండ్‌కు తరలించారు.ప్రమాద మరణంగా న మ్మించాలనుకున్న హత్య పోలీసుల దర్యాప్తుతో అసలు గుట్టు రట్టయింది.
Brutal murder in Sangareddy district
