Praja Deveena
Newspaper Banner
Date of Publish : 24 November 2026, 11:18 am Posted by : praja deveena

Congress MLAs keysitting with Congress InCharge : కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కొత్త ఇన్‌చార్జ్ గట్టిసూచన, బజారుకెక్కొద్దు,సమస్యలుంటే నాతో చెప్పండి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డితో ప్రత్యేక భేటీ.. బహిరంగ విమర్శలు మానుకోవాలని హితవు

Congress MLAs keysitting with Congress InCharge  : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రె స్‌లో అంతర్గత అసంతృప్తికి తెరదించేందుకు పార్టీ అధిష్ఠానం రంగంలోకి దిగిం ది. సొంత ప్రభుత్వంపైనే బహిరంగ విమర్శ లు చేస్తూ రాజకీ యంగా చర్చకు కారణమవుతున్న ఎమ్మెల్యేల వ్యవహారంపై కొత్త రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్ బీఎం సందీప్ ప్ర త్యేక దృష్టి సా రించారు. ఈ క్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డితో ఆయన ప్రజాభ వన్ గెస్ట్‌ హౌస్‌లో సమావేశమయ్యారు.నిన్న రాత్రి పొద్దు పో యిన తర్వాత జరిగిన ఈ భేటీలో ఇద్దరు ఎమ్మె ల్యేల అభి ప్రా యాలను సందీప్ సావధానంగా విన్నట్లు సమాచారం. అయితే పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేలా బహిరంగ వేదికల పై విమర్శలు చేయడం సరికాదని స్పష్టం చేసినట్లు తెలిసింది. పార్టీలో ఏవైనా సమస్యలు, అసంతృప్తులు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారా నికి తాను చొరవ తీసుకుంటానని భరోసా ఇచ్చినట్లు సమా చారం.

అధిష్ఠానంతో మాట్లాడినా అభ్యంతరం లేదు

మీపై పార్టీకి ఎంతో గౌరవం ఉందని, రానున్న రోజుల్లో తగిన రా జకీయ ప్రాధాన్యతతో పాటు మంచి బాధ్యతలు కూడా దక్కే అవకాశం ఉందని సందీప్ ఇద్దరు ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చి నట్లు తెలుస్తోంది. అవసరమైతే పార్టీ అధిష్ఠానంతో నేరుగా మాట్లాడేందుకు కూడా ఎ లాంటి అభ్యంతరం లేదని స్పష్టం చే సినట్లు సమాచా రం. అయితే అంతర్గత సమస్యలను బహి రంగ విమర్శ ల రూపంలో వ్యక్తం చేసి పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగిం చవద్దని సూచించినట్లు తెలిసింది.

సొంత ప్రభుత్వంపై విమర్శలతో కలకలం

కొంతకాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి చేస్తు న్న వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ వేడిని పెంచు తున్నాయి. కమీషన్లు ఇవ్వకుంటే పనులు జరగడం లేదంటూ అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. మ రోవైపు ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డిపై రాజగోపాల్‌రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి.ఈ వ్యాఖ్యలపై ఇటీవల సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘాటుగా స్పందించడంతో వివాదం మ రింత ముదిరింది. దీంతో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదా లు బహిరంగ చర్చకు వచ్చాయి.

    అసంతృప్తికి బ్రేక్ పడేనా

పార్టీలో నెలకొన్న ఈ పరిణామాలకు ముగింపు పలికి నేతల మధ్య సమన్వయం పెంచడమే లక్ష్యంగా కొత్త ఇన్‌చార్జ్ సం దీ ప్ స్వయంగా రంగంలోకి దిగడం రాజకీ యంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరు ఎమ్మెల్యే లతో జరిగిన తాజా భేటీ ద్వారా అసంతృప్తి స్వరాలను చల్లార్చేందుకు ఆయన ప్రయ త్నించినట్లు కనిపిస్తోంది. మరి ఈ చర్చలతో కాంగ్రెస్‌లో కొనసా గుతున్న అంతర్గ త కలహాలకు తెరపడుతుందా? ఎమ్మెల్యేలు తమ బ హిరంగ విమర్శలకు స్వస్తి పలుకుతారా? అన్నది ఇ ప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.