Moinabad Lotus Pond Park Boy Death : ప్రజా దీవెన, హైదరాబాద్:సరదాగా సాగాల్సిన స్కూల్ పిక్నిక్ ఓ చిన్నారి కుటుంబంలో తీరని విషాదాన్ని నిం పింది. స్నేహితులతో కలిసి ఆనందంగా విహారయాత్రకు వెళ్లిన పదేళ్ల బాలుడు అభిరా మ్..భారీ ఇనుప ఊయ ల ప్రమాదంలో ప్రాణాలు కోల్పో యా డు. మరో విద్యార్థి యశ్వంత్ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాల య్యాడు. మొయినాబాద్‌లోని లోటస్ పాండ్ పార్క్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. స్కూల్ విద్యార్థులు పిక్నిక్‌లో భాగంగా లోట స్ పాండ్ పార్క్‌కు వెళ్లారు. అక్కడ భారీ ఇనుప ఊయలపై ఏ కంగా పది మంది పిల్లలు కూర్చోగా, మరో నలుగురు వెనుక నుంచి వేగంగా ఊపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఊయల అదుపుతప్పి వెనక్కి వేగంగా రావడంతో విద్యార్థులను బలం గా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో అభిరామ్ నుదురు, ఛాతీ భాగా ల్లో తీవ్ర గాయాలయ్యాయి. మరో విద్యార్థి యశ్వంత్ కూడా తీ వ్రంగా గాయపడ్డాడు. అభిరామ్ మృతి చెందడంతో పిక్నిక్ ప్రదే శంలో విషాదం అలముకుంది.
టీచర్లు ఎక్కడున్నారు? తల్లిదండ్రుల ఆగ్రహం
ప్రమాదం జరిగిన సమయంలో ఉపాధ్యాయులు, స్కూల్ సి బ్బంది అక్కడ అందుబాటులో లేకపోవడంపై తల్లిదండ్రులు తీ వ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల భద్రతను పర్యవేక్షించా ల్సిన బాధ్యతను స్కూల్ యా జమాన్యం విస్మరించిందని ఆరో పిస్తున్నారు.తగిన భ ద్ర తా చర్యలు లేకపోవడం, విద్యార్థులపై పర్యవేక్షణ కొర వడటమే ఈ దుర్ఘటనకు కారణమని అభిరా మ్ తల్లిదం డ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారు డి మృతికి బాధ్యులైన స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఘటనను దాచిపెట్టే ప్రయత్నం చేశారా
ఈ ప్రమాదం బయటకు రాకుండా సంబంధిత వ్యవస్థలను మే నేజ్ చేశారంటూ కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అ యితే ఈ ఆరోపణలపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. చిన్నారుల భద్రతే ప్రధాన బాధ్యతగా ఉండాల్సిన విద్యాసం స్థల పర్యవేక్షణలో ఇలాంటి ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. అసలు ప్రమాదానికి బాధ్యులెవరు? భద్రతా నిబం ధనలు ఎందు కు పాటించలేదు? అనే ప్రశ్నలకు సంబంధిత అ ధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
