Moinabad Lotus Pond Park Boy Death : ప్రజా దీవెన, హైదరాబాద్:సరదాగా సాగాల్సిన స్కూల్ పిక్నిక్ ఓ చిన్నారి కుటుంబంలో తీరని విషాదాన్ని నిం పింది. స్నేహితులతో కలిసి ఆనందంగా విహారయాత్రకు వెళ్లిన పదేళ్ల బాలుడు అభిరామ్.. భారీ ఇనుప ఊయ ల ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మరో విద్యార్థి యశ్వంత్ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. మొయినాబాద్‌లోని లోటస్ పాండ్ పార్క్‌లో చోటుచే సుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. స్కూల్ విద్యార్థులు పిక్నిక్లో భాగం గా లోటస్ పాండ్ పార్క్‌కు వెళ్లారు. అక్కడ భారీ ఇను ప ఊయలపై ఏకంగా పది మంది పిల్లలు కూర్చోగా, మరో నలుగురు వెనుక నుంచి వేగంగా ఊపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఊయల అదుపుతప్పి వెనక్కి వేగంగా రావడంతో విద్యార్థులను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో అభిరామ్ నుదురు, ఛాతీ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. మరో విద్యార్థి యశ్వంత్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అభిరామ్ మృతి చెందడంతో పిక్నిక్ ప్రదేశంలో విషాదం అలముకుంది.
**టీచర్లు ఎక్కడున్నారు? తల్లిదండ్రుల ఆగ్రహం!**
ప్రమాదం జరిగిన సమయంలో ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది అక్కడ అందుబాటులో లేకపోవడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల భద్రతను పర్యవేక్షించాల్సిన బాధ్యతను స్కూల్ యా జమాన్యం విస్మరించిందని ఆరోపిస్తున్నారు.తగిన భ ద్ర తా చర్యలు లేకపోవడం, విద్యార్థులపై పర్యవేక్షణ కొర వడటమే ఈ దుర్ఘటనకు కారణమని అభిరామ్ తల్లిదం డ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడి మృతికి బాధ్యులైన స్కూల్ యాజమాన్యంపై కఠిన చ ర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఘటనను దాచిపెట్టే ప్రయత్నం చేశారా?
ఈ ప్రమాదం బయటకు రాకుండా సంబంధిత వ్యవస్థల ను మేనేజ్ చేశారంటూ కూడా ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారిక నిర్ధార ణ రావాల్సి ఉంది.చిన్నారుల భద్రతే ప్రధాన బాధ్యతగా ఉండాల్సిన విద్యాసంస్థల పర్యవేక్షణలో ఇలాంటి ప్ర మాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. అసలు ప్ర మాదానికి బాధ్యులెవరు? భద్రతా నిబంధనలు ఎందు కు పాటించలేదు? అనే ప్రశ్నలకు సంబంధిత అధికారు లు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
