Brutal gangrape IN New Delhi : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మ హిళల భద్రతపై మరోసారి ఆందోళన కలిగించే ఘ టన వెలుగులోకి వచ్చింది. పార్టీ పేరుతో నిర్వ హించిన వేడుక అనంతరం 22 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. ఢిల్లీ లోని ప్రీత్ విహార్ ప్రాంతంలోని సల్త నత్ కేఫ్‌లో ఈ ఘటన చో టుచేసుకున్నట్లు సమా చారం. బాధిత యువతితో పాటు నిం దితులు కూడా అదే కేఫ్‌లో పనిచేస్తున్న సహోద్యోగులుగా తె లుస్తోంది.
సోమవారం రాత్రి ఉద్యోగులంతా కలిసి పార్టీ చేసుకోగా, అర్ధరా త్రి 11.30 గంటలు దాటినా వేడుక కొనసాగింది. చివరకు తెల్ల వారుజామున 3.30 గంటల ప్రాంతంలో పార్టీ ముగిసింది. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత యువతి పోలీసులకు ఫి ర్యా దు చేసింది. ఫిర్యాదు ఆ ధారంగా పోలీసులు మొ త్తం ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేప ట్టారు.
ఈ కేసులో ఇద్దరు మహిళలతో పాటు మొత్తం ముగ్గురిని పోలీ సులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. మిగిలిన నిందితుల పా త్రపై కూడా విచారణ కొన సాగుతోంది. పార్టీకి హాజరైన వారి వివరాలు, ఘట నకు సంబంధించిన పరిస్థితులపై పోలీసులు ఆధా రాలు సేకరిస్తున్నారు.సహోద్యోగుల మధ్య జరిగిన పార్టీ అనంతరం ఇలాంటి తీవ్ర ఆరోపణలు వెలు గులోకి రావడం స్థానికంగా కలకలం రేపింది.
