Praja Deveena
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 6:11 am Posted by : praja deveena

121 Kg Gold Donation to Tirumala : బిగ్ బ్రేకింగ్, తిరుమల శ్రీవారికి అపురూప కానుక, 121 కిలోల బంగారు ఆభరణాల సమర్పణ, ఒకే భక్తుడి నుంచి 40 రకాల ఆభరణాలు,తిరుమల చరిత్రలో అరుదైన ఘట్టం

–చెన్నై అగర్వాల్‌ భక్తుడి మహా విరాళం
–సీఎం చంద్రబాబు సమక్షంలో టీటీడీకి అందజేత

121 Kg Gold Donation to Tirumala : ప్రజా దీవెన, తిరు మల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంక టేశ్వర స్వామికి ఓ భక్తు డు అపురూపమైన కానుక స మర్పించేందుకు సిద్ధమయ్యా రు. చెన్నైకి చెందిన అగ ర్వాల్‌గా గుర్తించిన ఓ భక్తుడు ఏకంగా 121 కిలోల బం గారంతో తయారు చేయించిన ఆభరణాలను శ్రీవారి పాదాల చెంతకు తీసుకొచ్చారు. మరికాసేపట్లో ముఖ్య మంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ భారీ బంగారు ఆభ రణాల ను తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేయనున్నారు.

40 రకాల ఆభరణాలతో స్వర్ణ వైభవం

శ్రీవారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఆభరణాల్లో కిరీ టం, భుజకీర్తులు, శంఖుచక్రాలు, నాగాభరణం, వడ్డాణం, కటి, వరద హస్తాలు, పీతాంబరం, హారాలు, అందెలు, పద్మపీఠం త దితర విలువైన ఆభరణాలు ఉ న్నాయి. మొత్తం 40 రకాల ఆ భరణాలను ఒకే భక్తుడు తయారు చేయించి సమర్పించడం ఇ దే తొలిసారి కావడం విశేషం.

  రేపు శ్రీవారికి నూతన అలంకరణ

ఈ బంగారు ఆభరణాలను రేపు శ్రీవారి అభిషేక సేవ అనంత రం స్వామివారికి అలంకరించనున్నారు. భక్తుడి అపార భక్తికి, దైవంపై ఉన్న అచంచల విశ్వాసానికి ఈ మహా కానుక నిదర్శ నంగా నిలవనుంది. 121 కిలోల బంగారు ఆభరణాల సమర్ప ణతో తిరుమలలో మరో అపురూప ఆధ్యాత్మిక ఘట్టం ఆవి ష్కృతం కానుంది.

121 Kg Gold Donation to Tirumala