Electricity Department ADE Caught by ACB : ప్రజా దీవెన, గద్వాల: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు మరో ప్రభుత్వ అధికారి చిక్కారు. గద్వాల సబ్ డివిజన్ TGSPDCL అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ADE) అన్నారపు రమేష్ బాబు రూ.60 వేల లంచం తీసుకుంటూ మహబూబ్‌నగర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన నవంబర్ 26న చోటుచేసు కుంది.ఫిర్యాదుదారుడు, అతని సహ కాంట్రాక్టర్ చేపట్టి న పనులకు సంబంధించి రూ.12,62,070 బిల్లులు మంజూరు చేసి, తదుపరి ప్రక్రియ పూర్తి చేసేందుకు ADE రూ.60 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
కారుడాష్‌బోర్డుపై నగదు.. ఏసీబీకి చిక్కిన అధికారి!
కార్యాలయ పనులు ముగించుకుని ఇంటికి బయలుదే రుతు న్న సమయంలో నిందిత అధికారి ఫిర్యాదుదారుడిని తన కా రులోని డాష్‌బోర్డుపై లంచం నగదును ఉంచాలని ఆదేశించా రు. ఆయన సూచన మేరకు ఫిర్యా దుదారుడు రూ.60 వేల నగదును డాష్‌బోర్డుపై ఉంచ గా, అప్పటికే నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.అనంతరం కారు డాష్‌బోర్డు పై నిర్వహించిన రసాయన పరీక్షలో సానుకూల ఫలి తం రావడంతో పాటు, లంచం సొమ్మును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించిన ట్లు ఏసీబీ పేర్కొంది.
నిందిత అధికారి అన్నారపు రమేష్ బాబును అరెస్టు చే సి, నాంపల్లిలోని SPE & ACB కేసుల విచారణ ప్రత్యేక న్యాయ స్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆ యనకు జ్యుడీ షియల్ రిమాండ్ విధించింది. కేసుపై త దుపరి విచారణ కొన సాగుతోంది. ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా వివరాలను ఏసీ బీ గోప్యంగా ఉంచింది. ఇదిలా ఉండగా ప్రభుత్వ కార్యాల యాల్లో ఎవరైనా ఉ ద్యోగి లంచం డిమాండ్ చేస్తే ప్రజలు నిర్భ యంగా తెలం గాణ ఏసీబీని సంప్రదించాలని అధికారులు సూ చించారు.
ఫిర్యాదు చేయకనుకున్న వారు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్9440446106,ఫేస్‌బుక్ Telangana ACB,ఎక్స్ (ట్విట్టర్) @Telangana ACB లలో చేయ వచ్చని, ఫిర్యాదు దారుల పేర్లు, వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ స్ప ష్టం చేసింది. అవినీతిపై పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరింది.

