Praja Deveena
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 2:46 pm Posted by : praja deveena

Illicit Liquor Cases in Nalgonda, Suryapet districts : నాటు సారాపై ఎక్సైజ్ సమరం, రెండు రోజుల్లో 53 కేసులు, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 36 గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ లు

–24 మంది అరెస్ట్.. 27 మందిపై బైండోవర్ కేసులు
–115 లీటర్ల నాటుసారా స్వాధీనం7,400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం
–2026లో ఇప్పటివరకు 11,825 మంది అరెస్ట్ 1,434 కేసుల నమోదు

Illicit Liquor Cases in Nalgonda, Suryapet districts : ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణలో నాటుసారా తయారీ, వి క్రయా లు, రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టడమే లక్ష్యంగా ఎ క్సైజ్ శాఖ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రం లోని పలు జిల్లాల్లో రహస్యంగా కొనసాగుతున్న నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ బృందాలు మెరు పు దాడులు నిర్వ హించాయి. ఇందులో భాగంగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రెండు రోజులపాటు నిర్వహించిన స్పెష ల్ డ్రై వ్‌లో భారీగా నాటుసారా తయారీకి ఉపయోగించే ము డిసరుకును స్వాధీనం చేసుకున్నారు.ఎక్సైజ్ ఎన్‌ ఫో ర్స్‌మెం ట్ డైరెక్టర్ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు హైదరాబాద్‌కు చెందిన స్టేట్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన నాలుగు బృందాలతో పా టు స్థాని క ఎన్‌ఫోర్స్‌మెంట్, డీటీ ఎఫ్, ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది మొత్తం 16 బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు చేపట్టాయి. రెం డు జిల్లాల్లోని 36 గ్రామాల్లో నాటుసారా తయారీ ప్రాంతాలను జల్లెడ పట్టాయి.

    రెండు రోజుల్లో భారీగా పట్టుబడిన నాటుసారా

ఈ ప్రత్యేక దాడుల్లో మొత్తం 53 కేసులు నమోదు చేయగా, 2 4 మందిని అరెస్ట్ చేశారు. మరో 27 మందిని బైండోవర్ చేశా రు. 115 లీటర్ల నాటుసారాను స్వాధీ నం చేసుకోవడంతో పా టు, తయారీకి సిద్ధంగా ఉంచిన 7,400 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. అదే విధంగా 40 కిలోల బెల్లం, 25 కిలోల ఆ లమ్‌ను స్వాధీ నం చేసుకున్నారు.నాటుసారా నిర్మూలన ల క్ష్యంగా ఎ క్సైజ్ శాఖ ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా నిరంతర దా డులు నిర్వహిస్తోంది. 2026లో ఇప్పటివరకు చేపట్టిన తనిఖీ ల్లో నమోదైన గణాంకాలు ఇలా ఉన్నాయి. మొత్తంగా 1,434 కేసులు నమోదు,57,719 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసు కోగా 2,63,812 కిలోల బెల్లం పట్టివేత,1,848 వాహనాలు సీ జ్, 11,825 మంది అరెస్ట్, 9,24,360 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం21,686 కిలోల ఆలమ్ స్వాధీనం చేసుకున్నారు.

   సమాచారం అందితే తక్షణ దాడులు

ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్, డీటీఎఫ్ బృందాలు ప్రతి నెలా ఒకటి రెండుసార్లు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ నాటుసా రా తయారీని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాయని ఎ న్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అవి నాష్ మహంతి తెలిపారు. ఎక్కడ నాటుసారా తయా రు చేసినా, రవాణా చేసినా, విక్రయించినా సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటా మని స్పష్టం చేశారు. నాటుసారా తయారీకి సంబంధించిన స మాచారం అందిన వెంటనే దాడులు నిర్వహిస్తున్నట్లు వెల్లడిం చారు.

అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక ఆపరేషన్

రెండు రోజులపాటు నిర్వహించిన ఈ దాడులు హైదరా బాద్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ సూపరింటెండెంట్లు విష్ణుమూర్తి, ఫయాజుద్దీ న్, డీఎస్పీలు శ్రీనివాసరావు, తిరుపతి యాదవ్‌లతో పాటు నల్లగొండ ఎక్సైజ్ ఎస్‌కే కిషన్, సూర్యాపేట ఎస్‌కే అనిత పర్య వేక్షణలో జరిగాయి.డైరెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ప్ర త్యేక దాడుల్లో మంచి ఫలితాలు వచ్చాయని ఎక్సైజ్ ఎన్‌ఫో ర్స్‌మెంట్ జాయింట్ డైరెక్టర్, జాయింట్ కమిషనర్ అంజన్‌రా వు తెలిపారు. నల్లగొండ జిల్లాలో నాటుసారా తయారీని మరిం త సమర్థంగా నియంత్రించే అవకాశాలు ఉన్నా యని డిప్యూ టీ కమిషనర్ శశిధర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. దాడుల్లో పాల్గొన్న అధికారులను, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించా రు.నాటుసారా తయా రీ కేంద్రాలపై నిఘా కొనసాగిస్తూ, సమా చారం అందిన ప్రతి ప్రాంతంలో తనిఖీలు నిర్వహించేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతోంది.

   దేవరకొండలో ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం

దేవరకొండ:నల్లగొండ జిల్లాలో అక్రమ నాటు సారా త యారీ, విక్రయాలపై ఎక్సైజ్ శాఖ భారీ స్థాయిలో ప్రత్యేక దాడులు ని ర్వహించింది. దేవరకొండ ఎ క్సైజ్ స్టేషన్ పరిధిలో నవంబర్ 2 5, 26 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన సమన్వయ ఎన్ఫోర్స్మెం ట్ ఆపరేషన్‌లో అధికారులు అక్రమ నాటు సారా త యా రీ కేంద్రాలపై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కమి షన ర్ హెచ్. హ రికిరణ్, ఐఏఎస్, డైరెక్టర్ అవినాష్ మొహం తి, ఉన్న తాధికారుల ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లా మద్య ని షేధ, ఆబకారీ అధికారి ఏ.కిషన్ పర్యవేక్ష ణలో ఈ ప్రత్యేక దాడులు జరిగాయి.

రెండు రోజుల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో అధికారులు గణ నీయమైన ఫలితాలు సాధించారు. మొత్తం 25 కేసులు నమో దు చేసి, 10 మందిని అరెస్టు చేశారు. 56 లీటర్ల నాటు సారా ను స్వాధీనం చేసుకోగా, అక్రమ తయారీకి ఉపయోగించే 4,5 00 లీటర్ల బెల్లం పులుసు (F J వాష్)ను అక్కడికక్కడే ధ్వం సం చేశారు. మరో 17 మందిని బైండోవర్ చేశారు.

   ఐదు మండలాల్లో విస్తృత తనిఖీలు

నేరెడుగొమ్ము, చందంపేట, మల్లేపల్లి, దేవరకొండ, పీఏ పల్లి మండలాల్లోని పలు గ్రామాలు, తండాల్లో అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వహించారు. గువ్వలగుట్ట, సేవాలాల్ తండా, జోడుభాయ్ తండా, చిట్రియాల, కాచరుపల్లి, పడమటి తండా, కంబాలపల్లి, పోగిళ్ల, మె గ్యా తండా, అంబోతు తండా, బాలాజీనగర్ తండా, పె ద్ద తండా, రేక్యా తండాల్లో విస్తృతంగా తనిఖీలు చేప ట్టారు.

బహుళ బృందాలతో సమన్వయ ఆపరేషన్

ఈ ప్రత్యేక దాడుల్లో ఎస్టీఎఫ్ డీఎస్పీలు తిరుపతి యాదవ్, తుల శ్రీనివాసరావు, నల్లగొండ ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ ధన్వం త్ రెడ్డితో పాటు దేవరకొండ, నల్లగొండ, మిర్యాలగూడ, హాలి యా ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

దాడుల అనంతరం నిర్వహించిన మీడియా సమావేశం లో అధికారులు మాట్లాడుతూ.. నాటు సారా తయారీ, అక్రమ రవాణా, విక్రయాలను పూర్తిస్థాయిలో అరికట్టడ మే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అక్రమ త యారీ కేంద్రాలను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక ఎ న్ఫోర్స్మెంట్ కార్యక్రమా లను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.నాటు సారా విని యోగం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు, ప్రాణాపాయ పరిస్థి తులు ఎదురయ్యే ప్ర మాదం ఉందని, ప్రజలు ఇటువంటి అ క్రమ మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా నాటు సారా తయారీ లేదా విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తి స్తే వెంటనే సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అం దించాలని ప్రజలను కోరారు.అక్రమ నాటు సారా రహిత స మాజ నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యం కీలక మని ఎక్సైజ్ అధికారులు పిలుపునిచ్చారు.

Illicit Liquor Cases in Nalgonda, Suryapet districts