–అభివృద్ధి పనులపై అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిశానిర్దేశం
Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, న ల్లగొండ: రానున్న 18 నెలల్లో నల్గొండ నియోజకవర్గాన్ని రా ష్ట్రంలోనే అత్యుత్తమ, ఆదర్శ ని యోజకవర్గంగా తీర్చిదిద్దడ మే తన ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ప్రతి గ్రామానికి మౌలిక వసతులు కల్పించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా అభివృద్ధి కార్యక్ర మాలను వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు.గురువారం క నగల్ ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా, మండల స్థాయి అధి కారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పలు కీల క నిర్ణయాలు తీసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వి ద్యుత్, సాగు నీరు, ఇందిరమ్మ ఇళ్లు తదితర అంశాలపై అధికా రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
నియోజకవర్గంలో ఇప్పటికే సుమారు రూ.3 వేల కోట్లతో ఆర్ అండ్‌బీ, పంచాయతీరాజ్ రహదారుల పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. వచ్చే నెల నుంచి వి.బి.జి. రామ్‌జీ పథకం కింద అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రై నేజీల నిర్మాణం ప్రారంభి స్తామని చెప్పారు. అవసరమై తే అదనపు నిధులు తీసుకొచ్చి పనులను పూర్తి చేస్తా మని భరోసా ఇచ్చారు.
తాగునీటి సమస్య రాకుండా రూ.12.30 కోట్లు
ఎల్‌నినో ప్రభావంతో రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి తలె త్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. కనగల్ మండలానికి తాగునీటి అత్యవ సర పనుల కోసం రూ. 12.30 కోట్లు మంజూరు చేసిన ట్లు వెల్లడించారు. మూడు రో జుల్లోగా ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, సర్పంచులు గ్రామసభలు నిర్వ హించి అవసర మైన పనుల అంచనాలు సిద్ధం చేసి సమర్పిం చాలని సూచించారు.
ఎత్తిపోతల పథకాలకు గడువులు
చెట్లచెన్నారం, మాదారం, రేగట్ట, షేర్లింగోటం, బా బు సాహెబ్ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేస్తామని మంత్రి ప్రకటించారు. కనగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను జనవరి చివరి నాటికి పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారు లను ఆదేశించారు. ఎస్ఎల్ బీసీ సొరంగ మార్గం పూర్త యితే నియోజకవర్గంలోని వ్యవసా య భూములకు సాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం
ప్రతి గ్రామంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా అవసర మైన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఓవర్ లోడ్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ట్రాన్స్ఫార్మర్లను ఎలాం టి ఖర్చు లేకుండా వెంటనే మార్చాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామానికి సబ్‌స్టేషన్ సౌకర్యం కల్పించేందు కు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇద్దరికి అక్కడికక్కడే సాయం
పేదలకు రూ.5 లక్షల వ్యయంతో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇ స్తున్నామని మంత్రి తెలిపారు. మొదటి విడతలో ఇళ్లు మం జూరై ఇప్పటివరకు నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారుల కే టాయింపులను రద్దుచేసి, నిజమైన పేదలు, అర్హులు, గుడిసె ల్లో నివసించే వారికి మంజూరు చేయాలని అధికారులను ఆదే శించారు. ఈ సందర్భంగా ఇద్దరు లబ్ధిదారులకు ఇంటి నిర్మా ణం కోసం ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సహా యా న్ని అక్కడికక్కడే అందజేశారు.
విద్యా, మహిళా మౌలిక వసతులకు ప్రాధాన్యం
పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖల ద్వారా అంగన్ వాడీ భవనాలు, మహిళా సమాఖ్య భవనాలు, అదన పు తరగతి గదులు, ప్రహరీ గోడల నిర్మాణ పనులు చేపట్టినట్లు వివరించా రు. కనగల్ జంక్షన్ అభివృద్ధితో పాటు మండలంలోని అన్ని రహదారుల నిర్మాణం, మ రమ్మతులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటు న్నట్లు చెప్పారు.
ధర్వేశిపురం ఎల్లమ్మ ఆలయానికి మహర్దశ
ధర్వేశిపురంలోని ప్రసిద్ధ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాల యాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి ప్రకటించారు. పర్యాటక శాఖతో పాటు ఇతర నిధులను వినియోగించి హరి త హోటల్, విశ్రాంతి గృహం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భ క్తులకు మెరుగైన వసతి సౌక ర్యాలు కల్పిస్తామని తెలిపా రు.కనగల్, తిప్పర్తి, నల్గొం డ మండలాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో గోదా ముల నిర్మాణానికి రూ.30 కోట్లతో టెండర్లు పిలిచినట్లు వెల్లడించారు. రూ.20 కోట్లతో ఛాయా సోమేశ్వర స్వా మి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. క న గల్ శివారులో ప్రస్తుతం ఉన్న బ్రిడ్జి పక్కనే మరో నూతన బ్రిడ్జి నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పలు అభివృ ద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ప్రజా సమస్యలను నేరుగా తన దృష్టికి
గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సర్పం చులు తన దృష్టికి తీసుకురావాలని మంత్రి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీ విత బీమా పథకంలో అర్హులైన ప్రతి కుటుంబాన్ని న మోదు చేయాలని సూచించా రు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహించకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నివాళులు
సమీక్ష సమావేశానికి ముందు రాజ్యాంగ దినోత్సవాన్ని పుర స్కరించుకుని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీడీవో కా ర్యాలయంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించా రు. అనంతరం రా జ్యాంగ ప్రతిజ్ఞ చేశారు.ఈ సమావే శంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, స్థానిక సంస్థల ఇ న్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, డీపీఓ తరుణ్ చక్రవర్తి, వివిధ శాఖల జిల్లా, మం డల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
పేదవారికి అండగా ప్రజా ప్రభుత్వం
నల్లగొండ: పేదవారికి అండగా ప్రజా ప్రభుత్వం ఉంటుందని రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.గురువారం నల్గొండ పట్టణం లో క్లాక్ టవర్ ప్రక్కన ఉన్న మైదానంలో జిల్లా అల్పసంఖ్యాక వర్గాల కార్పొరేషన్ ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ల పంపి ణి, పవర్ టూ ల్, జనరేటర్ పంపిణి అలాగే కళ్యాణ లక్ష్మి, షా దీ ముబారక్ చెక్ ల పంపిణి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడు తూ మహిళలు ఆర్థికంగా స్వయంగా ఎదిగేందుకు మైనార్టీ కా ర్పొరేషన్ ద్వారా 1152 కుట్టు మిషన్ లను పంపిణి చేస్తున్నా మని, మిషన్ లను తర లించేందుకు రవాణా ఛార్జిల కోసం మం త్రి సొంతంగా ఒక్కో మిషన్ కి 500 రూపాయల చొప్పున ఉచితంగా అందజేశారు. పేదవారి కష్టాన్ని గుర్తించి సహాయం గా ఉండేందుకు తురక కా శ వర్గానికి చెందిన వారికి 1.5 కోట్ల రూపాయలతో 94 జనరేట ర్లు, పవర్ టూల్ కిట్లు పంపిణీ చే యడం జరుగుతున్నదని, త ద్వారా సులభంగా బండలు కోసి తక్కువ సమయంలో సుల భంగా ఆదాయం పొందవచ్చ ని అన్నారు.
ఇందిరమ్మ జీవిత బీమా పథకంలో అర్హత ఉన్న ప్రతి కుటుం బం నమోదు చేసుకోవాలని, తద్వారా కుటుంబంలో ఆర్జించే వ్యక్తికి ఏదైనా అనుకోని సంఘటన జరిగి మరణిస్తే వారి నా మిని కి 5 లక్షల రూపాయలను ఉచితంగా ప్రభుత్వం ఈ ప థకం ద్వారా అందజేస్తుందని తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం నూతన పెన్షన్ దారులకు అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమం ప్రారంభించనున్నారని, గత ప్రభు త్వం 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ,ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తున్నామని, ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ సర ఫరా చేస్తున్నామని, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌ కర్యం కల్పించామని, ఇప్పటికే నల్గొండ పట్టణంలో మొదటి వి డత 700 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిం దని , మరో 500 ఇల్లులు త్వరలో ఇస్తామని అర్హుత ఉన్న ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరా రు.
హరే కృష్ణ పౌండేషన్ ద్వారా నల్గొండ నియోజకవర్గ తో పాటు, మరో మూడు మండలాలు కలిపి మొత్తం 6 మండలాలలో ప్ర భుత్వ పాఠశాలలో చదువుతున్న 30 వేల మంది విద్యార్థుల కు ఉచితంగా అల్పాహారం అందించేందుకు 6 కోట్ల రూపాయ లతో నల్గొండ నియోజకవర్గ కేంద్రంలోని మార్కెట్ యార్డ్ దగ్గర త్వరలో కిచెన్ ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. నల్గొండ పట్టణ్ణం లో 600 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రో డ్డు త్వరలో పూర్తి చేస్తామని,దర్గాకు ఘాట్ రోడ్డు ఏర్పాటు చేశామని, కార్పొరేషన్ కి ఆదాయం వచ్చేలా సభ ఏర్పాటు చేసిన గ్రౌండ్ లో పెద్ద కాంప్లెక్స్ నిర్మిస్తామని,నల్గొండ పట్టణాన్ని హైదరాబాద్ కంటే ఎక్కువ అభివృద్ధి చేసి ప్రగతి పథంలో నల్గొండ పట్టణాన్ని ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.
అంతకు ముందు నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలపడితేనే కుటుంబం బలపడుతుందని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహాయంతో 20 కోట్ల రూపాయలతో నిర్మించిన న్యాక్ ద్వారా బోటిక్స్, ఎంబ్రాయిడరీ,ఎలక్ట్రిక్,ప్లమ్బింగ్ లాంటి వాటిల్లో వృత్తి విద్యా కోర్సుల ద్వారా నైపుణ్యాలు పెంపోదించుకొని స్వయం గా ఉపాధి పొంది మరో 10 మందికి ఉపాధి కల్పించాలని కో రారు.
జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ మాట్లాడుతూ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కుట్టు మిషన్లకు 1152 దరఖాస్తులు వచ్చా యని,ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించి ఆర్థికంగా స్థిరపడాలన్న ఉద్దేశంతో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కుట్టు మిషన్ ఉ చితంగా అందించడం జరుగుతుందని అన్నారు.ఇందిరమ్మ కు టుంబ జీవిత బీమా పథకంలో ప్రతి ఒక్కరూ చేరాలని ప్రమాద వశాత్తు కుటుంబ పెద్ద కు ఏదైనా జరిగితే నామినీకి ఐదు లక్ష ల రూపాయలు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని దగ్గర లో ఉన్న వార్డ్ ఆఫీసర్లు కలిస్తే ఆన్లైన్ చేసిన తరువాత మొబైల్ నెంబర్ కు ఎస్ఎంఎస్ లింక్ పంపిస్తారని తద్వారా రశీదు డౌ న్లోడ్ చేసుకోవచ్చు అని అన్నారు.తదుపరి మంత్రి లబ్ధిదా రు లకు కుట్టు మిషన్లు,పవర్ టూల్ కిట్లు జనరేటర్లను, 96 కళ్యా ణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్ లను అందజేశారు. ఈ కార్యక్ర మంలో డిప్యుటీ మేయర్ అమీర్ అలీ, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి,జిల్లా మైనారిటీ అభివృద్ధి అధికారి విజయెందర్ రెడ్డి,కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నా రు.
Minister Komatireddy Venkat Reddy







