—క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో పనిచేయాలి
Multi-Zone-2 IG Shahnawaz Qasim surprise inspe ction at Narketpally Police Station :: ప్రజా దీవెన, నల్ల గొండ క్రైమ్: ప్రజల రక్షణే ప్రధాన లక్ష్యంగా పో లీస్ అధికారు లు, సిబ్బంది క్రమశిక్షణ, నిజాయితీ, అంకిత భావంతో విధులు నిర్వహించాలని మల్టీ జోన్-2 ఐజీ షాహనాజ్ ఖాసీం ఐపీఎస్ స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీకి తా వులేదని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్ప డే వారిపై ఉక్కు పాదం మోపాలని పో లీస్ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశా రు.శనివారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సంద ర్శించిన ఐజీ.. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్‌తో కలి సి పోలీస్ హెడ్‌క్వార్టర్స్ లోని డాగ్ స్క్వా డ్, మోటార్ ట్రాన్స్ పోర్ట్ (ఎం.టీ.), డీపీఓ తదితర విభాగాలను తనిఖీ చేశారు. ఆ యా విభాగాల పనితీరు, సిబ్బంది విధులు, అందుబాటులో ఉ న్న వసతులపై ఆరా తీశారు.
అనంతరం జిల్లా పోలీస్ ఉన్నతాధికారులతో నిర్వహించిన స మీక్షా సమావేశంలో శాంతిభద్రతలు, నేరనియంత్రణ, కేసుల దర్యాప్తు, పోలీస్ స్టేషన్ల ప నితీరు, ప్రజా ఫిర్యాదుల పరిష్కా రంపై సమగ్రంగా సమీక్షించారు. ప్రతి అధికారి బాధ్యతాయు తంగా పనిచేస్తూ వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించు కోవాలని సూచించారు. ప్ర జలతో మర్యాద గా వ్యవహరిస్తూ బాధితులకు భరోసా కల్పించాల ని, చట్టం ముందు అందరూ సమానమేనన్న సూత్రంతో పారదర్శకంగా విధులు నిర్వహిం చాలని ఆదేశించారు.
గంజాయి, డ్రగ్స్, మట్కాపై ఉక్కుపాదం
జిల్లాలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ ర వా ణా, విక్రయాలు, వినియోగాన్ని పూర్తిస్థాయి లో అరికట్టేందుకు ప్ర త్యేక కార్యాచరణ చేపట్టాల ని ఐజీ ఆదే శించారు. డ్రగ్స్ సర ఫరా, విక్రయాల్లో ఉన్నవారిని గుర్తిం చి నిరంతర నిఘా ఏ ర్పా టు చే యడంతోపాటు విస్తృత తనిఖీలు, ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వ హించాలని సూచించా రు. మట్కా, జూదం, గ్యాంబ్లింగ్ వంటి చట్టవ్యతిరేక కా ర్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పున రావృత నేరాలకు పాల్పడే వ్యక్తు లపై ప్రత్యేక నిఘా ఉంచాలని స్పష్టం చేశారు.యువత మాద కద్రవ్యా ల బారిన పడకుండా విద్యాసంస్థలు, గ్రామాలు, ప ట్ట ణాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వ హించాలని సూచించారు.
నేరాలకు ముందే చెక్ పెట్టాలి
దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, ఇతర ఆస్తి సంబంధిత నేరాల నివారణకు పోలీసులు నిరంతరం అప్ర మత్తంగా ఉండాలని ఐ జీ పేర్కొన్నారు. రాత్రింబవ ళ్లు సమర్థవంత మైన పెట్రోలింగ్ ని ర్వహిస్తూ అను మానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. నాకాబందీలు నిర్వహించి త నిఖీలు ముమ్మరం చేయా లని, నేరం జరిగిన తర్వాత స్పందిం చడం కంటే నేరాలు జరగకుండా ముందస్తు నివారణ చర్యల కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠినంగా వ్యవహరించాలి
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృ ష్టి సారించాలని ఐజీ సూచించారు. డ్రం క్ అండ్ డ్రైవ్ తనిఖీ లు నిరంతరం నిర్వహిస్తూ మ ద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టప్రకా రం చర్యలు తీసుకో వాలన్నారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, ట్రాఫిక్ ని బంధనల ఉల్లంఘనలను ని యంత్రించి, రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచాలని ఆదేశించారు.
ప్రజలకు చేరువతో నమ్మకాన్ని పెంచాలి
ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పం దించి బాధి తులకు సత్వర న్యాయం అందించాల ని షాహ నాజ్ ఖాసీం సూచించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫి ర్యాదుదారుల సమ స్యలను ఓపికగా విని, గౌరవప్రదం గా వ్యవహరించాలని తెలి పారు. అధికారులు గ్రామా లను సందర్శించి ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలని, పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం మరింత పెం పొందించేలా పనిచేయాలని స్ప ష్టం చేశారు.
నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో తనిఖీలు
జిల్లా పోలీస్ కార్యాలయ సందర్శన అనంతరం ఐ జీ నార్క ట్‌పల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, ని ర్వహణ, సిబ్బంది విధులు, పెం డింగ్ కే సులు, దర్యాప్తు పురో గతిని పరిశీలించా రు. ఫిర్యాదు దారులతో మర్యాదపూర్వ కంగా వ్య వహరించాలని, కే సుల దర్యాప్తులో వేగం, నాణ్య త పాటిస్తూ బాధితు లకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవా లని అధికా రులకు సూచించారు.ఈ కార్య క్రమంలో అడిషన ల్ ఎ స్పీ రమేష్, డీఎస్పీలు మల్లారెడ్డి, శివరాం రెడ్డి, శ్రీని వా సరావు, రవి, లక్ష్మీ నారాయణ, ప్రొ బేషనరీ డీఎస్పీలు సైలేష్, అఖిల్, ఎల్. శ్రీకాంత్, యం. శ్రీకాంత్‌తో పాటు పలువురు సీఐలు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Multi-Zone-2 IG Shahnawaz Qasim surprise inspection at Narketpally Police Station


