–నాణ్యమైన విద్య, ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి
–గ్రామస్థాయిలో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలి
–డిసెంబర్ 15 వరకు అధికారులు అప్రమత్తంగా ఉం డాలి
Nalgonda Child Marriage Free District : ప్రజా దీవెన, నల్లగొండ: బాల్య వివాహాల నిర్మూలనే ల క్ష్యంగా నల్గొండ జి ల్లాలో సమగ్ర కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశే ఖర్ పిలుపునిచ్చారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, చిన్న వయసులోనే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయడం వారి విద్య, ఆరోగ్యం, ఉ జ్వల భవిష్యత్తును దెబ్బతీస్తుందని స్పష్టం చేశా రు. అ ధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజ లు సమన్వయంతో పనిచేసి నల్గొండను బాల్య వివాహ రహి త జిల్లాగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.శనివారం కలెక్టరేట్ ఆవరణలోని ఉదయాదిత్య భవన్లో జిల్లా మహిళా అభివృ ద్ధి, శిశు సంక్షేమ శాఖ, ఆశ్రిత సేవా సం స్థ ఆధ్వర్యంలో బాల్య వివాహ నిషేధ చట్టం, బాల్య వి వాహ ముక్త్ భారత్ అంతర్జా తీయ దినోత్సవం సంద ర్భంగా నిర్వహించిన అవగాహన సద స్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో బా ల్య వివాహాల కేసులు అధికంగా ఉండటం ఆందోళన కలిగిం చే విషయమని పేర్కొన్నారు. ఈ సామాజిక దురాచారాన్ని పూ ర్తిగా నిర్మూలించేందుకు క్షేత్రస్థాయి లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. గతంలో గురజాడ అప్పారావు, కందుకూ రి వీరేశలింగం వంటి సంఘ సంస్కర్తలు సమాజ మా ర్పు కోసం చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొ ని ప్ర తి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని సూచించారు.
18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం
ఆడపిల్లలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వివా హం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆడపిల్లలను కుటుంబానికి భారంగా భావించకుండా, వారికి నాణ్య మైన విద్య అందించి ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్స హించాలని కోరారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా బా ల్య వివాహాల వైపు మొగ్గుచూపే కుటుంబాలకు అవ సరమైన సహకారం అందించాలని సూ చించారు. వరక ట్నం తీసుకోవడం, ఇవ్వడం కూడా చట్టరీత్యా నేరమని, కట్నం లేని వివాహాలను ప్రోత్సహించాలని పిలుపు నిచ్చారు.
గ్రామస్థాయిలో ప్రత్యేక నిఘా
గ్రామాలు, తండాలు, మున్సిపాలిటీల్లో బాల్య వివాహాల నివా రణపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆ దేశించారు. గ్రామ కార్యదర్శులు తమ పరిధిలోని గ్రామాల్లో మై నర్ బాలికల వివరాలను సేక రించి, బాల్య వివాహాలు జరగ కుండా పర్యవేక్షిం చాల న్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జ రుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే స్పందించి, సంబం ధిత కుటుంబాలకు చట్టపరమైన అంశాలు, వాటివల్ల కలిగే అనర్థాలను వివరించాలని సూచించారు.ఈ ఏడాది డి సెంబర్ 15 వరకు వివాహాలు జరిగే అవకాశాలు ఉ న్నందున అధికా రులు మరింత అప్రమత్తంగా ఉండాలని, బాల్య వివాహాలు జ రగకుండా ప్రత్యేక నిఘా ఏ ర్పాటు చేయాలని ఆదేశించారు.
బాలికల ఆరోగ్యం, విద్యకు భరోసా కల్పించాలి
చిన్న వయసులో వివాహాల వల్ల బాలికలు శారీరకంగా, మాన సికంగా, ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొం టారని కలెక్ట ర్ పేర్కొన్నారు. ముఖ్యంగా టీనేజ్ గర్భధారణ వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. హెచ్పీవీ వ్యా క్సినేషన్ వంటి ఆరోగ్య కార్యక్ర మాల సందర్భంగా కూ డా బాలికలకు ఆరోగ్యం, విద్య, హక్కు లు, బాల్య వి వాహాల నివారణపై అవగాహన కల్పించాలని తెలిపారు.
బాలికలకు విద్య, ఆరోగ్యం, భద్రతతో కూడిన భవిష్యత్తును అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ.. అధికారు లు, ప్రజాప్రతినిధులు, గ్రామ కార్యద ర్శులు, అంగన్వాడీ సిబ్బంది, ఉపాధ్యాయులు, స్వ చ్ఛంద సంస్థలు, ప్రజలు సమి ష్టిగా కృషి చేయాలని క లెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మంలో జిల్లా సంక్షే మ అధికారి లావణ్య కుమారి, ఆశ్రిత డైరె క్టర్ నాగరా జు, చైల్డ్ వెల్ఫేర్ స్టేట్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, డీ ఎం హెచ్వో రాహుల్, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ చింత కృష్ణ, జిల్లా కోఆర్డినేటర్ శివరాజ్, డీసీపీవో గణేష్, సూపర్ వైజర్లు, సీడీపీ వోలు, ఇతర అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
సామాన్యుడి చేతిలో శక్తివంతమైన ఆయుధం సమాచార హక్కుచట్టం
నల్లగొండ: ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబు దారీతనా న్ని పెంపొందించడంతో పాటు అవినీతిని వె లుగులోకి తీసుకు వచ్చేందుకు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) అత్యంత శక్తివం తమైన సాధనమని జిల్లా కలె క్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. ప్ర తిపౌరుడు, ముఖ్యంగా విద్యార్థులు ఈ చట్టంపై పూర్తి అవగా హన కలిగి ఉం డాలని పిలుపునిచ్చారు. సమాచారాన్ని వ్యక్తి గత ప్ర యోజనాల కోసం కాకుండా ప్రజా సంక్షేమం, దేశ అభి వృద్ధికి ఉపయోగించాలని సూచించారు. శనివారం న ల్గొండ లోని టీఎన్జీవో భవన్లో సమాచార హక్కు వికాస సమితి ఆ ధ్వర్యంలో సమాచార హక్కు చట్టం–2005పై నిర్వహించిన అ వగాహన సదస్సుకు కలెక్టర్ బి. చంద్ర శేఖర్, రాష్ట్ర సమాచార కమిషనర్ దేశాల భూపాల్, తె లంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైం ట్స్ అథారిటీ సభ్యులు వర్రె వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖలు ప్రజ లకు అందించాల్సిన సమాచారాన్ని అందుబా టులో ఉంచడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఆర్టీ ఐ చట్టంలోని సెక్షన్ 4(1 )(బి) ప్రకారం ప్రభుత్వ కార్యా లయాల సమాచారం ప్రజలకు సులభంగా అందుబాటు లో ఉండేలా చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు. ఈ విషయంలో నల్గొండ జిల్లాకు రాష్ట్రస్థా యిలో ఉత్త మ గుర్తింపు రావడం జిల్లా యంత్రాంగం సమష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికా రులు నిరంతరం నిమగ్నమై ఉండటంతో కొన్నిసార్లు సమాచా ర అందజేతలో జాప్యం జరుగుతోందని, ఈ లోపాలను అధి గమించేందుకు త్వరలో ఆర్టీఐ మానిట రింగ్ సమావేశం నిర్వ హిస్తామని వెల్లడించారు. ఉద్యో గుల విధి నిర్వహణకు సంబం ధించిన సమస్యలు లేదా ఇతర అంశాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమాచారం పొందేందుకు సాంకేతిక పరి జ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని విద్యార్థుల కు హితవు పలికారు.
రాష్ట్ర సమాచార కమిషనర్ దేశాల భూపాల్ మాట్లాడు తూ.. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో పర్యటించి సుమారు 4 50 అవగాహ న సమావేశాలు నిర్వహించినట్లు తెలిపా రు. నల్గొండ జిల్లాలో సెక్షన్ 4(1)(బి) కింద ప్రభుత్వ స మాచారాన్ని ప్రజలకు అందు బాటులో ఉంచేందుకు కలె క్టర్ తీసుకున్న చర్యలు ప్రశంసనీ యమని కొనియాడా రు. ఈ కృషికి గుర్తింపుగా ఉత్తమ కలెక్టర్ అవార్డు లభిం చడం అభినందనీయమన్నారు.సమాచార హక్కు చ ట్టం సామాన్య ప్రజల చేతిలో ఉన్న శక్తివంతమైన ఆ యుధమని, విద్యార్థులు దేశానికి అమూల్యమైన సంపద అని పేర్కొన్నారు. విద్యార్థులు ఇప్పటి నుంచే ఆర్టీఐపై అవగాహన పెంపొందించుకొని భవిష్యత్తులో కలెక్టర్లు, న్యాయవాదులు, పోలీసు అధికారులు వంటి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఆర్టీఐ కా ర్యకర్తలు తమ సామాజిక బాధ్యత గా చట్టంలోని అం శాలను ప్రజలకు వివరించి, సమాజంలో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు.
అవినీతిని ప్రశ్నించే హక్కును కల్పించిన చట్టం
తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యులు వర్రె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అవినీతిని అరికట్ట డం, ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంపొందిం చడం, అధికారులను ప్ర జలకు జవాబుదారీగా నిల పడం లక్ష్యంగా ఆర్టీఐ చట్టం రూ పొందించబడింద న్నా రు. దేశంలోని 140 కోట్ల ప్రజలకు ప్రభు త్వ పరిపాలన గురించి ప్రశ్నించే, సమాచారం తెలుసుకునే హ క్కును ఈ చట్టం కల్పించిందని తెలిపారు.
ప్రభుత్వ అధికారుల తప్పులు, అవినీతి కార్యకలాపా లను వెలుగులోకి తీసుకురావడంలో ఆర్టీఐ కీలక పాత్ర పోషిస్తుంద ని వివరించారు. సమాచార హక్కు చట్టంపై ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ మరిన్ని కార్యక్రమా లు చేపట్టాలని కోరారు. ప్రజలను అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాల్లో భాగస్వాములను చేస్తే మెరుగైన ఫలితాలు సాధించ వచ్చని అభిప్రాయ పడ్డారు. సమాచార హక్కు చట్టంతో పాటు మానవ హ క్కులు, మహిళా హక్కులు, ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిర క్షణకు వివిధ కమిషన్లు పనిచేస్తున్నాయని వివరించా రు.అనంతరం సమాచార హక్కు చట్టం అమలులో ఉత్తమ అవార్డు సాధించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు ఎర్రమాద కృష్ణారెడ్డి, రాష్ట్ర మహిళా కమిటీ అధ్యక్షురాలు వై. హేమలత, సభ్యురాలు గోపగాని మాధవి, గా ద వినోద్ రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చింత ము త్యా లరావు, సమా చార హక్కు వికాస సమితి సభ్యులు, కార్యకర్త లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.





