ప్రజా దీవెన, కోదాడ: మండల పరిధిలోని కూచిపూడి గ్రామం లో నిర్మిస్తున్న దేవాలయాల్లో శుక్రవారం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహ చార్యులచే మహా సుదర్శన లక్ష్మీనరసింహ యాగంను (Lakshminarasimha Yagam) శుక్రవారం పూట అత్యంత వైభవంగా నిర్వహించారు. యాగంలో దంపతులు పీటలపై కూర్చొని స్వామి వారికి ప్రత్యేక పూజ (special poojas) కార్యక్రమాలు నిర్వహించారు. విశ్వక్సేనారాధన,పుణ్యాహవాచనం నిర్వహించి అగ్ని ప్రతిష్ట గావించారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహచార్యులు (Lakshminarasimhacharya)మాట్లాడుతూ కూచిపూడి లో స్వయంభుగా వెలసిన ఆలయాల విశిష్టతను, ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు. లోక సంక్షేమం కోసం అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని అత్యంత భక్తి శ్రద్ధలతో సుదర్శన నరసింహ మహాయాగం నిర్వాహకులు కందికొండ. సాయిబాబు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆలయాల నిర్మాణం పూర్తి అయ్యేందుకు భక్తులు, దాతలు సహకరించాలని కోరారు.అనంతరం వేలాదిగా తరలివచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పవన్ కుమార్ ఆచార్యుల బృందం చే జరిగే ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లెల (MPP Mallela). రాణి, జడ్పీటీసీ కృష్ణకుమారి,శెట్టి. భాస్కర్ రావు, పూర్ణా, నాంచారయ్య, శ్రీనివాసరావు, బాబురావు నూనే సులోచన దంపతులు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.