*కుటుంబానికి ఉత్తమ్ దంపతులు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం .
Congress party: ప్రజా దీవెన, కోదాడ:. సీనియర్ జర్నలిస్ట్ (Senior Journalist),అక్రమాలు,అన్యాయాల పై పోరాట చేసిన యోధుడు ఎలక సైదులు గౌడ్ (Elaka Saidulu Goud) అనారోగ్య కారణాల వల్ల అకాల మరణం చెందడం పత్రికా రంగానికి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ (Telangana State Congress Party) డెలిగేట్ నెంబర్ చింతకుంట్ల లక్ష్మీ నారాయణరెడ్డి (Lakshmi Narayana Reddy) అన్నారు. శుక్రవారం హుజూర్నగర్ లోని సైదులు గౌడ్ నివాస గృహానికి వెళ్లి సైదులు గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూగత కొన్ని సంవత్సరాలుగా హుజూర్ నగర్ నియోజక వర్గంలో అవినీతి, అన్యాయం, అక్రమాలు, దౌర్జన్యం పై నిరంతరం పోరాటం చేశారని ఆయన అకాల మరణం కలిసి వేసిందని సైదులు గౌడ్ మృతి కాంగ్రెస్ పార్టీ కి, సమాజానికి తీరని లోటు అని తెలిపారు ఆయన మరణం చెందటంతోఉత్తమ్ దంపతులు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తూ, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కోరుకుంటూ ఈ సందర్భంగా వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేసినారు . ఈ కార్యక్రమంలో కోదాడ కాంగ్రెస్ పార్టీ (Congress party) పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు, కోదాడ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, హుజూర్నగర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సన్నీరు మల్లికార్జున్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు