–నల్లగొండ జిల్లా కేంద్ర ఆసుపత్రి వైద్యులతో చర్చలు జరిపిన జెసి పూర్ణ చంద్ర
JC Purna Chandra: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్గొండ జిల్లా కేంద్ర ప్రధాన ఆస్పత్రి డాక్టర్ల చర్చలు (Discussions of hospital doctors) ఫలవంతం జిల్లా కలెక్టర్ జిల్లా ప్రధాన ఆస్పత్రిని జిల్లా అధికారులతో తనిఖీ చేయించే విషయంలో గత రెండు రోజులుగా మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, ప్రొఫెసర్లు,విభాగాల అధిపతులు చేస్తున్న నిరసనను (Protest) విరమించుకున్నారు.ఈ విషయమై శుక్రవారం నలుగురు సభ్యులతో కూడిన నల్గొండ వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరియు తెలంగాణ డాక్టర్ల బోధన సిబ్బంది అసోసియేషన్ బృందం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణ చంద్రను (Additional Collector T. Poorna Chandra) అదనపు కలెక్టర్ ఛాంబర్ లో కలిసి చర్చలు జరిపారు. చర్చల అనంత రం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర మాట్లాడుతూ తన తో డాక్టర్ల బృందం జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని తెలిపారు. చర్చల వివరాలను ఆయన వెల్ల డిస్తూ శుక్రవారం నల్గొండ వైద్య కళాశాల నుండి ఇద్దరు, మరియు తెలంగాణ డాక్టర్ల బోధన సిబ్బంది అసోసియేషన్ కి చెందిన ఖమ్మం, సూర్యాపేట వైద్య కళాశాలల (Suryapet Medical Colleges) నుండి వచ్చిన ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్ల బృందం తన దగ్గరికి వచ్చిందని, నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని అధికా రులతో తనిఖీ చేయించే విషయం తనతో చర్చించడం జరిగిందని, చర్చల సందర్భంగా జిల్లా అధికా రులతో ప్రధానాస్పత్రి ని ఆసుపత్రి పర్యవేక్షకులు ఏర్పాటు చేసిన ఒక ఆర్ ఎం ఓ తో కలిపి తనిఖీ చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారు ఒప్పు కోవడం జరిగిందని ఆయన తెలి పారు.
జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించు విషయ ములో అందరు కలిసి పని చెయ్యా లని నిర్ణయించుకున్నారని తెలిపా రు.వైద్య బృందంతో జరిపిన చర్చల ప్రకారం నల్గొండ జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ (Hospital Superintendent) ఎంపిక చేసిన ఆర్ఎంవో తో కలిసి రేపటి నుండి జిల్లా అధిలారులు యధావి ధిగా నల్గొండ జిల్లా ప్రధాన ఆస్పత్రి లో ప్రజలకు అవసరమైన పరిపాల నపరమైన విభాగాలను తనిఖీ చేస్తారని అదనపు కలెక్టర్ తెలి పారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తో చర్చలు జరిపిన వారిలో నల్గొండ మెడికల్ కళాశాల అసిస్టెం ట్ ప్రొఫెసర్ జె. శ్రీకాంత్ వర్మ, ఎల్ రమేష్, ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు తెలంగాణ డాక్టర్ల బోధన సిబ్బంది అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ కుమార్, జోనల్ కార్యదర్శి, మరియు సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల (Suryapet Government Medical College) అసిస్టెంట్ ప్రొఫెసర్ గిరిధర్ నాయక్ మరియు జి.జి. హెచ్ పర్యవేక్షకులు ప్రొఫెసర్ నిత్యానందం లు ఉన్నారు.