— సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
CITU: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ (Retirement of Government Servant) సహజమని అనంతరం ప్రజాసేవలో గడపాలని సిఐటియు (CITU) రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆర్టీసీ ఎస్ డబ్ల్యూ ఎఫ్ నల్గొండ రీజియన్ గౌరవాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ఆకాంక్షించారు. శనివారం టిజిఆర్ టి సి కంట్రోలర్ (TGR TC Controller) గా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నల్లగొండ డిపో కార్యదర్శిగా పని చేస్తున్న బోడ స్వామి ఉద్యోగ విరమణ సన్మాన సభ ఆర్టీసీ బస్టాండ్ (RTC Bus Stand)లో జరిగింది. ఈ సందర్భంగా బోడ స్వామి దంపతులకు సన్మానం చేసి మెమొంటో అందజేయడం జరి గింది. ఈ సందర్భంగా వీరారెడ్డి (Veera Reddy) మాట్లాడుతూ 30 సంవత్సరాలు ఆర్టీసీ డ్రైవర్ గా, కంట్రోలర్ గా సేవలందించి ఉద్యోగ నిర్వహణలో ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిపో కార్యదర్శిగా ఉద్యోగ కార్మికుల సమస్యలపై నిరంతరం అనేక పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు. ఆర్టీసీ పరిరక్షణ ,ఉద్యోగుల హక్కుల రక్షణ కోసం పనిచేసిన బోడ స్వామి ఉద్యోగ విరమణ అనంతరం పేద మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య లపై పోరాటాలు చేస్తూ ప్రజా జీవితం గడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ,ఎస్ డబ్ల్యూ ఎఫ్ నల్గొండ డిపో గౌరవాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, రీజియన్ అధ్యక్షులు కందుల నర్సింహ, డిపో ఉపాధ్యక్షురాలు రేవతి, సిఐటియు (CITU) జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ, సలివోజు సైదాచారి, నగేష్ , యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.