Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Teacher: బందనాల్లో తాగుబోతు టీచర్

–విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపా ధ్యాయులే దారి తప్పుతున్న వైనం
–తాగిన మైకంలో తూలనాడడంతో బంధించిన విద్యార్థులు
–కొత్తగూడెం జిల్లా ఇల్లందు పాడు పాఠశాలలో ఘటన

Teacher: ప్రజాదీవెన, భద్రాద్రి కొత్తగూడెం: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే (Teacher) దారి తప్పుతున్నారు. విద్యార్థులకు (students)మంచి అలవాట్లు నేర్పాల్సిన టీచర్ల మత్తులో (Teacher intoxication) తూగుతున్నారు. తాజాగా మద్యం సేవించి ఉపాధ్యాయ వృత్తికే కలంకాన్ని తెచ్చాడో ప్రబుద్ధుడు. తాగిన మైకంలో విద్యార్థులను దూషించడంతో స్థానికుల తరగతి గదిలో బంధించారు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఇల్లందులపాడు ప్రాథమిక పాఠశాలలో (Primary school) మద్యం సేవించి పాఠశాల విధులకు హాజరయ్యాడు. సుధాకర్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు మద్యం మత్తులో క్లాస్ రూమ్‌లోకి వచ్చి, విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుల దురుసుగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థులు (students)తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు స్కూల్‌కు వచ్చి తరగతి గదిలో బంధించి తాళం వేశారు విద్యార్థులతో తల్లిదండ్రులు స్థానికులు. విద్యార్థులను మంచి మార్గంలో నడిపించవలసిన ఉపాధ్యాయుడే మద్యం సేవించి ఉపాధ్యాయ వృత్తికే కలంకాన్ని తెచ్చాడు. తాగిన మత్తులో విద్యార్థులను దూషించి స్థానికుల చేత తరగతి గదిలో బంధించారు.

ఇల్లందులపాడు ప్రాథమిక పాఠశాలకు ఒకే ఒక ఉపాధ్యాయుడు సుధాకర్. ఐదు తరగతులకు (Classes five) ఒకడే బోధిస్తున్నాడు. ఆ ఒక్కడు కూడా సక్రమంగా హాజరు కాకపోగా, నిత్యం మద్యం సేవించి రావడం, ఇష్టం వచ్చినట్లు విద్యార్థులను దూషిస్తున్నాడు. మద్యం సేవించి రావడం దురదృష్టకరం. తరగతి గదిలో దూషించడంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు కొంతమంది స్థానికులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడిని పరిస్థితిని పరిశీలించారు. గదిలో పెట్టి తాళం వేసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. మద్యం (drunk) సేవించి పాఠశాలకు హాజరైన ఉపాధ్యాయుడు సుధాకర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని స్థానికులు డిమాండ్ (demand) చేశారు.