Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Murder: కటకటాల్లో నరహంతకుడు

–నగదు ఆశచూపి కామవాంఛ తీర్చుకున్న వెంటనే హత్య
–రెండేళ్లలో ఐదుగురు మహిళలను దారుణ హత్య చేసిన కిరాతకుడు

Murder:ప్రజా దీవెన,మహబూబ్‌నగర్‌: కామంతో కళ్ళు మూసి పోయిన ఓ కామాంధుడు నరహంతకుడిగా మా రిన ఉదంతం వెలుగులోకి వచ్చిం ది. ఒంటరిగా ఉన్న మహిళలకు మాయమాటలతో డబ్బు ఆశ చూపి శారీరక వాంఛ (physical desire) తీర్చుకున్న తర్వాత వారి ప్రాణాలు తీస్తున్న ఓ కరడుగట్టిన నరహంతకుడిని మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ పోలీసులు పట్టుకొని కటకటాల వెనక్కి పంపించారు. సదరు యువకుడు రెండేళ్లలో ఏకంగా ఆరు హత్యలు చేశాడంటే అతనిలోని నరరూప రాక్షసుడు ఏ స్థాయిలో రాక్షసత్వం ప్రదర్శిస్తున్నాడో ఇట్టే అర్థం చేసుకో వచ్చు. కామవాంఛతో ఐదుగురు మహిళలను (Five women) చంపిన సదరు అంత కుడు చేసిన అప్పు తీర్చమన్నందు కు ఓ పురుషుడిని కూడా కిరాతకం గా కడతేర్చాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్పీ జానకి ధరావత్‌ (SP Janaki Dharawat) వివరా లను శనివారం విలేకరులకు వెల్ల డించారు. గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం చిన్నచింతకుంట గ్రామా నికి చెందిన బోయ కాశమయ్య అలియాస్‌ బోయ కాశి(25) అవి వాహితుడు. రెండేళ్ల క్రితం మహ బూబ్‌నగర్‌కు వచ్చి కూలి పనులు చేస్తూ ఫుట్‌పాత్‌, బస్టాండ్‌ లో నిద్రి స్తూ కాలం గడిపేవాడు. పని చేయ గా వచ్చిన డబ్బుతో మద్యం తాగి జల్సా చేసేవాడు.

కూలీలు పని కోసం వేచి ఉండే అడ్డాల దగ్గర మాటు వేసి ఒంటరి మహిళలతో (woman) మాటలు కలిపి డబ్బు ఆశ చూపి లోబర్చుకు నేవాడు. నమ్మి వచ్చిన వారితో వాంఛ తీర్చుకున్న తర్వాత ప్రాణం తీసి పరారయ్యేవాడు. మే 25న టీడీగు ట్ట లేబర్‌ అడ్డా దగ్గర మహబూబ్‌ నగర్‌ మండలం గాజులపేటకు చెందిన ఓ మహిళకు డబ్బు ఇస్తానని నమ్మించి భూత్పూర్‌లోని అమిస్తా పూర్‌ వంతెన వద్ద నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోకి తీసుకెళ్లాడు. అక్కడ శారీరక వాంఛ తీర్చుకున్న తర్వాత ఆమె గొంతుకు టవల్‌ బిగించి, బ్లేడుతో గొంతుకోశాడు. అనంతరం బండరాయితో తలపై మోది ఆమె కాళ్లకున్న వెండి కడి యాలు తీసుకుని పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి దుస్తులకు అతుక్కుని ఉన్న ఓ బస్‌ టికెట్‌పై (Bus ticket) రాసి ఉన్న ఫోన్‌ నెం బర్‌ ఆధారంగా దర్యాప్తు చేసి హ త్యకు గురైంది ఎవరనేది గుర్తించా రు. ఆ క్రమంలో నిందితుడు కాశీని గుర్తించిన పోలీసులు టీడీగుట్ట వద్ద శనివారం అదుపులోకి తీసుకుని విచారించారు. నేరాన్ని అంగీకరించి న కాశీ గతంలో తాను చేసిన హత్య ల వివరాలను వెల్లడించాడు. 202 2 జూన్‌ 22న బిజినేపల్లి మండలం అల్లీపూర్‌ గేట్‌ దగ్గర ఓ గుర్తుతెలి యని మహిళను హత్య చేసిన కాశీ 2022 నవంబరు 21న హన్వాడ పరిధిలో జైనల్లీపూర్‌ గ్రామానికి చెం దిన ఓ మహిళ ప్రాణం తీశాడు. 2023 జూన్‌ 17న వనపర్తి రూరల్‌ లోని పెద్దగూడెం గ్రామంలో ఓ మహిళను, 2024 ఫిబ్రవరి 7న మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం పరిధిలోని మన్యంకొండ దగ్గర మరో మహిళను హత్య చేశాడు. సంగారె డ్డి జిల్లాకు చెందిన మున్నూర్‌ మల్లే ష్‌ అనే సహచర కూలీ కాశీకి రూ.3వేలు అప్పు ఇచ్చి తీర్చమ న్నందుకు 2023 జూలై 13న అమిస్తాపూర్‌ శివారులో తలపై బండరాయితో మోది హత్య (murder) చేశాడు.