–టీమిండియాకు బీసీసీఐ రూ.125 కోట్ల మేర రివార్డు
–అంతర్జాతీయ టి20లకు జడేజా గుడ్‌బై, విరాట్ కోహ్లి, రోహిత్‌శర్మ బాటలో వీడ్కోలు
–ఒక్క రోజులో ముగ్గురు స్టార్ క్రికెటర్ల నిర్ణయం
–ముగిసిన కోచ్ ద్రవిడ్ పదవీ కాలం
BCCI: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వందకోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ టి20 ప్రపంచ కప్ (T20 World Cup)గెలిచిన టీమిండియాకు భారీ నజరానా ముట్టింది. భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ (BCCI)రూ.125 కోట్ల రివార్డు ప్రకటించింది. కింగ్ కోహ్లి (Kohli), కెప్టెన్ రోహిత్ శనివారం పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పగా ఆల్ రౌండర్ జడేజా ఆదివారం వారి బాటలోనే నడిచాడు. హెడ్ కోచ్ ద్రవిడ్ పదవీ కాలం జూన్‌తో ముగిసింది. ప్రపంచకప్ విజయం అనంతరం ప్రధాని మోదీ కోచ్, క్రికెటర్లకు ఫోన్ చేశారు. ద్రవిడ్, రోహిత్, కోహ్లి, పాండ్య, సూర్యను అభినందించారు.