–మళ్లీ ఎన్నికల రణరంగంలో నిలిచి గెలవాలి
–రాజకీయాలలో రోజురోజుకు విలువలు దిగజారి పోతున్నాయి
–సంజయ్ తన స్వార్ధ ప్రయోజనా ల కోసమే పార్టీ మారారు
–జగిత్యాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మాజీమంత్రి కేటీఆర్
KTR: ప్రజా దీవెన, జగిత్యాల: రాజకీయాలలో రోజురోజుకు విలు వలు దిగజారిపోతున్నాయని, స్వా ర్థ రాజకీయాలకే కొందరు ఎమ్మెల్యే లు పార్టీలు మారుతున్నారని, పార్టీ ఫిరాయింపులను ఆజ్యం పోసిందే కాంగ్రెస్ పార్టీ అని బిఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఆందోళన వ్యక్తం చేశారు. గాలికి గడ్డి పోసలే ఎగిరిపోతాయని, బి ఆర్ఎస్ కార్యకర్తలు గడ్డపార లాంటి వారిని, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు దమ్ముంటే రాజీనామా (resignation) చేసి, మళ్లీ ఎమ్మెల్యేగా (mla)గెలవాలని సవాల్ విసిరారు. జగిత్యాలకు పట్టిన శని పోయిందని, బిఆర్ఎస్ కార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా ఉంటామని అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన జగిత్యాల బిఆర్ఎస్ పార్టీ నాయ కుల కార్యకర్తల ఆత్మీయ సమ్మేళ నానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారు గుర్తు పై గెలిచి పార్టీ మారిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ (Sanjay) తన స్వార్థానికి పార్టీ మారారని, జగి త్యాలకు పట్టిన శనిపోయిందని, కష్టకాలంలోనే మనుషుల విలువ తెలుస్తుందని, గాలికి గడ్డి పూసలే ఎగిరిపోతాయని గడ్డపారలు ఎగిరిపోవన్నారు. జగిత్యాల ప్రజలు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా గెలిపిస్తే రేవంత్ రెడ్డి (revanth reddy) వేసే ఎంగిలి మెతుకుల కోసం ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారారని, ఇప్పుడు జగిత్యాల అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు ఎమ్మెల్యే మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం లేదని, జగిత్యాలను జిల్లా చేసి మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని, రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా జగిత్యాలలో 4520 డబల్ బెడ్ రూమ్ (Double bedroom)ఇండ్లను నిర్మించామని, గత పది ఏళ్లలో జగిత్యాలను ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామన్నారు.ఎమ్మెల్యే సంజయ్ తన స్వార్ధ ప్రయోజనాల కోసమే పార్టీ మారారని, సంజయ్ కు దమ్ముంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్లీ ఎమ్మెల్యేగా గెలవాలని సవాల్ విసిరారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీయేనని, నాడు ఇందిరాగాంధీ హయాంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకున్నారని గుర్తు చేశారు. 2014లో కాంగ్రెస్ మెడలు వంచి స్వరాష్ట్ర తెలంగాణను సాధించామని, బిఆర్ఎస్ పార్టీ ఒక్కొక్క ఎమ్మెల్యేను చేర్చుకోలేదని, రాజ్యాంగబద్ధంగానే 2/3 శాతం ఎమ్మెల్యేలు పార్టీలో చేరారని గుర్తు చేశారు. ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరితే రాళ్లతో కొట్టి చంపాలని మాట్లాడారని, ఇప్పుడు ఎవరిని రాళ్లతో కొట్టాలో చెప్పాలన్నారు.
కాంగ్రెస్లో చేర్చుకున్న ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో (brs) రాజీనామా చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి (cm revanth reddy) కి సవాల్ విసిరారు.పార్టీ ఫిరాయిస్తే సభ్యత్వాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలు పేర్కొందని, ఇప్పుడు ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ఇలా చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ (Congress party) నోటికి వచ్చిన హామీలు ఇచ్చిందని, గత ప్రభుత్వ అమలు చేసిన రైతుబంధు, పెన్షన్ల సంక్షేమ పథకాలను సైతం అమలు చేయడం లేదని, ఉచిత కరెంట్ అని చెప్పి కరెంటు లేకుండా చేస్తున్నారన్నారు. గొర్రెలు, బర్రెలు కొన్నట్లుగా ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 14 స్థానాల్లో స్వల్ప మెజార్టీతో ఓటమి చెందామని, బిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే ముఖ్య బలమని, మధ్యలో వచ్చిన నాయకులు మధ్యలో వెళ్లిపోయారని, పార్టీకి కార్యకర్తలు ముఖ్యమని, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అధైర్య పడకుండా ధైర్యంతో ఉండాలన్నారు.8 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరే కత వచ్చిందని, రానున్న రోజుల్లో ప్రజలు కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పేందు కు సిద్ధంగా ఉన్నార న్నారు. కార్యకర్తలు ఎవరు భయప డకుండా బాధపడకుండా ఉండా లని, కార్యకర్తలు అందరికీ ఎల్లప్పు డూ అండగా ఉంటామని భరోసా నిచ్చారు.
రాజకీయాల్లో హత్యలు ఉండవని ఆత్మహత్యలే ఉంటా యని, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ (sanjay) పార్టీ మారి ఆత్మహత్య చేసుకున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సమాజం చీలిందని, దేశంలో బలమైన రాజకీయ పార్టీలు ఉన్నాయని, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పలు పార్టీలకు అనుకున్న ఫలితాలు రాలేదని, బిఆర్ఎస్ పార్టీకి (brs party)పోరాటం కొత్త కాదని, నిత్యం ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటామన్నారు.ఈ సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్, కోరుకంటి చందర్ , జడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, నాయకులు చిన్నమనేని లక్ష్మీనరసింహారావు, సర్దార్ రవీందర్ సింగ్, శ్రీకాంత్ రెడ్డి, వివిధ మండలాల జడ్పిటిసిలు, ఎంపీపీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.