–వారందరినీ కర్రుకాల్చి వాతపెట్టి తరిమి కొడదాం
–తెలంగాణ ప్రజలు దేనికీ బానిస లు కావొద్దు
–తెలంగాణ సామాజిక చైతన్య ఉద్యమాల గడ్డ
–డ్రగ్స్, మాదక ద్రవ్యాల ద్వారా సమాజం సర్వనాశనమవుతుంది
–హత్యలు, మానభంగాలు, సైబర్ నేరాలు, డ్రగ్స్ పెను సవాళ్లు
–ఇకపై ప్రతి సినిమాకు ముందు రెం డు నిమిషాల అవగాహన వీడియో వేయాల్సిందే
–పోలీసులకు ప్రతిభ ఆధారిత పదోన్నతులు, ప్రోత్సాహకాలు
–సైబర్ సెక్యూరిటీ వాహనాల ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: సమా జంలో మాదకద్రవ్యాల వాడకం మితిమీరిపోయి నేరాలు శృతి మించి పోతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (revanth Reddy)ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి మత్తులో నేరాలు అధి కంగా జరుగుతున్నాయని అభిప్రా యపడుతూ వాటిని అరి కట్టేందు కు శక్తివంచన లేకుండా కృ షి చేయాలని పోలీస్ లను(police)కోరారు. నేరాలు అరికట్టేందుకు కృషి చేసిన అధికారులకు ప్రత్యేక గుర్తింపు నిస్తా మని హామీ ఇచ్చారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంగళవారం ఆయన టిజి న్యాబ్, సైబర్ కంట్రోల్ వాహనాలను (cyber control vehicles)లాంచనంగా ప్రారం భించారు. అనంతరం నార్కొటిక్ బ్యూరో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. అనంత రం పోలీస్ ఉన్నతాదికారులతో మాట్లాడుతూ డ్రగ్స్, సైబర్ క్రైమ్(drugs, cyber crime)సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయని తెలిపారు. మీడియా కూడా వీటిపై ఫోకస్ పెంచాలని రిక్వెస్ట్ చేశారు. తెలంగాణ లో నేరస్తులు కాలు పెట్టాలంటే వెన్నులో వణుకు పుట్టాలని అన్నారు. సామాజిక నేరగాళ్లను తరిమి కొట్టాలని పిలుపు ఇచ్చారు.ఇది సామాజిక చైతన్య ఉద్యమాల గడ్డ అని అం టూ తెలంగాణ ప్రజలు దేనికీ బాని సలు కావొద్దని హితవు పలికారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాల ద్వారా సమాజం సర్వ నాశనమవు తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మర్డర్,(murder)రేప్ తీవ్రమైన నేరాలని ఇప్ప డు వాటికి తోడు సైబర్ నేరాలు, డ్రగ్స్ పెను సవాళ్లు గా మారాయ న్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం చిరంజీవి వీడియో సందేశం పంపా రని, డ్రగ్స్ నియంత్రణకు అలాంటి వాళ్లు చాలా మంది ముందుకు రా వాలని పిలుపునిచ్చారు. సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్న సిని మా వాళ్లు తిరిగి కొంతైనా ఇవ్వా ల్సిందే అని రేవంత్ రెడ్డి( revanth Reddy)అన్నారు. సమాజాన్ని కాపాడే బాధ్యత సినీ ఇండస్ట్రీపై ఉందని తెలిపారు. థి యేటర్లలో డ్రగ్స్ నియంత్రణ కోసం ఉచితంగా వీడియో ప్రదర్శించాల న్నారు. అలాగే సందేశాత్మకంగా ఉండే వీడియోలు దర్శకులు తీయాలని కోరారు. ప్రతి ప్రతి సినిమాకు ముందు 2ని. అవగా హన వీడియో తప్పనిసరిగా ప్రద ర్శించాలని ఎగ్జిబిటర్స్ కోరారు.