–చిన్న పిల్లలతో వెట్టిచాకిరి చేయిస్తే క్రిమినల్ కేసులు
–బాల కార్మికుల గురించి 1098, 100లకు సమాచారమివ్వండి
— నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
SP Sarath Chandra parwar: ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్:నిరా దరణకు గురైన, తప్పిపోయిన, వెట్టి చాకిరికి గురౌవుతున్న బాలబాలిక ల సంరక్షణ (child secure) కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం జన వరిలో ఆపరేషన్ స్మైల్, జులైలో ఆపరేషన్ ముష్కాన్ కార్యక్రమాల ను విజయవంతంగా నిర్వహిస్తున్నా మని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవా ర్ (Sharath Chandra parwar)అన్నారు. జిల్లా పోలీసు కార్యాల యంలో (police office)ఏర్పాటుచేసిన ఆపరేషన్ ముష్కన్ 10 కార్యక్రమలో మాట్లా డుతూ జూలై 1 నుండి 31 వరకు నెల రోజుల పాటు పోలీస్ అధికా రులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెం ట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ (labour and educational department)వివిధ డిపార్ట్మెంట్ అధి కారుల సమన్వయంతో జిల్లా వ్యా ప్తంగా ఈ యొక్క ఆపరేషన్ నిర్వ హించడం జరుగుతుందని అన్నా రు. 18సంవత్సరాల లోపు తప్పి పోయిన, వదిలివేయబడిన, వివిధ రకాల బాల కార్మికులు కిరాణంషాప్ లలో, మెకానిక్ షాపులలో, హోటళ్ల లో, వివిధ కంపనిలలో పనిచేస్తూ మరియు రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలు బాలకార్మికులుగా ఉన్నట్ల యితే అలాంటి వారిని గుర్తించి తల్లి దండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం, లేదా స్టేట్ హోమ్ కు పంపించడం జరుగుతుందని అన్నా రు. ఎవరైనా బాలల యొక్క స్వేచ్ఛ కు, వికాసానికి భంగం కలిగించిన, వెట్టి చాకిరీ చేయించినా అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం జరు గుతుందని హెచ్చరించారు. పరిశ్ర మలు, బ్రిక్స్ తయారీ, హోటల్స్, లాడ్జ్, మినరల్ వాటర్ సప్లై, దుకా ణాలు, ధాబాలు ఇలా ఎక్కడైనా పిల్లలు వెట్టి చాకిరీకి గురైతే సంభం దిత యాజమాన్యాలపై కేసులు న మోదు తప్పవని హెచ్చరించారు.
నిరాదరణకు గురైన, తప్పిపోయిన పిల్లలు ఉన్న, వెట్టి చాకిరీకి గురవు తున్న పిల్లలు ఉన్న 1098 గాని, డయ ల్ 100కి గాని వారికి సమా చారం ఇవ్వాలి అని బాలకార్మిక వ్యవస్థకు ప్రతి ఒక్కరు కృషి చేయా లని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ యస్పీ రాములు నాయ క్,యస్బి డియస్పీ రమేశ్, డి.సి. ఆర్.బి డియస్పీ సైదా, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ కృష్ణ, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ సక్కుబాయి,అస్సిస్టెంట్ లేబర్ ఆపిసర్ రాజు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపా ర్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొ న్నారు.