–మంత్రివర్గంలో ఈ దఫా 4గురికి మాత్రమే ఖాయమని సంకేతాలు
–రాజగోపాల్ రెడ్డి, వాకాటి శ్రీహరి, ప్రేమ్ సాగర్ తో పాటు జీవన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి లలో ఎవరో ఒకరు
–తుదిరూపుకు నేడు అదిష్టానం వద్దకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి
Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: కాంగ్రెస్ క్యాండిడేట్ గా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారికే అమాత్య పదవు లన్న సంకేతాలకు ఊతమిస్తూ రే వంత్ రెడ్డి (Revanth Reddy)ముందుకెళ్తున్నట్లు తెలు స్తోంది. ఇటీవల కాంగ్రెస్ టికెట్ గెలి చిన వారికే మంత్రివర్గంలో చోటు దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్ఠా నం నిర్ణయం మేరకే చేశారని స్పష్ట మవుతోంది. తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) లో ప్రస్తుతం సీఎం తో పాటు 12 మంది మంత్రులు ఉండగా మరో ఆరుగురికి అవకాశం ఉంటుంది . కమంత్రివర్గ విస్తరణలో చోటు ఎవ రికి దక్కించుకునే విషయంలో ప్రస్తు తం రాజకీయవర్గాల్లో విస్త్రుత స్థా యిలో చర్చ జరుగుతున్నది. కాగా దీనిపై సామాజిక సమీకరణల (Social mobilization)ఆధా రంగా విస్తృత చర్చల అనంతరం నలుగురి విషయంలో రాష్ట్ర నాయ కత్వం కొలిక్కి వచ్చినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ జాబితా ను ఫైనల్ చేయడానికి సీఎం, డి ప్యూటీ సీఎం, పార్టీ సీనియర్ నేతలు రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్లను న్నారని తెలుస్తున్నది.
కొత్తగా క్యాబినెట్లోకి (cabinet) వచ్చే కూర్పులో నలు గురి పై స్పష్టత వచ్చినట్టు సమాచారం. సదరు నాలుగింటిలో రెండు రెడ్డి లకు, ఒకటి వెలుమలకు, ఒకటి బీసీ లకు దక్కనున్నదని వెల్లడ వుతోంది. రెడ్డి సామాజికవర్గ కోటాలో బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి (MLA Rajagopal Reddy, Parigi MLA Rammohan Reddy) మధ్య తీవ్ర పోటీ నెలకొన్నదని తెలుస్తున్నది. వీరిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి చో టు ఖాయంగా కనిపిస్తోంది. భువ నగిరి ఎంపీ టికెట్ తమ కుటుంబ సభ్యుల కోసం చివరి వరకు ప్రయ త్నించిన ఆయనకు హైకమాండ్ (High Command) అప్పుడే హామీ ఇచ్చిందని సమా చారం. సీఎం సన్నిహితు డైన చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలనే హైకమాండ్ ఆదేశాలను పాటించినందుకు ఆయనకు బెర్త్ ఖరారైనట్టు తెలు స్తోంది. ఈ సామాజిక వర్గంలో మరొకరి అవకాశం ఉండటంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పి. సుదర్శన్ రెడ్డి ల మధ్యే పోటీ ఉన్నపటిక హైకమాండ్ జీవన్ రెడ్డివైపే మొగ్గు చూపుతున్నదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన వారిలో ఒకరికి ఆర్టీసీ చైర్మన్, చీఫ్ విప్ పద వులు కట్టబెట్టనున్నట్టు తెలుస్తోంది. వెలమ సామాజికవర్గం నుంచి ప్రేమ సాగర్ రావు కు మంత్రిగా అవకాశం కన్ఫర్మ్ అంటున్నారు. కేబినెట్ లో మంచిర్యాలకు మంత్రివర్గంలో ప్రాతి నిథ్యం కల్పించడం కోసమే ఈ నిర్ణ యానికి వచ్చినట్లు సమాచారం.
బీసీ సామాజివర్గం (BC society)నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి ముదిరాజ్ దాదాపుగా ఖరారై నట్టేనని చెబు తున్నారు. అయితే నిన్న మంత్రి దామోదర రాజనర్సింహా (Damodara Rajanarsimha)మాట్లా డుతూ మంత్రివర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్ లకు చోటు దక్కే అవకాశం ఉన్నద న్నారు. ఈ క్రమంలో ఈ నాలుగు కాకుండా మరో రెండు కేబినెట్ బెర్త్ ను ఒకటి ఎస్టీ, మరొకటి మైనారిటీ ఇవ్వాలనుకున్నది. అయితే ఎస్టీ సామాజిక వర్గం నుంచి సీతక్కకు హోం శాఖ ఇస్తారని మంత్రి దామో దర రాజనర్సింహ చెప్పారు. దీంతో మరొకటి బీసీలకు (bcs) ఇవ్వొచ్చన్నది వినికిడి. దానం మంత్రి అవుతారని లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ చెప్పిన ప్రకారం ఆయనకే అవకాశం రావొచ్చు అంటున్నారు. మరో స్థానం నుంచి ఎస్సీకి ఇవ్వొచ్చ ని వివేక్, అలంపూర్ మాజీ ఎమ్మె ల్యే సంపత్ లలో ఒకరిని తీసుకుం టారని సమాచారం. మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడానికి ఎవరికి వారు హైకమాండ్ ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. దీంతో చివరి నిమిషం వరకు జాబితాపై సస్పెన్షన్ కొనసాగే అవకాశం ఉంటుంది. కేబినెట్ విస్తరణతో పీసీసీ అధ్యక్ష పదవిపై క్లారిటీ వచ్చిందని సమాచారం. ప్రభు త్వాన్ని, పార్టీని సమన్వయం చేసి అందరినీ కలుపు కుని వెళ్లే నాయ కుడు అయితేనే ఎలాంటి ఇబ్బంది. ఉండదని అధిష్ఠానం ఆలోచన. ఈ పదవి కోరుతున్న వారి జాబితా పెద్దగానే ఉన్న క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రేసులో ముందంజలో ఉన్నారన,అలాగే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లు మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డిలు ఆశిస్తున్నారు. వీళ్లలో ఎవరినైనా పరిగణనలోకి తీసు కుంటారా లేక కాంగ్రెస్ పార్టీలో (congress party) మాదిగలకు అన్యా యం జరుగుతున్నదనే విమర్శలకు చెక్ పెట్టడా నికి సంపత్ కుమార్ కు ఆ పదవి ఇచ్చి, వివేక్ ను మంత్రి వర్గంలోకి తీసుకుంటారా అన్నది రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.