Press Club: ప్రజా దీవెన ,కోదాడ: సమాజంలో యువతి యువకులు ఉపాధి అవకాశాలను కల్పించుకొని వారి కాళ్లపై వారు నిలబడి పది మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని టియుడబ్ల్యూజే హెచ్ 143 జిల్లా ప్రెస్ క్లబ్ (Press Club) అధ్యక్షులు కారంగుల అంజి గౌడ్ యువతకు పిలుపునిచ్చారు యువకులు సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని సిసి విద్యా నిలయం (cc Vidya Nilayam) వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన కార్ వరల్డ్ వీల్ అలైన్మెంట్ (Car World Wheel Alignment) షో రూం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహన రంగంలో మంచి అనుభవం ఉన్న యువకులు సతీష్ రెడ్డి షోరూమ్ ఏర్పాటు చేయడంతో పాటు పదిమందికి ఉపాధి కల్పించి ఆదుకుంటున్నాడని తెలిపారు. యువకులకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు కల్పిస్తుందని ఇలాంటి అవకాశాలను యువతి యువకులు సద్వినియోగం చేసుకొని వారి కాళ్లపై వారు నిలబడి సమాజంలో గౌరవంగా జీవించాలని తెలిపారు కోదాడ ప్రాంతంలో వాహనదారులు కారు వరల్డ్ విల్ అలైన్మెంట్ (Car World Wheel Alignment) షోరూం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు నిర్వాహకులు, కుటుంబ సభ్యులు వాహనదారులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.