Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KCR: అద్భుతమైన విజయగాథలే అపజయ గాథలు లేవు

–రెండున్నర దశాబ్దాల బిఆర్ఎస్ ప్ర స్థానంలో అనేక ఆటంకాలు అధి గమించాం
–ఆటంకాలను అలవోకగా దాటు కుంటూ ప్రజాదరణను మరింతగా పొందుకుంటూ ముందడుగు వేస్తాం
–ఎర్రవెల్లి మహాబూబాబాద్, మేడ్చ ల్,నల్గొండ జిల్లాల నాయకులు, కార్యకర్తలు నాయకులతో బి ఆర్ ఎస్ అధినేత కెసిఆర్

KCR:ప్రజా దీవెన, మెదక్: రెండున్నర దశాబ్దాల బిఆర్ఎస్ ప్రస్థానంలో (BRS party)ప్రతి అడుగులో అద్భు తమైన విజయగాథలే తప్ప అపజ య గాథలు లేవని, తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకుని నిలబడ్డ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదని., ఎటువంటి ఆటం కాలనైనా అలవోకగా దాటుకుం టూ ప్రజాదరణను మరింతగా పొందుకుంటూ ముందడుగు వేస్తుం దని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)పునరుద్ఘాటించారు.తెలంగాణ అస్థి త్వమే ప్రమాదంలో పడిన దిక్కు మొక్కు లేని చివరిదశ ఉద్యమకా లం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన అటునుంచి పదేండ్ల ప్రగతి పాలన దాకా తాను ఎదు ర్కున్న కష్టాలను కేసీఆర్ (KCR)ఈ సంద ర్భంగా కార్యకర్తల కు వివరించారు. ఆనాడు తెలంగా ణను అష్ట దిగ్భం దనం చేసిన సమై క్యవాద శక్తులు, వారి మీడియాతో సహా సమస్త రంగాలు వాళ్లు రాసిం దే రాత గీసిం దే గీత’గా నడిచేదని గుర్తుచేశారు. అత్యంత శక్తివంతమై న ఆంధ్రా వ్యవస్థలను తట్టుకుం టూ, తెలం గాణ వ్యతిరేకతకు, సమైక్య వాదా నికి సింబాలిక్ గా ఉన్న నాటి పాలకుడు చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ను ఎదిరించి నిలవడం అంటే అష మాషీ వ్యవహారం కాదని అన్నారు. అటువంటి సమైక్య వాద కుటిల వ్యవస్థలనే బద్దలుకొట్టి తెలంగా ణను సాధించి, కలబడి నిలబడిన తెలంగాణ సమా జం, భవిష్యత్తులో ఎటువంటి ప్రతి బంధక పరిస్థితిల నైనా అధిగమి స్తుందని కేసీఆర్ భరోసా వ్యక్తం చేశారు.

గెలుపు ఓటములకు అతీతంగా తెలంగాణ సమాజం (Telangana) మనకు ఎల్లవేళలా అండగా ఉం దని, భవిష్యత్తులోనూ ఉం టుందని కార్యకర్తల జై తెలంగాణ నినాదాల నడుమ కేసీఆర్ ప్రక టించారు.శత్రువుల ప్రత్యర్థుల కుటిల యత్నాలను అధిగమిస్తూ అప్రతిహతంగా కొనసాగుతున్న బిఆర్ఎస్ విజయ ప్రస్థానంలో నిన్నటి ఓటమితో దిష్టి తీసినట్ట యిందని, తిరిగి పునరుత్తేజంతో మరింతగా ప్రజాదరణను కూడ గట్టాలని కార్యకర్తల హర్షధ్వానాల నడుమ కేసీఆర్ (KCR) ప్రకటించారు.
ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రేస్ పార్టీ(Congress party), ఇచ్చిన అల విగాని హామీలు అమలు చేయడం చేతగాక పలురకాల జిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నదని దుయ్యబ ట్టారు. కాంగ్రేసు పార్టీ (Congress party)నైజం మరో సారి అర్థమైన ప్రజలు, ఓటేసి పొర పాటు చేసినామని నాలిక కరుసు కుంటున్నారని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో మున్నెన్న డూ లేనివిధంగా ప్రశాంతమైన పాల న ద్వారా పదేండ్లపాటు సంక్షేమం అభివృద్ధిని అందిస్తూ అన్ని తీర్లా అండగా నిలబడ్డ బిఆర్ఎస్ పార్టీని తిరిగి తెలంగాణ సమాజం కోరు కుంటున్నదని కేసీఆర్ తెలి పారు. కేసీఆర్ మీద ద్వేషంతో, అసంబద్ధ ప్రకటనలతో, ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా నడస్తున్న కాంగ్రేస్ ప్రభుత్వం మీద ప్రజలు తిరుగబడే రోజులు త్వరలోనే రానున్నాయని స్పష్టం చేశారు. తన చేష్టలతో తానే ప్రజలచేత ఛీ కొట్టించుకోవడమే యాబై ఏండ్ల కాంగ్రేస్ వైఖరి అనీ, ఈ నేపథ్యంలో ప్రజలు అనతికాలం లోనీ కాంగ్రేస్ పాలనపై విరక్తి చెందా రనే విషయం క్షేత్రస్థాయిలో కనిపి స్తున్నదని సోదాహరణలతో కేసీఆర్ వివ రించారు. మరికొద్ది రోజుల్లోనే టార్చ్ లైట్ పట్టుకొని జనం దోలాడు కుంటా బిఆర్ ఎస్ పార్టీకోసం వస్తా రని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేస్తూ అప్పడిదాక ఓపికతో ప్రజా సమస్యలపైన పోరాడుతూ వారికి అందుబాటులో వుండాలని కార్య కర్తలకు అధినేత కేసీఆర్ పిలుపు నిచ్చారు. బుధవారం ఎర్రవల్లి (Aravali)నివాసం లో తనను కలిసేందుకు మహాబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాల నుండి వచ్చిన కార్య కార్యకర్తలు నాయకులతో కేసీఆర్ సమావే శమయ్యారు. ఈ సమా వేశంలో(meeting) నల్గొండ తదితర జిల్లాల మాజీ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు , ఎంఎల్సీ లు పాల్గొన్నారు. వారిలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంఎల్సీ లు మధుసూ దనాచారి, తక్కెళ్ల పల్లి రవీందర్ రావు, కోటి రెడ్డి, గాద రి కిశోర్, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, జీవన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, గొంగిడి సునీతా రెడ్డి, నల మోతు భాస్కర్ రావు, రమావత్ రవీంద్ర కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నోముల భగత్, బూడిద బిక్షమయ్య గౌడ్, కంచర్ల కృష్ణారెడ్డి, తిప్పన విజయసింహా రెడ్డి, ఒంటెద్దు నర్సింహ రెడ్డి తది తరులు పాల్గొన్నారు. తన పట్ల తెలంగాణ సమాజం చూపు తున్న ప్రేమాభి మానాలకు కేసీఆర్ ధన్య వాదాలు తెలిపారు. అయితే తన ను కలిసేందుకు ముందస్తు సమా చారం తో మాత్రమే రావాలని మరో సారి కార్యకర్తలకు అభిమానులకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భం గా కేసీఆర్(KCR) మాట్లాడుతూ నన్ను కలుద్దానికి పిలిచినోళ్లు పిలవనోళ్లు వేలమంది వస్తున్నరు రోజు మీ అభి మానానికి థాంక్స్. అయితే అంత మందికి ఐదారు గంటలపాటు నిలబడి ఫోటోలు దిగాలoటే కాలిరి గిన నాకూ ఇబ్బందే అయితున్నది. ఒక్క మనిషి వేలమందితోని నిలబ డి ఫోటోలు దిగితే ఎంత కష్టమో మీ రే చెప్పండి. అందుకే సందర్శకుల ను ముందస్తు సమాచారం మేరకు మాత్రమే ఆహ్వానించాలనుకున్నాం.వారానికి రెండు నియోజకవర్గాల (two concenttis)పేర్లు చెప్తం. చెప్పిన వాళ్లు మాత్రమే వస్తే లొల్లి లేకుంట వాళ్లతో కడుపు నిండ మాట్లాడుకొని పంపియ్యొ చ్చు. మీరు నా మీద ఇంతగా చూపి స్తున్న అభిమానానికి మరోసారి మీకు పేరు పేరునా ధన్యవాదాలు అని కేసీఆర్ (KCR) విజ్ఞప్తి చేశారు.