Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

T20 World Cup:అటు అరేబియా సముద్రం ఇటు అభిమాన జనసంద్రం

–జగజ్జీతలకు జేజేలు పలుకుతూ బ్రహ్మరథం పట్టిన అభిమానం
–భారత క్రికెట్‌ వీరులకు అట్టహాస మైన అపూర్వ స్వాగతం
–ప్రపంచ కప్‌తో వచ్చిన రోహిత్‌శర్మ టీంకు ముంబై నగరం జైకొట్టినవైనం
–రోహిత్‌ సేనకు ఘనస్వాగతం, రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ అందజేత

T20 World Cup:ప్రజా దీవెన, ముంబై: దేశం యావత్తు మురిసిపోయింది. టి20 ప్రపంచ కప్పు (T20 World Cup) జగజ్జేతగా నిలిచిన సమయంలో దేశం మొత్తం ఒకేసారి సంబరపడిన విధంగానే గెలిచిన కప్ తో దేశంలో అడుగుడిన భారత క్రికెట్ బృందానికి (Indian cricket team) ముంబై నగరం మురిసిపోయే విధంగా స్వాగతo పలికింది. అటు అరేబియా సము ద్రం, ఇటు అభిమాన జన సంద్రం బ్రహ్మరథం పడుతూ భారత క్రికెట్‌ వీరులకు అపూర్వ స్వాగతం అం దించింది. టి20 ప్రపంచ కప్‌తో వచ్చిన రోహిత్‌శర్మ బృందానికి ముంబై మహానగరం జయహో అంటూ జై కొట్టింది. ఢిల్లీలో విమానం (delhi airport)దిగిన వెంటనే మొదలైన అభి మాన ప్రవాహం ముంబై మెరైన్‌ డ్రైవ్‌ వరకు దేదీప్యమానంగా కొనసాగింది. జోరున వర్షం కురు స్తున్నా లెక్క చేయకుండా వెన్నంటి సాగుతూ గంటన్నర పాటు జరిగిన విజయ యాత్ర వాంఖడే వరకు ఆకాశాన్నంటిన ఆనందోత్సాహాల మధ్య కొనసాగింది. దిక్కులు దద్ద రిల్లే నినాదాలతో మైదానం హోరె త్తింది. ఈ దృశ్యాలను వీక్షించిన దే శంలోని ప్రతి మనసు భావోద్వేగం లో తడిసి ముద్దయింది. టీ20 ప్ర పంచకప్‌ విజేత టీమిండియాకు భారత క్రికెట్‌ అభిమానులు నభూ తో నా భవిష్యత్తు అనే రీతిలో స్వాగతం పలికి చరిత్రలో నిలిచి పోయారు. ఓ వైపు చిరుజల్లులు కురిసినా షెడ్యూల్‌ ప్రకారం ముంబై కి ఆటగాళ్ల రాక ఆలస్యమైనా గంట లకొద్దీ వేచి చూస్తూ జగజ్జేతల కో సం ఎదురుచూశారు. విక్టరీ పరే డ్‌ను ప్రత్యక్షంగా తిలకించేందుకు నారీమన్‌ పాయింట్‌లోని మెరైన్‌ డ్రైవ్‌ మధ్యాహ్నం నుంచే వేలాది మందితో కిక్కిరిసిపోయింది. వారిని చూసి చాంపియన్స్‌ జెర్సీ ధరించిన ఆటగాళ్లు సైతం తమ బడలికను మర్చిపోయి పులకించిపోయారు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత కూడా గురువారం రోజంతా టీమిండియా ఆటగాళ్లు (Team India players)ఊపిరి సలపని బిజీ షె డ్యూల్‌తో గడపడం గమనార్హం.

చిందులేసిన రోహిత్‌, సూర్య..
బార్బడోస్‌ నుంచి 16 గంటల నాన్‌ స్టాప్‌ ప్రయాణం తర్వాత ఉదయం 6 గంటలకు జట్టు న్యూఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. అప్పటికే రాత్రి నుంచే వందలాది మంది అభిమానులు వారికోసం నిరీక్షిస్తూ కనిపిం చారు. ట్రోఫీతో కెప్టెన్‌ రోహిత్‌ (Captain Rohit with the trophy)విమా నం నుంచి బయటికి రాగా బోర్డు కార్యదర్శి జైషా పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికాడు. అక్కడే కేక్‌ను కట్‌ చేసి రెండు బస్సుల్లో ఆటగా ళ్లంతా దారిపొడవునా అభిమాను లకు అభివాదం తెలుపుతూ స్థానిక ఐటీసీ మౌర్య హోటల్‌కు చేరారు. ఈ క్రమంలో అక్కడ భాంగ్రా కళాకా రులతో రోహిత్‌ కూడా సరదాగా నృ త్యం చేస్తూ ఉత్సాహంగా కనిపిం చాడు. అతడితో పాటు సూర్యకు మార్‌, హార్దిక్‌ పాండ్యా, పంత్‌ కూడా జత కలిశారు.చోలే బటూరేహోటల్‌ సిబ్బంది ఆటగాళ్ల కోసం ప్రత్యేక అల్పాహారాన్ని సిద్ధం చేశారు. ముంబైకర్‌ రోహిత్‌కు ఎంతో ఇష్ట మైన వడా పావ్‌ విరాట్‌కు నచ్చే అమృత్‌సర్‌ స్టయిల్‌ చోలే బటూరేని అల్పాహారంగా అందించారు.అలాగే ప్లేయర్ల గదులను అలంకరించడం తో పాటు చాక్లెట్‌తో బాల్స్‌, బ్యాట్‌, పిచ్‌ను (bats, balls) తయారుచేశారు. అనంత రం ప్రధాని మోదీతో సమావేశమ య్యేందుకు ఆటగాళ్లంతా ప్రత్యేక బస్సులో ఉదయం 11 గంటలకు 7, లోక్‌ కళ్యాణ్‌ మార్గ్‌కు చేరుకున్నా రు. దాదాపు 2 గంటల పాటు వీరి భేటీ సాగింది.

అనంతరం హోటల్‌ నుంచి మధ్యాహ్నం ముంబైకి వెళ్లేం దుకు ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరా రు. తదననంతరం సాయంత్రం చిరు జల్లుల మధ్యే ముంబై ఛత్ర పతి విమానాశ్రయంలో ఆటగాళ్లకు అపూర్వ స్వాగతం లభించింది. విస్తారా ఎయిర్‌క్రాఫ్ట్‌ రన్‌వేపై దిగ గానే మూడు ఎస్కార్ట్‌ వాహనాలు గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌తో స్వాగతం పలి కాయి. వీటి వెనకాల విమానం నెమ్మదిగా ముందుకు సాగింది. ఇక టెర్మినల్‌ దగ్గరకు రాగానే విమానా నికి ఇరు వైపులా ఉన్న రెండు ఫైరిం జన్లు వాటర్‌ సెల్యూట్‌ ఇచ్చాయి. ఆ తర్వాత విమానాశ్రయంలో కేక్‌ కట్‌ చేశాక రెడ్‌ కార్పెట్‌పై నడుచు కుంటూ రోహిత్‌ (rohit) బృందం బయటికి వచ్చింది.ముంబైలో ఆటగాళ్లు దిగ డానికి గంటల ముందే అభిమానుల సంబరాలు ఆరంభమయ్యాయి. పరేడ్‌ జరిగే నారిమన్‌ పాయింట్‌ నుంచి వాంఖడే స్టేడియం వరకు కిలో మీటర్‌ దూరంలో ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలనంత మంది జనంతో నిండిపోయింది. చిన్నారులు, యువకులు, మహి ళలు, వృద్ధులు సైతం అక్కడ గుమి గూడి త్రివర్ణ పతాకాలను రెపరెప లాడించారు.

ఇక ఉచిత ప్రవేశం కల్పించిన వాంఖడే స్టేడియం (Wankhede Stadium) మ ధ్యాహ్నమే నిమిషాల వ్యవధిలో నిండిపోయింది.ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక బస్సులో హోటల్‌కు వెళ్లిన జట్టు కాస్త సేద తీరాక నారిమన్‌ పాయింట్‌లోని ఎన్‌సీపీఏ ఆఫీసుకు చేరుకుంది. షెడ్యూల్‌కన్నా రెండు గంటల ఆలస్యంగా రాత్రి 7.40కి అక్కడి నుంచి వాంఖడేకు విక్టరీ పరేడ్‌ ఆరంభమైంది. వేలాదిమంది అభిమానుల మధ్య గంటన్నర పా టు సాగింది. తమకోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు అంతే ఉత్సాహంగా రోహిత్‌, విరా ట్‌, హార్దిక్‌, సూర్యకుమార్‌, సిరాజ్‌, జడేజా (Rohit, Virat, Hardik, Suryakumar, Siraj, Jadeja) ఇలా అందరూ అభివాదం చేస్తూ ఓపెన్‌ టాప్‌ బస్సులో ముం దుకుసాగారు. ఇక రోహిత్‌, కోహ్లీ ఇద్దరూ కలిసి ఫ్యాన్స్‌కు ట్రోఫీని చూపించడంతో ఒక్కసారిగా మెరైన్‌ డ్రైవ్‌ హోరెత్తిపోయింది. అలాగే తమ అభిమాన క్రికెటర్లను సెల్‌ ఫోన్లలో బంధించేందుకు వారు కూడా పోటీపడ్డారు. ఇక వాంఖడే లో హార్దిక్‌ పాండ్యాకు ప్రేక్షకులు నీరా జనం పట్టారు. ఫైనల్లోనే కాకుండా టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup) తను మెరుగైన ఆటతీరుతో విజయంలో కీలకమ య్యాడు. దీంతో ముంబై ఇండియ న్స్‌ కెప్టెన్సీ విషయంలో ఎక్కడైతే ఎగతాళికి గురయ్యాడో, అదే చోట హార్దిక్‌, హార్దిక్‌ అంటూ గర్వంగా పిలిపించుకోవడం కొసమెరుపు.