–జాతీయ రహదారిని విస్తరించాలి
–హైదరాబాద్, అమరావతి మధ్య గ్రీన్‌ఫీల్డ్
–పూర్తిస్థాయిలో తేరుకునే వరకు ఏపీకి అండగా నిలబడండి
— మోదీ, షాకు ఏపీ సీఎం చంద్రబా బు వినతి
— ఏపీ పునర్నిర్మాణానికి చేయూత మిస్తామన్న మోదీ
Amit Shah-Chandrababu Naidu: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతి దాకా గ్రీన్ ఫీల్డ్ హైవేను అభివృద్ధి చేయాలని, హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేదా ఎనిమిది లేన్ల హైవేగా మార్చాలని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu Naidu)కేంద్ర హోం మంత్రి అమి త్ షాకు (Amit Shah) విజ్ఞప్తి చేశారు. అలాగే ఏపీ జెన్కో, తెలంగాణ డిస్కమ్‌ల మధ్య ఉన్న ఆర్థిక సమస్యలను కూడాపరి ష్కరించాలని కోరారు. ముఖ్యమం త్రిగా పగ్గాలు చేపట్టాక తొలిసారి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు గురువా రం అక్కడ ప్రధాని మోదీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) సహా ఆరు గురు కేంద్ర మంత్రులను కలిసి ఏపీ పునర్నిర్మాణానికి చేయూతనివ్వా లని అభ్యర్థించారు. గత ఐదేళ్లలో ఆర్థికంగా అస్తవ్యస్తమై, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్ర ప్రదేశ్‌ను ఆదుకోవాలని, రాష్ట్రం కోలుకునేంతవరకూ ఆర్థిక సహ కారం అందించాలని ప్రధాని మోదీ ని కోరారు. నిధుల నిర్వహణలో గత ప్రభుత్వం తీవ్ర అక్రమాలకు పాల్పడినందువల్ల ఏపీంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందన్నారు. రాష్ట్రా నికి ఆర్థికంగా చేయూతనివ్వడం తో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మా ణానికి సంపూర్ణ సహకారం, రాజ ధాని అమరాతిలో ప్రభుత్వ సము దాయాలు, మౌలిక సదుపాయాల పూర్తికి సమగ్ర ఆర్థిక మద్దతు పారి శ్రామికాభివృద్ధికి ప్రోత్సాహకాలు, రోడ్లు, వంతెనలు, నీటిపారుదల, తాగునీటి ప్రాజెక్టుల వంటి అత్య వసర రంగాలను దృష్టిలో ఉంచు కుని పెట్టుబడి వ్యయం కోసం ప్రత్యే క సాయం కింద అదనపు కేటాయిం పులు, బుందేల్‌ఖండ్ ప్యాకేజీ (Bundelkhand Package) త రహాలో వెనుకబడినప్రాంతాలకు మద్దతు, దుగరాజపట్నం రేవు అభివృద్ధికి తోడ్పాటు అందించా లని అభ్యర్థించారు. విభజన కంటే గడిచిన ఐదేళ్లలో జగన్ పాలన వల్ల రాష్ట్రానికి కలిగిన నష్టమే ఎక్కువని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక వనరుల లోటు తీవ్రంగా ఉం దని ప్రధానికి వివరించారు.
రాష్ట్రా నికి కేంద్ర ప్రభుత్వం (Central Govt)ఆర్థికంగా చేయూతనిస్తేనే ఈ సవాళ్లను ఎదుర్కోగలమని పేర్కొన్నారు. చంద్రబాబు విజ్ఞప్తికి ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ఏపీ అభివృద్ధికి అన్ని విధాలా తోడ్ప డతామని, రాజధాని అమరావతి సహా రాష్ట్ర పునర్నిర్మాణానికి అవ సరమైన సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పారు. అలాగే కేంద్ర మంత్రులు అమిత్ షా, నితి న్గడ్కరీ, ఖట్టర్, పీయూష్గోయ ల్, శివరాజ్‌సింగ్ చౌహాన్, హర్దీప్ సింగ్‌పురీ లు ఏపీ పునర్నిర్మాణానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అమిత్ షా, చంద్రబాబు దాదాపు అరగంట సేపు కీలక సమాలోచ నలు జరిపారు. దేశ, రాష్ట్రాభివృద్ధి కి సంబంధించి అనేక అంశాలను చంద్రబాబుతో చర్చించానని హోం మంత్రి స్వయంగా ట్వీట్ చేశారు. ఎన్డీయే ప్రభుత్వం వికసిత్ భారత్ (A developed India)తో పాటు వికసిత్ ఆంధ్రప్రదేశ్‌కు కట్టుబడి ఉందని తెలిపారు. కాగా చంద్రబాబు శుక్రవారం కేంద్ర మం త్రులు నిర్మలా సీతారామన్, రాజ్నా థ్‌సింగ్, జేపీ నడ్డా, రాందాస్ అథవా లేతో పాటు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం, జపాన్ రాయబారి సుజుకి హిరోషీని కలిసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.