–అధికారంలోకి రాగానే హైకోర్టు
నిర్మాణానికి 100 ఎకరాలిచ్చాం
–సాధ్యమైన త్వరితగతిన హెచ్ ఆర్సీ చైర్మన్,సభ్యులను నియమి స్తాం
–నల్సార్, క్యాపిటల్ ఫౌండేషన్
అవార్డుల కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: ఉత్తమ ప్రమాణాలతో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే మార్గదర్శకత్వంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో నూత న హైకోర్టు భవన సముదాయాన్ని నిర్మిస్తామని, న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నా మని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress party)ఏర్పడిన అతి కొద్ది రోజుల్లోనే కొత్త హైకోర్టు నిర్మా ణం కోసం రాజేంద్రనగర్‌లో వంద ఎకరాలను కేటాయించామని తెలి పారు. గత ప్రభుత్వ హయాంలో తప్పులు జరిగాయని, ప్రజ లు అనూహ్యమైన తీర్పు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించా రన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రజాస్వా మ్య వ్యవస్థలను పునరుద్ధరిస్తా మని చెప్పారు. న్యాయవ్యవస్థకు అత్యం త గౌరవం ఇస్తామని, కోర్టు తీర్పులను, న్యాయవ్యవస్థ సల హాలను పాటిస్తామన్నారు. క్యాపిట ల్ ఫౌండేషన్ (capital foundation)వార్షిక ఉపన్యాసం, అవార్డుల పంపిణీ కార్యక్రమం శనివారం శామీర్‌పేట్ నల్సార్ యూనివర్సిటీలో జరిగింది.
ఈ కార్యక్రమంలో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ వెంకటరమణి, తెలంగాణ హైకోర్టు (Telangana High court)చీఫ్ జస్టిస్, నల్సార్ చాన్స్‌లర్ అలోక్ అరాధే, సుప్రీంమాజీ న్యాయమూర్తి, క్యాపిటల్ ఫౌండేషన్ చైర్మన్ ఏకే పట్నాయక్, క్యాపిటల్ ఫౌండేషన్ సెక్రటరీ వినోద్ సేథి, ప్రొఫెసర్ కే పురుషోత్తంరెడ్డి, నల్సార్ వైస్ ఛాన్స్లర్ శ్రీకృష్ణదేవరావు తదితరులతో కలిసి మంత్రి ఉత్తమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎంతో మాట్లాడి హక్కుల మానవ కమిషన్ కు త్వరలోనే చైర్మన్, సభ్యుల నియామకాలు జరిగేలా కృషిచేస్తా నని చెప్పారు. కాగా, జస్టిస్ జేఎస్ వర్మ జాతీయ అవార్డును హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధేకు అటార్నీ జనరల్ వెంకటరమణి అందజేశారు. జస్టిస్ దీపాంకర్ ప్రసాద్ గుప్తా జాతీయ అవార్డు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ పీఎన్ భగవతి జాతీయ అవార్డును జస్టిస్ అజయ్ లాంబా, కేకే వేణుగోపాల్ జాతీయ అవార్డును సీనియర్ న్యాయవాది పరాగ్ పీ త్రిపాఠీ, కే పరాశరన్ జాతీయ అవార్డును ఎస్ఎస్ నాగానంద్, ఎన్ నరోత్తంరెడ్డి జాతీయ అవార్డును దిలీప్‌రెడ్డి, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్‌కేర్ నేషనల్ అవార్డు డాక్టర్ అల్లంకి కిషన్‌రావు, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అవార్డు డాక్టర్ కే తులసీరావు, డాక్టర్ శివాజీరావు అవార్డును డాక్టర్ నర్సింహారెడ్డి, క్యాపిటల్ ఫౌండేషన్ నేషనల్ అవార్డును ప్రొఫెసర్ రామినేని శివరామ ప్రసాద్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూ ర్తులు, తెలంగాణ హైకోర్టు జడ్జిలు జస్టిస్ వినోద్‌కుమార్, జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ సూరేపల్లి నంద, జస్టిస్ విజయ్ సేన్‌రెడ్డి, అడ్వకేట్ జనరల్ సురద్శ న్‌రెడ్డి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.