Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Governor Radhakrishnan: బిల్లులకు మోక్షం..!

–పెండింగ్ బిల్లులపై సంతకం పెట్టిన గవర్నర్ రాధాకృష్ణన్
–వర్సిటీలుగా ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలకు హోదా
–నాలుగు టిమ్స్‌ ఆస్పత్రులకు నిమ్స్‌ అర్హత
–మునిసిపాలిటీల్లో కో ఆప్షన్ సభ్యుల పెంపు
–ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ములుగు ఇక మునిసిపాలిటీ

Governor Radhakrishnan: ప్రజా దీవెన, హైదరాబాద్‌: సుదీర్ఘ కాలం పాటు దాదాపు రెండేళ్లుగా గవర్నర్‌ కార్యాలయం లో పెండింగ్‌ లో (pending)ఉన్న పలు కీలక బిల్లులకు మోక్షం లభించింది. దాదాపు పెండింగ్ లో ఉన్న అన్ని బిల్లులకు (bills) తెలంగాణ ఇన్‌చార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్ (‌Radhakrishnan) తెలిపారు. కేసీఆర్‌ (kcr)ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయనకు అప్పటి గవర్నర్‌ తమిళ సైకి మధ్య తలెత్తిన వివాదాల కార ణంగా అసెంబ్లీ ఉభయ సభల్లో ఆ మోదం పొందిన పది బిల్లులు రాజ్‌ భవన్‌లో (raj bhavan) చిక్కుకుపోయాయి.

ఆ బిల్లుల పరిష్కారం కోసం గవర్న ర్‌ను కలిసే ప్రయత్నం చేయకపోగా కేసీఆర్‌ న్యాయమార్గo లో హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించారు. న్యాయస్థానాల సూచనల మేరకు అప్పటి గవర్నర్‌ కార్యాలయం (governor office) 20 23 ఏప్రిల్‌లో మూడు బిల్లులకు ఆమోదం తెలపగా మిగతా ఏడు బిల్లులను పరిశీలన పేరుతో పెండిం గ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy)చొరవ తీసుకొని, గవర్నర్‌ను ఒప్పించడం తో ఇప్పుడు ఏడు బిల్లులకు మోక్షం లభించింది. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. బిల్లు ల్లో ప్రధానమైనది గత గవర్నర్‌తో వివాదానికి కారణమైన ప్రైవేటు వర్సిటీల బిల్లు కావడం, గవర్నర్‌ ఆమోదం తెలపకపోవడంతో గురునానక్‌, శ్రీనిధి, మరికొన్ని ఇంజనీరింగ్‌ కాలేజీలకు వర్సిటీ గుర్తింపు లభించక వందలాది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగో చరమైంది. వారిని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం తనమీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందని అప్పటి గవర్న ర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా.

ఇప్పుడు ప్రైవేటు విశ్వవిద్యాలయా ల బిల్లుకు (bills) ఆమోదం లభించడంతో ఆ కళాశాలలన్నింటికీ విశ్వవిద్యా లయ హోదా లభించినట్లయింది. మరో ముఖ్యమైన బిల్లు మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లు కాగా పాత చట్టం ప్రకారం మున్సిపాలిటీల్లో ఇద్దరు, కార్పొరేషన్లలో నలుగురు కో–ఆప్టెడ్‌ సభ్యులను నియమించు కోవచ్చుని, కొత్త చట్టం ప్రకారం వీళ్ల కు అదనంగా ప్రత్యేక పరిజ్ఞానం, విశేష అనుభవం కలిగిన వారిని మున్సిపాలిటీల్లో ఇద్దరు, కార్పొరేష న్లలో ఆరుగురి వరకు నియమించు కోవచ్చు. ములుగు పంచాయతీని మున్సిపాలిటీగా మారుస్తూ మరో సవరణ చేశారు. హైదరాబాద్‌ కార్పొ రేషన్‌ ఓటర్ల (ration voters) జాబితాను జనవరితో పాటు ఏప్రిల్‌, మే నెలల్లో కూడా సవరించి పబ్లిష్‌ చేసేందుకు అనుమతించారు. పంచాయతీరాజ్‌ చట్టానికి చేసిన సవరణలను కూడా ఆమోదించారు. అందులో భాగంగా భద్రాచలాన్ని మూడు మేజర్‌ గ్రామ పంచాయతీలుగా విభజించను న్నారు. మొదట మున్సిపాలిటీగా మార్చేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం (BRS) ప్రయత్నించగా, షెడ్యూల్డ్‌ ఏరియా కావడంతో గవర్నర్‌ ఆమోదం తెలపలేదు. దాంతో ఆ ఆలోచనను విరమించుకొని రెండు పంచాయతీ లుగా విభజించే ప్రయత్నం చేసింది. చివరకు భద్రాచలం, సీతారాంనగర్‌, శాంతినగర్‌ గ్రామ పంచాయతీలుగా విభజిస్తూ చేసిన సవరణకు గవర్న ర్‌ ఆమోదం తెలిపారు.

టిమ్స్‌ పేరు తో రాజధాని నగరానికి నలువైపు లా నిర్మిస్తున్న నాలుగు ఆస్పత్రుల కు నిమ్స్‌, ఎయిమ్స్‌ మాదిరిగా స్వయం ప్రతిపత్తి హోదా దక్కనుం ది. ఈ మేరకు తెలంగాణ ఇన్‌స్టి ట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె స్‌(టిమ్స్‌) బిల్లుకు గవర్నర్‌ ఆమో దం తెలిపారు. ఇది కూడా బీఆర్‌ ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఉభయ సభలు ఆమోదించిన బిల్లులే. గచ్చిబౌలి, ఎల్బీనగర్‌, సనత్‌నగర్‌, అల్వాల్‌లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. ఈ బిల్లు ఆమోదంతో టిమ్స్‌లకు ప్రత్యేక పాలకమండలి ఉంటుంది. వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర పారా మెడికల్‌ స్టాఫ్‌ను స్వయంగా నియమించుకునే అధికారం ఈ సంస్థలకు ఉంటుంది.

సొంతంగా ఆదాయాన్ని, నిధులను సమకూర్చుకొనే వెసులుబాటు కూడా ఉంటుంది. ఒక్కో టీమ్స్‌లో 150 గదులు ప్రైవేటు వ్యక్తులకు వైద్య సేవలకు ఉపయోగిస్తారు. టిమ్స్‌లకు చైర్మన్‌గా ముఖ్యమంత్రి ఉంటారు. నిమ్స్‌, ఎయిమ్స్‌ మాదిరిగా డైరెక్టర్స్‌ను నియమిస్తారు. పీజీ మెడికల్‌ సీట్లతో పాటు మెడికల్‌ రీసెర్చ్‌, సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తారు. మైనార్టీ కమిషన్‌లో జైన్‌ సామాజిక వర్గానికికూడా ప్రాతినిధ్యం కల్పించారు. కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లు, బస్‌ భవన్‌ భూములు ఉండే ఆజామాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా బిల్లును కూడా గవర్నర్‌ పరిశీలించినట్లు తెలిసింది. గవర్నర్ కార్యాలయం (governor office)అధికారికంగా వెల్లడిం చిన తర్వాత పూర్తి వివరాలు తెలియాల్సి ఉంటుంది.